ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు (డిసెంబరు 21-22, 2024)
Posted On:
22 DEC 2024 6:03PM by PIB Hyderabad
వరుస సంఖ్య
|
ఎంఓయూ/ఒప్పందం
|
లక్ష్యం
|
1
|
రక్షణ రంగంలో సహకారం అంశంపై భారతదేశానికి, కువైట్‌కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఓయూ)
|
ఈ ఎంఓయూ రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారానికి సంస్థాగత రూపురేఖలను అందిస్తుంది. ఈ ఎంఓయూలో భాగంగా శిక్షణనివ్వడం, సిబ్బందికీ, నిపుణులకూ రెండు దేశాల్లోనూ పర్యటించే అవకాశాల్ని కల్పించడం, సైన్యపరంగా సంయుక్త విన్యాసాల్ని నిర్వహించడం, రక్షణ రంగ పరిశ్రమల్లో సహకరించుకోవడం, రక్షణ సామగ్రి సరఫరాలతోపాటు పరిశోధన -అభివృద్ధిలలో సహకారం, తదితర అంశాలు ఈ ఎంఓయూ పరిధిలో భాగంగా ఉన్నాయి.
|
2
|
భారత్, కువైట్‌ల మధ్య 2025-2029 మధ్యకాలంలో కల్చరల్ ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్ (సీఈపీ)ని అమలు చేయడం
|
ఈ సీఈపీ సంస్కృతి రంగంలో పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కీ, ఉత్సవాల నిర్వహణకూ, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికీ సహకారాన్ని అందిస్తుంది. దీనికి అదనంగా కళలు, సంగీతం, నృత్యం, సాహిత్యం, రంగస్థలం విభాగాల్లో ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను ఇప్పటికన్నా ఎక్కువగా ప్రోత్సహించడానికి కూడా సీఈపీ తోడ్పడుతుంది.
|
3
|
క్రీడారంగంలో సహకారానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (ఈపీ)ని 2025 మొదలు 2028 వరకూ అమలు చేయడం
|
భారత్‌కు, కువైట్‌కు మధ్య క్రీడా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ఈపీ బలపరచనుంది. ఈపీ లో భాగంగా రెండు దేశాల క్రీడారంగ ప్రముఖులు వారి అనుభవ సారాన్ని పంచుకోవడానికి వీలుగా అటువారు ఇటూ, ఇటువారు అటూ పర్యటించడానికి అవకాశాల్ని ప్రభుత్వాలు కల్పిస్తాయి. క్రీడారంగంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో, ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, క్రీడాకారులకు వైద్యచికిత్స, క్రీడల నిర్వహణ, క్రీడలకు సంబంధించిన ప్రసార మాధ్యమాలు, తదితర అంశాల్లో ప్రావీణ్యాన్ని కూడా ఒకదేశానికి మరొక దేశం స్నేహపూర్వకంగా అందజేసుకొంటాయి.
|
4
|
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)లో కువైట్‌కు సభ్యత్వం.
|
సౌర ఇంధన వినియోగం అంశంపై అంతర్జాతీయ సౌరకూటమి సభ్యదేశాలకు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అభివృద్ధిపథంలో ముందంజ వేసే క్రమంలో వాతావరణంలోకి కర్బనాన్ని తక్కువ స్థాయిలో విడిచిపెట్టే అంశంలో సభ్యదేశాలకు సాయపడడానికీ, సౌర ఇంధనాన్ని మరింత ఎక్కువగా ఉపయోగించుకోవడంలో ఎదురయ్యే ముఖ్య ఉమ్మడి సవాళ్ళను పరిష్కరించడానికీ ఐఎస్ఏ అండదండలను అందిస్తుంది.
|
***
(Release ID: 2087222)
Visitor Counter : 52
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam