హోం మంత్రిత్వ శాఖ
జాతీయ స్వయంచాలిత వేలిముద్రల గుర్తింపు వ్యవస్థ (ఎన్ఏఎఫ్ఐఎస్)
Posted On:
04 DEC 2024 4:44PM by PIB Hyderabad
జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) జాతీయ స్వయంచాలిత వేలిముద్రల గుర్తింపు వ్యవస్థ (ఎన్ఏఎఫ్ఐఎస్) ప్రాజెక్టును అమలు చేసింది. అన్ని జిల్లాలు, పోలిస్ కమిషనరేట్లు, రాష్ట్ర వేలిముద్రల సంస్థ, కేంద్ర వేలిముద్రల సంస్థ, కేంద్ర చట్ట అమలు సంస్థలకు పరికరాలను అందించడం ద్వారా వేలిముద్రలకు సంబంధించి జాతీయ స్థాయి భాండాగారాన్ని ఏర్పాటు చేసింది.
అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను ఎన్ఏఎఫ్ఐఎస్ తో అనుసంధానం చేశారు.
దీని అమలు ద్వారా అక్టోబరు 31 నాటికి 1.06 కోట్ల మంది నేరస్తుల వేలిముద్రల రికార్డులతో శోధనకు అనువైన జాతీయ స్థాయి బాండాగారం ఏర్పాటైంది. ఇవి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని అధీకృత వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. నేరం జరిగిన ప్రాంతాల్లో లభించిన వేలిముద్రలను జాతీయ నేరస్తుల వేలిముద్రల డేటాబేస్ తో పోల్చిచూడడం ద్వారా సమర్థవంతమైన, వేగవంతమైన దర్యాప్తునకు దోహదం చేస్తూ.. దేశవ్యాప్తంగా సంక్లిష్టమైన కేసులను పరిష్కరించడంలో ఎన్ఏఎఫ్ఐఎస్ కీలక పాత్ర పోషించింది.
హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2081130)
Visitor Counter : 38