రక్షణ మంత్రిత్వ శాఖ
మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ భేటీ ద్వైపాక్షిక రక్షణ సహకారంలో వివిధ అంశాలపై చర్చలు
Posted On:
10 DEC 2024 9:01PM by PIB Hyderabad
మిలటరీ, మిలటరీ సహకారంపై భారత్-రష్యా అంతర ప్రభుత్వ కమిషన్ (ఐఆర్ఐజీసీ-ఎం అండ్ ఎంటీసీ) 21వ సమావేశాల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు (డిసెంబర్, 10) భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరఫున అధ్యక్షుడు పుతిన్‌కు రక్షణమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ద్వైపాక్షిక రక్షణ సహకారానికి సంబంధించిన పలు అంశాలపై శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చర్చించారు. రెండు దేశాల మధ్య ఉన్న భాగస్వామ్యానికి అపారమైన శక్తి ఉందని, ఉమ్మడి ప్రయత్నాలు గొప్ప ఫలితాలకు మార్గం ఏర్పరుస్తాయని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డారు.
‘‘మన రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం ఎత్తయిన పర్వతం కంటే ఉన్నతమైనది, మహా సముద్రానికంటే లోతైనది’’ అని సమావేశంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారత్ ఎల్లప్పుడూ రష్యా మిత్రులకు అండగా నిలుస్తుందని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని తెలిపారు.
(Release ID: 2083476)
Visitor Counter : 8