పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: ఈపీఆర్ మార్గదర్శకాలు

Posted On: 02 DEC 2024 4:07PM by PIB Hyderabad

ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్) పరిధిలోకి వచ్చే వివిధ రకాల వ్యర్థాల విషయంలో నమోదు ప్రక్రియ పూర్తయిన ఉత్పత్తిదారు సంస్థలు, దిగుమతిదారు సంస్థలు, బ్రాండు యాజమాన్య సంస్థల (పీఐబీఓస్) సంఖ్య ఈ కింద పేర్కొన్న మాదిరిగా ఉంది.
 

వ్యర్థాల్లోని రకాలు

ఈపీఆర్ కింద నమోదైన నిర్మాణ సంస్థలు

ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌కు సంబంధించిన వ్యర్థాలు

44,659

ఎలక్ట్రానిక్ వ్యర్థపదార్థాలు (ఈ-వేస్ట్)

7050

బ్యాటరీలకు సంబంధించిన వ్యర్థాలు

2933

పనికిరాని టైర్లు

179

వాడిన నూనె

8

 

 


ప్లాస్టిక్ ప్యాకేజింగ్, జీవనకాలం ముగిసిన లేదా పనికిరావని తీసేసిన లేదా వదిలేసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్), బ్యాటరీ వ్యర్థాలు, నిరుపయోగంగా ఉన్న టైర్లు, ఉపయోగించిన నూనెల వంటి వ్యర్థాల శుద్ధి సంస్థలను ఈపీఆర్ నిబంధనావళి ప్రకారం  రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించే కన్నా ముందే రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండలులు (ఎస్‌పీసీబీ), కాలుష్య నియంత్రణ సంఘాలు (పీసీసీ) ప్రమాణీకరిస్తూ ఉంటాయి. అంతేకాకుండా, పీఐబీఓలతోపాటు ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసర్స్ (పీడబ్ల్యూపీ)ల ఆడిట్‌ను కూడా సీపీసీబీ, ఎస్‌పీసీబీ, పీసీసీలు చేపట్టడానికి ప్లాస్టిక్ ప్యాకేజింగుకు సంబంధించిన ఈపీఆర్ మార్గదర్శకాలు అనుమతినిస్తాయి.  ఈపీఆర్ సర్టిఫికెట్లను రీసైకిలింగ్‌ పనిలో నిమగ్నమైన సంస్థలు తమకు సంబంధించిన కేంద్రీకృత ఆన్‌లైన్ ఈపీఆర్ పోర్టల్ లో అప్‌లోడ్ చేస్తుంటాయి.

పీఐబీఓలను సీపీసీబీ గానీ లేదా నిర్దేశిత ఏజెన్సీ గానీ తనిఖీ చేయడానికి, ఎప్పటికప్పుడు ఆడిట్‌ను నిర్వహించడానికి వెసులుబాటు ఉంది.  దీనికి తోడు, పీడబ్ల్యూపీలు నియమాలను ఎంతవరకు పాటిస్తున్నాయనే విషయాన్ని ప్రమాణీకరించడానికి తనిఖీ, నిర్ణీత కాల ప్రాతిపదికన ఆడిట్ ను నిర్వహించడం అనే రెండు మార్గాలను సీపీసీబీ అనుసరించి నిర్ధారిస్తుంది.  ఒక రాష్ట్రంలో గాని లేదా కేంద్రపాలిత ప్రాంతంలో గాని కార్యకలాపాలను నిర్వహిస్తున్న పీడబ్ల్యూపీలు, పీఐబీఓల విషయానికి వస్తే, అవసరమనుకుంటే తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఎస్‌పీసీబీని లేదా పీసీసీని సీపీసీబీ ఆదేశించేందుకు వీలుంది.

ప్లాస్టిక్ వ్యర్థాల స్థాయిని కచ్చితంగా తెలుసుకోవడానికి పిఐబీఓలు ఏటా దాఖలు చేసే రిటర్నులు ఉపయోగపడతాయి. దీనిలో భాగంగా, ప్యాకేజింగుకు వాడే ముడిసరుకు కొనుగోళ్లు, సిద్ధం చేసిన ప్లాస్టిక్ ప్యాకేజింగుల విక్రయం వివరాలను తప్పనిసరిగా నివేదించాల్సి ఉంటుంది.

మార్కెట్ ఆధారిత వ్యవస్థ ఒకటి ఉండాలని ఈపీఆర్ సూచిస్తోంది.  అందులో భాగంగా రీసైకిలింగ్ సంస్థలు వ్యర్థాలను సేకరిస్తూ ఉండే అసాంప్రదాయక (ఇన్‌ఫార్మల్) సంస్థలు సహా ఇదే పనిని చేసే ఏజెన్సీల నుంచి వ్యర్థాలను పొందడానికి తమ సొంత యంత్రాంగాన్ని రూపొందించుకొంటాయి.  రీసైకిలింగ్ ప్రక్రియ ముగించిన అనంతరం ఈపీఆర్ సర్టిఫికెట్‌లను సిద్ధం చేసుకొంటాయి. ఆ సర్టిఫికెట్లను బాధ్యత ఉన్న సంస్థలు.. అంటే పిఐబీఓలు కొనుగోలు చేస్తాయి.

పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈపీఆర్ మార్గదర్శకాలు ఒక భూమికను నిర్దేశించాయి.  రిజిస్టర్డ్ ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ (పీడబ్ల్యూపీ) సంస్థలు ఇచ్చిన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాల సర్టిఫికెట్‌ను- అంగీకారం కుదిరిన విధానం ప్రకారం- స్థానిక సంస్థలకూ జారీ చేయవచ్చు.  స్థానిక అధికార యంత్రాంగం తన వంతుగా స్వీయ ఈపీఆర్ బాధ్యతలను నెరవేర్చడానికిగాను పీఐబీఓలకు ఈపీఆర్ సర్టిఫికెట్లను ఇచ్చి పుచ్చుకొనే అవకాశమూ ఉంది.

పీఐబీఓలు వాటి ఈపీఆర్ బాధ్యతను నెరవేరుస్తూనే, ప్లాస్టిక్స్ ఏ కేటగిరీకి చెందాయన్నదాని ఆధారంగా, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాలను సేకరించడానికి, ఆ వ్యర్థాలను వేరు చేయడానికి తగిన ప్రాథమిక వ్యవస్థను పీఐబీఓలు అభివృద్ధిపరుచుకోవచ్చు.  దీనికోసం రకరకాల విధానాలను అనుసరించనూవచ్చు.

ఈపీఆర్ బాధ్యతలను పీఐబీఓలు నెరవేర్చే క్రమంలో, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల వంటి వాటి నుంచి, ఇతర పబ్లిక్ అథారిటీల నుంచి లేదా వ్యర్థాల నిర్వహణ రంగంలోని మూడో పక్షానికి చెందిన సంస్థల నుంచి ప్లాస్టిక్‌ను సేకరించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేయవచ్చు.  అంతేకాక, ఈ ప్రతిపాదనకు కట్టుబడిన సంస్థలన్నింటి వద్ద నుంచీ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసుకొనేందుకు ముందంజ వేయవచ్చు.  దీనికి అదనంగా, వ్యర్థాల సేకరణకు, వ్యర్థాల రవాణాకు అవసరమయ్యే ఆచరణాత్మక ఏర్పాట్లను - ఈపీఆర్ మార్గదర్శకాలను అనుసరిస్తూ - పీఐబీఓలు చేయవచ్చు.  

ఈపీఆర్ నియమ నిబంధనలు రీసైకిలింగ్ సంస్థలకు గుర్తింపును ఇస్తాయి. రిజిస్టర్డ్ రీసైకిలింగ్ సంస్థలు ఈపీఆర్ సర్టిఫికెట్‌లను పొందుతాయి. వాటిని పీఐబీఓల బాధ్యతలను నెరవేర్చడానికి ఉపయోగిస్తారు. ఇది  అసాంప్రదాయక వ్యర్థాల నిర్వహణ రంగాన్ని ఒక క్రమ పద్ధతికి తీసుకురావడాన్ని ప్రోత్సహిస్తుంది.

ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఇ-వేస్ట్), బ్యాటరీ సంబంధిత వ్యర్థాలు, నిరుపయోగ టైర్లు, ఉపయోగించిన నూనెల విషయంలో కనీస స్థాయి రీసైకిలింగ్ బాధ్యత అనేది సాంప్రదాయక (ఫార్మల్)రంగం, అసాంప్రదాయక రంగాల ప్రమేయంతోనూ వ్యర్థాల నిర్వహణ ప్రక్రియను పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ప్లాస్టిక్ ప్యాకేజింగుకు సంబంధించిన ఈపీఆర్ మార్గదర్శకాల ప్రకారం దీనిలో స్థానిక అథారిటీలు పాలుపంచుకొనేందుకు వీలుంది.

నాణ్యత కలిగిన ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ పద్ధతిని, ఆ తరహా ప్యాకేజింగులను తిరిగి ఉపయోగించే ధోరణిని కూడా ఈపీఆర్ మార్గదర్శకాలు  ప్రోత్సహిస్తాయి. పారదర్శకతను పెంచడానికిగాను, ప్లాస్టిక్ ప్యాకేజింగ్, ఈ-వేస్ట్, బ్యాటరీ వ్యర్థాలు, నిరుపయోగ టైర్లు, ఉపయోగించిన నూనెలకు సంబంధించిన కేంద్రీకృత ఈపీఆర్ పోర్టల్స్ ఇప్పటికే వాటి పనిని అవి చేస్తున్నాయి.  పిఐబీఓలకు నిర్దేశించిన ఈపీఆర్ లక్ష్యం, నమోదైన వ్యర్థాల శుద్ధి సంస్థలు (రిజిస్టర్డ్ వేస్ట్ ప్రోసెసర్స్) సిద్ధం చేసిన ఈపీఆర్ సర్టిఫికెట్ల లభ్యతకు సంబంధించిన సమాచారం కేంద్రీకృత ఈపీఆర్ పోర్టళ్ళ డాష్ బోర్డులో అందుబాటులో ఉంది.

ప్లాస్టిక్ ప్యాకేజింగ్ విషయంలో కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్) మార్గదర్శకాలలో పేర్కొన్న ప్రకారం నమోదైన ప్లాస్టిక్ వ్యర్థాల శుద్ధి సంస్థల విషయంలో ఆకస్మికంగా ఆడిట్ ను నిర్వహించింది.  ఈ లెక్కల తనిఖీలో అక్రమాలు బయటపడ్డాయి. దీనికి అనుగుణంగా, సీపీసీబీ సంబంధిత ఎస్‌పీసీబీలకు 2023 అక్టోబరు 26న ఆదేశాలు జారీ చేసింది.  ఈపీఆర్ నిర్ధారిత నియమాలను అనుసరించకుండా ఉన్న ఇపిఆర్ సర్టిఫికెట్లు ఎన్ని ఉంటే వాటిపై  పర్యావరణ పరమైన నష్టపరిహారాన్ని (ఈసీ) విధించాలని, నియమాలను ఉల్లంఘించిన ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసర్‌ల (పీడబ్ల్యూపీ)పై చట్ట ప్రకారం అవసరమైన చర్య తీసుకోవాలని  ఆ సీపీసీబీ తన ఆదేశాల్లో సూచించింది.  అన్ని ఎస్‌పీసీబీలకు, పీసీసీలకు అవసరమైన చర్యను తీసుకోవాల్సిందిగాను, పీడబ్ల్యూపీ సిద్ధం చేసిన ఈపీఆర్ సర్టిఫికెట్లు నిర్ధారిత నియమాలకు తులతూగేవిగా ఉండేటట్టు చూడాలని కూడా ఆదేశాలను జారీ చేశారు.

ప్లాస్టిక్ ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బ్యాటరీ వ్యర్థాలు, ఉపయోగించిన నూనెలతోపాటు నిరుపయోగ టైర్ల విషయంలో రూపొందించిన వ్యర్థాల నిర్వహణ నియమాల్లో, ఈపీఆర్ అమలు తీరును పర్యవేక్షిస్తుండడం, అవసరాలకు అనుగుణంగా ఇబ్బందులను తొలగించడానికిగాను సంబంధిత వ్యర్థాల నిర్వహణ నియమాల్లో భాగంగా ఒక సారథ్య సంఘాన్ని గానీ, లేదా అమలు సంఘాన్ని గానీ ఏర్పాటు చేయాలన్న సూచనను చేర్చారు.

ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్థన్ సింగ్ లోక్ సభలో ఈ రోజు ఒక లిఖితపూర్వక సమాధానంలో అందించారు.

 
 
***

(Release ID: 2080437) Visitor Counter : 53


Read this release in: English , Urdu , Hindi , Tamil