జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో రెండు అంకుర సంస్థలకు కేంద్రం ఆమోద ముద్ర ఐఐటీలతో సహా 6 విద్యా సంస్థల్లో టెక్నికల్ టెక్స్‌టైల్స్‌ కోర్సులు

Posted On: 05 DEC 2024 12:09PM by PIB Hyderabad

జాతీయ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్‌లో భాగంగా ఎంపవర్డ్ ప్రోగ్రామ్ కమిటీ (ఈపీసీ) తొమ్మిదో సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. జౌళి శాఖ కార్యదర్శి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ‘గ్రాంట్ ఫర్ రిసర్చ్ అండ్ ఆంట్రప్రన్యూర్ షిప్ ఎక్రాస్ యాస్పైరింగ్ ఇనొవేటర్స్ ఇన్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ (జీఆర్ఈఏటీ)’ లో భాగంగా చెరో రూ.50 లక్షల గ్రాంటును మంజూరు చేస్తూ రెండు అంకుర సంస్థల (స్టార్ట్-అప్స్)ను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఈ కమిటీ ఆమోదం తెలిపింది.

 

‘జనరల్ గైడ్‌లైన్స్ ఫర్ ఎనేబ్లింగ్ ఆఫ్ అకడమిక్ ఇనిస్టిట్యూట్స్ ఇన్ టెక్నికల్ టెక్స్‌టైల్స్’ కింద 6 విద్యా సంస్థలు రూ.14 కోట్ల గ్రాంటుతో టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టడానికి కూడా ఈపీసీ ఆమోదం తెలిపింది.

 

ఆమోదాన్ని కోరిన అంకుర సంస్థలు... దీర్ఘకాలం మన్నిక కలిగిన వస్త్రాలు, వైద్య వస్త్రాలపై ప్రధానంగా పనిచేస్తున్నాయి. ఆమోదాన్ని పొందిన విద్యా సంస్థలు మెడికల్ టెక్స్‌టైల్స్, మొబైల్ టెక్స్‌టైల్స్, జియో టెక్స్‌టైల్స్, జియో సింథెటిక్స్ మొదలైన సాంకేతికతలను చొప్పించిన వస్త్రాల ఉపయోగంతోపాటు సంబంధిత రంగాల్లో బీ.టెక్ కోర్సులను కొత్తగా ప్రారంభించేందుకు ప్రతిపాదించాయి. 

******

 


(Release ID: 2081067)