పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: - దేశంలో అడవులున్న ప్రాంతం

Posted On: 02 DEC 2024 4:09PM by PIB Hyderabad

పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న, డెహ్రాడూన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) ప్రతి రెండేళ్ళకు ఒకసారి అటవీ విస్తీర్ణం ఏ స్థాయిలో ఉందీ లెక్కగడుతూ ఉంటుంది. దేశంలో అడవులు ఉన్న ప్రాంతం స్థితి తాజా నివేదిక (ఐఎస్ఎఫ్ఆర్) 2021  ప్రకారం, దేశం మొత్తం మీద అడవులు 7,13,789 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.  ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 21.71 శాతానికి సమానంగా ఉంది.  గత అయిదు సంవత్సరాలలో దేశంలో అడవులు విస్తరించిన ప్రాంతాల వివరాలను రాష్ట్రంవారీగాను, కేంద్రపాలిత ప్రాంతంవారీగాను అనుబంధంలో పొందుపరిచారు.

ఐఎస్ఎఫ్ఆర్ 2017 లెక్కలతో పోల్చి ఐఎస్ఎఫ్ఆర్ 2021 లెక్కలను చూసినట్లయితే అడవులు, వృక్షాలు ఉన్న ప్రాంతాలలో 7,449 చ.కి.మీ. మేర వృద్ధి నమోదైంది.  అడవులు, వృక్షాలు విస్తరించిన ప్రాంతాలలో ఎలాంటి క్షీణత లేనందువల్ల ఆ కారణంగా వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువు (సీఓ2) అధికంగా చొరబడుతోందన్న ప్రశ్నకు తావే లేదు.

2021 సంవత్సర ఐఎస్ఎఫ్ఆర్ నివేదికకు, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ సమాచారానికి మధ్య తేడా ఉందంటే దానికి, అటవీ ప్రాంతాల సంరక్షణకు, మొక్కల పెంపకానికి సంబంధించి ఈ రెండు నివేదికల నిర్వచనాల్లో వ్యత్యాసాలు ఉండడం కారణం కావచ్చు.

అటవీ (సంరక్షణ) చట్టం, 1980 ని 2023 ఆగస్టు 4న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మాధ్యం ద్వారా సవరించారు. సవరించిన నియమ నిబంధనలు 2023 సంవత్సరంలోనే డిసెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి.  అడవుల సంరక్షణను, నిర్వహణను, అడవులను నరికివేసిన ప్రాంతాలలో మళ్లీ వాటిని పెంచే దిశలో చేసే ప్రయత్నాలను ప్రోత్సహించడానికి, పర్యావరణపరంగా స్థిరాభివృద్ధి లక్ష్యానికి తోడ్పడడానికి, పర్యావరణానికి  ఏ లోటు రాకుండా చూడడానికి, అడవులతో ముడిపడిన సాంస్కృతిక విలువలను, సాంప్రదాయక విలువలను పరిరక్షించడానికి, కర్బన ఉద్గారాలు పెరిగిపోకుండా చూస్తూనే ఆర్థిక అవసరాలను తీర్చే ఉద్దేశంతో కూడా ఈ సవరణలను అమలుచేస్తున్నారు.

 

అనుబంధం

 

ఐఎస్ఎఫ్ఆర్ 2017 నుంచి ఐఎస్ఎఫ్ఆర్ 2021 మధ్య కాలంలో అటవీ ప్రాంతాలు రాష్ట్రాలవారీగాను, కేంద్రపాలిత ప్రాంతంవారీగాను ఏమేరకు ఉన్నాయో, ఆ వివరాలు:

                                                                                                               

(విస్తీర్ణం చదరపు కిలో మీటర్లలో)

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

భౌగోళిక ప్రాంతం

ఐఎస్ఎఫ్ఆర్ 2017

ఐఎస్ఎఫ్ఆర్ 2019

ఐఎస్ఎఫ్ఆర్ 2021

ఆంధ్ర ప్రదేశ్

1,62,968

28,147

29,137

29,784

అరుణాచల్ ప్రదేశ్

83,743

66,964

66,688

66,431

అసోం

78,438

28,105

28,327

28,312

బీహార్

94,163

7,299

7,306

7,381

ఛత్తీస్‌గడ్

1,35,192

55,547

55,611

55,717

ఢిల్లీ

1,483

192.41

195.44

195

గోవా

3,702

2,229

2,237

2,244

గుజరాత్

1,96,244

14,757

14,857

14,926

హర్యానా

44,212

1,588

1,602

1,603

హిమాచల్ ప్రదేశ్

55,673

15,100

15,434

15,443

ఝార్ఖండ్

79,716

23,553

23,611

23,721

కర్నాటక

1,91,791

37,550

38,575

38,730

కేరళ

38,852

20,321

21,144

21,253

మధ్య ప్రదేశ్

3,08,252

77,414

77,482

77,493

మహారాష్ట్ర

3,07,713

50,682

50,778

50,798

మణిపూర్

22,327

17,346

16,847

16,598

మేఘాలయ

22,429

17,146

17,119

17,046

మిజోరం

21,081

18,186

18,006

17,820

నాగాలాండ్

16,579

12,489

12,486

12,251

ఒడిశా

1,55,707

51,345

51,619

52,156

పంజాబ్

50,362

1,837

1,849

1,847

రాజస్థాన్

3,42,239

16,572

16,630

16,655

సిక్కిం

7,096

3,344

3,342

3,341

తమిళ నాడు

1,30,060

26,281

26,364

26,419

తెలంగాణ

1,12,077

20,419

20,582

21,214

త్రిపుర

10,486

7,726

7,726

7,722

ఉత్తర ప్రదేశ్

2,40,928

14,679

14,806

14,818

ఉత్తరాఖండ్

53,483

24,295

24,303

24,305

పశ్చిమ బెంగాల్

88,752

16,847

16,902

16,832

అండమాన్ & నికోబార్ దీవులు

8,249

6,742

6,743

6,744

చండీగఢ్

114

21.56

22.03

22.88

దాద్రా & నాగర్ హవేలీ; దమన్ & దీవ్

602

227.49

227.49

227.75

జమ్ము & కాశ్మీర్ **

2,22,236

23,241

 

21,358

21,287

లద్దాఖ్

2,254

2,272

లక్షద్వీప్

30

27.10

27.10

27.10

పుదుచ్చేరి

490

53.67

52.41

53.30

మొత్తం

3,287,469

7,08,273

7,12,249

713,789

 

 

 ** ఐఎస్ఎఫ్ఆర్ 2019 మొదలుకొని జమ్ము & కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. వాటిలో ఒకటి జమ్ము & కాశ్మీర్, రెండోది లద్దాఖ్.

 

ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో అందించారు.

 

 

***


(Release ID: 2079983) Visitor Counter : 210