సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner

ఆనందోత్సాహాల మధ్య ముగిసిన 55వ ఇఫీ

ఇఫీ 2024లో రికార్డు సంఖ్యలో పాల్గొన్న ప్రతినిధులు, చిత్రోత్సవంలో పాల్గొన్న 28 దేశాల ప్రతినిధులు

ఫిలిం బజార్లో గతంలో కంటే అత్యధిక సంఖ్యలో పాల్గొన్న ప్రతినిధులు, రూ. 500 కోట్లను అధిగమిచిన వ్యాపార కార్యకలాపాలు

శిక్షణ తరగతులు, అంతర్జాతీయ సినిమాల ప్రదర్శన, ఇండియన్ పనోరమా అన్నీ హౌస్‌ఫుల్

#IFFIWood, నవంబర్ 30, 2024

ఒక మంచి సినిమాకి కూడా ముగింపు ఉన్నట్లే… ఆనందోత్సాహాల మధ్య ఇఫీ పండగ ముగిసిందిగోవాలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 55 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు (ఇఫీ) నవంబర్ 28, 2024న ముగిశాయి. ఒక సంబరంలా సాగిన ఈ సినిమా ఉత్సవం.. సినీ ప్రేమికులకు మరపురాని అనుభవాన్ని అందించడంతోపాటు ఔత్సాహిక దర్శకులకు స్ఫూర్తిగా నిలిచింది. 2024 ఇఫీ ఎడిషన్లో 11,332 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇఫి 2023తో పోలిస్తే ఇది 12 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వారితో పాటు అంతర్జాతీయంగా 28 దేశాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఫిలిం బజార్‌లో ఈ ఏడాది 1,876 మంది ప్రతినిధులు పాల్గొనగా, గతేడాది ఈ సంఖ్య 775గా ఉంది. 42 దేశాల తరఫున ప్రతినిధులు పాల్గొన్నారు. ఫిలిం బజార్లో జరిగిన వ్యాపార కార్యకలపాలు రూ.500 కోట్లను అధిగమించాయి. ఇది గణనీయమైన విజయాన్ని సూచిస్తుంది. 15 సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన టెక్ పెవిలియన్.. అందరినీ ఆకర్షించింది. ఈ సంస్థల నుంచి దాదాపుగా రూ.15.36 కోట్ల స్పాన్సర్ షిప్ వచ్చింది.

55వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జరిగిన ముఖ్యాంశాలకు సంబంధించిన సారాంశం:

ఆరంభ, ముగింపు ఉత్సవాలు

ఆరంభ, ముగింపు ఉత్సవాల్లో భారత, అంతర్జాతీయ సినిమా వైభవాన్ని సినీతారలు ప్రదర్శించారు. శతజయంతి జరుపుకుంటున్న భారతీయ దిగ్గజాలకు, సినిమా వైవిధ్యానికి ప్రాంరభ వేడుకలు నివాళి అర్పించాయి. ముగింపు ఉత్సవంలో సంగీత, నృత్య ప్రదర్శనలతో పాటు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు ప్రధానం చేశారు. వాటిలో సత్యజిత్ రే జీవన సాఫల్య పురస్కారాన్ని ఫిలిప్ నోయ్స్‌కు, ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని విక్రాంత్ మాసేకు ప్రదానం చేశారు.

 

 

ముగింపు ఉత్సవం: విక్రాంత్ మాసేకు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ పురస్కారం ప్రదానం చేశారు.

అంతర్జాతీయ సినిమా

ఇఫీ అంతర్జాతీయ సినిమా ప్రదర్శనకు స్వీకరించిన 1800 చిత్రాల నుంచి 189 ఎంపికచేశారు. వాటిలో 16 వరల్డ్ ప్రీమియర్లు, 3 అంతర్జాతీయ ప్రీమియర్లు, 44 ఆసియా ప్రీమియర్లు, 109 భారత ప్రీమియర్లు ఉన్నాయి.

వివిధ సంస్కృతులు, స్వరాలు, ఆకాంక్షలను ప్రతిఫలించిన 81 దేశాలకు చెందిన చిత్రాలను ఇక్కడ ప్రదర్శించారు. పోటీ విభాగాలు కూడా అంతే ఉత్సుకత కలిగించాయి. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విభాంగంలో 15 చిత్రాలు, ఐసీఎఫ్‌టీ యునెస్కో గాంధీ మెడల్ విభాగంలో 10 చిత్రాలు, దర్శకత్వ విభాగంలో ఉత్తమ తొలి ఫీచర్ చిత్రం విభాగంలో 7 సినిమాలు ప్రదర్శించారు.

ఈ ఉత్సవాల్లో ప్రాధాన్యతా దేశంగా ఆస్ట్రేలియాకు పెద్దపీట వేయడం విలక్షణతను జోడించింది. స్క్రీన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఒప్పందం ప్రకారం అత్యుత్తమమైన ఆస్ట్రేలియన్ సినిమాలను ఇక్కడ ప్రదర్శిచారు. మైఖేల్ గ్రేసీ దర్శకత్వం వహించిన ఆస్ట్రేలియన్ సినిమా బెటర్ మ్యాన్ తో ఈ ఉత్సవాల్లో సినిమాల ప్రదర్శన మొదలైంది.

ఉత్తమ దర్శకుడి విభాగంలో లిథువేనియా చిత్రం ‘టాక్సిక్’ గోల్డెన్ పీకాక్ పురస్కారం, రొమెనియా చిత్రం ‘ఎ న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్’ సిల్వర్ పీకాక్ పురస్కారాన్ని అందుకున్నాయి,


ఐ అండ్ బీ కార్యదర్శి సంజయ్ జాజు, ఉత్సవాల డైరెక్టర్ శేఖర్ కపూర్ తో ఓపెనింగ్ చిత్రం బెటర్ మ్యాన్ నటులు, సిబ్బంది

 

ప్రీమియర్లు, రెడ్ కార్పెట్

అంతర్జాతీయ విభాగం, ఇండియన్ పనోరమ, గోవా విభాగంలో 100కు పైగా రెడ్ కార్పెట్ ఈవెంట్లు జరిగాయి. ఐనాక్స్ పాంజిమ్ వేదికగా ఇండియన్ పనోరమా పరిధిని మించి ప్రదర్శనలు జరిగాయి.

 

ఆరంభ వేడుకల్లో రెడ్ కార్పెట్‌పై ఇంటర్నేషనల్ సినిమా జ్యూరీ

 

55వ ఇఫీ ఆరంభోత్సవాల్లో రెడ్ కార్పెట్‌పై స్నో ఫ్లవర్ నటీనటులు, సిబ్బంది

 

ఇండియన్ పనోరమా

ఈ ఏడాది సినిమా గొప్పతనాన్ని వైవిధ్యంగా ప్రదర్శించేలా 25 ఫీచర్, 20 నాన్ ఫీచర్ చిత్రాలను ఇండియన్ పనోరమా 2024లో ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా సినీ ప్రపంచానికి చెందిన వివిధ ప్రముఖులతో కూడిన ప్యానెల్ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఫీచర్ చిత్రాలకు ఆరుగురు జ్యూరీ సభ్యులు, నాన్ ఫీచర్ చిత్రాలకు ఆరుగురు సభ్యుల చొప్పున మొత్తం 12 మంది పాల్గొన్నారు. ఈ రెండు బృందాలకు ఛైర్ పర్సన్లు ఉన్నారు. ఈ ఏడాది ఇఫీ ఇతివృత్తం ‘యువ దర్శకులు’ ఆధారంగా దేశంలో యువ సినీ దర్శకుల ప్రతిభను ప్రోత్సహించడానికి నూతన అవార్డును పరిచయం చేశారు. ముగింపు ఉత్సవాల్లో అందించే ప్రశంసాపత్రం, రూ. 5 లక్షల నగదు బహుమతికి పోటీపడిన102 ఎంట్రీల నుంచి ఘరాత్ గణపతి చిత్రం తెరకెక్కించిన నవజ్యోత్ బందీవాడేకర్ విజేతగా నిలిచారు.

 ‘యువ దర్శకులు’- ‘‘భవిష్యత్తు ఇప్పుడే’’ అనే ఇతివృత్తంపై దృష్టి సారించిన ఇఫీ
గౌరవనీయ సమాచార, ప్రసార మంత్రి ఆలోచనలకు అనుగుణంగా, సృజనాత్మక భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు యువ సామర్థ్యాన్ని గుర్తించేలా ఇఫీ ఇతివృత్తం ‘యువ దర్శకుల’పై దృష్టి సారించింది. క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో కార్యక్రమం గత ఎడిషన్లో 75 మందికి తోడ్పాటునందిస్తే.. ఈ ఏడాది ఆ సంఖ్యను 100కు పెంచారు. దేశవ్యాప్తంగా వివిధ ఫిలిం స్కూళ్లకు చెందిన దాదాపు 350 మంది యువ సినీ విద్యార్థులకు ఇఫీలో పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న యువ దర్శకుల ప్రతిభను గుర్తించేందుకుగాను ఉత్తమ భారతీయ తొలి చిత్ర దర్శకుడు అవార్డు విభాగాన్ని నూతనంగా ప్రారంభించారు. యువ దర్శకుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తరగతులు, చర్చా కార్యక్రమాలు, ఫిలిం మార్కెట్, ఫిలిం ప్యాకేజీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనేలా ఇఫీయెస్టా - ఎంటర్టైన్మెంట్ జోన్ ప్రారంభించారు.

ఇఫీయెస్టా

ఇఫీయెస్టాలో జొమాటో భాగస్వామ్యంతో ‘డిస్ట్రిక్’ పేరుతో ఆహ్లాదభరితమైన ఎంటర్టైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. దీనిలో వివిధ రకాల ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేయడంతోపాటు, వెన్ ఛాయ్ మెట్ టోస్ట్, ఆసీస్ కౌర్ వంటి ప్రత్యేక నాటక ప్రదర్శనలు  ఆకట్టుకున్నాయిభారతీయ చలనచిత్ర చరిత్రను ప్రదర్శించేందుకు ‘సఫర్నామా’ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఈ జోన్‌కే ప్రధాన ఆకర్షణ. ఈ కార్యక్రమానికి హాజరైనవారికి లీనమయ్యే అనుభవాన్ని (ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్) అందిచేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక జోన్ మరో అదనపు ఆకర్షణ. 6,000 మంది విద్యార్థులతో సహా 18,795 మంది సందర్శకులు ఇఫీయెస్టాను ఆస్వాదించారు.


 

ఇఫీయెస్టాలో సాంస్కృతిక ప్రదర్శన

సినిమా దిగ్గజాల గౌరవించడం: ఇఫీ 2024లో శత జయంతి సందర్భంగా నివాళులు

నవంబర్‌లో జరిగిన 55వ భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) భారతీయ సినిమాలో నలుగురు దిగ్గజాలైన అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్), రాజ్ కపూర్, మహ్మద్ రఫి, తపన్ సిన్హాకు నివాళులు అర్పిస్తూ చారిత్రకత ఉత్సవాలు నిర్వహించారు. ఈ దిగ్గజాల శత జయంతి సందర్భంగా తపాలా బిళ్ల విడుదల, సినిమాలు, కళా ప్రదర్శనల ద్వారా సినీ రంగానికి వారు చేసిన అసమానమైన సేవలను గుర్తు చేసుకున్నారు.

శతజయంతి సందర్భంగా ఆరంభవేడుకల్లో తపాలా బిళ్ల విడుదల

అలనాటి మేటి చిత్రాల పునరుద్ధరణ

ఇఫీ 2024లో రీస్టోర్డ్ క్లాసిక్స్ విభాగాన్ని ఎన్ఎఫ్‌డీసీ - నేషనల్ ఫిలిం ఆర్కైవ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చొరవతో నేషనల్ ఫిలిం హెరిటేజ్ మిషన్లో భాగంగా ఎన్ఎఫ్‌డీసీ-ఎన్ఎఫ్ఏఐ సంయుక్తంగా డిజిటల్‌గా పునరుద్ధరించిన అలనాటి సినిమాలను ప్రదర్శించారు. డిజిటైజేషన్, పునరుద్ధరణ ద్వారా భారతీయ సినిమాను సంరక్షించేందుకు ఎన్ఎఫ్‌డీసీ-ఎన్ఎఫ్ఏఐ చేస్తున్న ప్రయత్నాలను ఈ కార్యక్రమం ప్రధానంగా తెలియజేసింది. వాటిలో ప్రధానమైనవి:

1. కాళీయ మర్దన్ (1919), - దాదా సాహెబ్ ఫాల్కే దర్శకత్వం వహించిన మూకీ సినిమా, ప్రత్యక్ష శబ్ధ ప్రసారంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2. శతజయంతోత్సవాలు జరుపుకుంటున్న దిగ్గజాల గౌరవార్థం:

3. సత్యజిత్ రే- సీమబద్ధ (1971)

    1. రాజ్ కపూర్ ఆవారా (1951)

      బిఏఎన్నార్ దేవదాసు (1953)

      సిరఫీ పాటలున్న హమ్ దోనో (1961)

      డితపన్ సిన్హా- హర్మోనియం (1975)

క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో

చిత్ర రూపకల్పనలో 13 విభాగాల్లో 2024 ఇఫీలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,070 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటి నుంచి 100 మందిని ఎంపిక చేశారు. వారిలో 71 మంది పురుషులు, 29 మంది మహిళలు ఉన్నారు (2023లో పాల్గొన్న మహిళల సంఖ్య 16 మాత్రమే). వీరంతా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు. కార్యక్రమానికి వీరు వైవిధ్యాన్నీ, అందాన్నీ తీసుకొచ్చారు.

ఉత్సవాల్లో, 10 మంది సభ్యులుగా ఉన్న బృందాలు 48 గంటల్లో 5 లఘు చిత్రాలను నిర్మించాయి. అవి హిందీలో గుల్లు (దర్శకుడు: ఆర్ష్లే జోస్), ఇంగ్లీష్, కొంకణీ భాషల్లో ది విండో (దర్శకుడు: పీయూష్ శర్మ), ఇంగ్లీషులో వియ్ కెన్ హియర్ ది సేమ్ మ్యూజిక్ (దర్శకత్వం: బోనితా రాజ్ పురోహిత్), ఇంగ్లీషులో లవ్ ఫిక్స్ సబ్‌స్క్రిప్షన్ (దర్శకత్వం: మల్లికా జునేజా), హిందీ, ఇంగ్లీషులో హే మాయా (దర్శకుడు: సూర్యాన్ష్ దేవ్ శ్రీవాస్తవ). ఈ చిత్రాల్లో గ్రాండ్ జ్యూరీ నిర్ణయించిన విజేతలు: ఉత్తమ చిత్రం - గుల్లు (ఆర్ష్లే జోస్), మొదటి రన్నర్ అప్ - వియ్ కెన్ హియర్ ది సేమ్ మ్యూజిక్ (బోనితా రాజ్‌పురోహిత్), ఉత్తమ దర్శకుడు - ఆర్ష్లే జోస్ (గుల్లు), ఉత్తమ కథ – అధిరాజ్ బోస్ (లవ్ ఫిక్స్ సబ్‌స్క్రిప్షన్), ఉత్తమ నటి - విశాఖ నాయక్ (లవ్ ఫిక్స్ సబ్‌స్క్రిప్షన్), ఉత్తమ నటుడు - పుష్పేంద్ర కుమార్ (గుల్లు).

సీఎంఓటీ జ్యూరీ సభ్యులు ఆధ్వర్యంలో సీఎంవోటీ ప్రారంభించిన ఐ అండ్ బీ కార్యదర్శి సంజయ్ జాజు, సీబీఎఫ్‌సీ చైర్‌పర్సన్ ప్రసూన్ జోషి

ది క్రియేటివ్ మైండ్స్‌లో పాల్గొన్నవారు టాలెంట్ క్యాంపునకు సైతం హాజరయ్యారు. ఫలితంగా కొత్తతరం దర్శకులకు 62 అవకాశాలు వచ్చాయి. ఈ కార్యక్రమం విలువైన అవగాహన కల్పించి, అవకాశాలు అందించడంతో పాటు భారతీయ సినిమాలో నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేదిక కృతనిశ్చయాన్ని మరింత బలోపేతం చేసింది.

48 గంటల ఫిలిం మేకింగ్ ఛాలెంజ్‌లో పాల్గొంటున్న విద్యార్థులు

శిక్షణ తరగతులు

సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖులతో 30 శిక్షణ తరగతులు, చర్చా కార్యక్రమాలు, ప్యానెల్ చర్చలను ఏడు రోజుల పాటు ఇఫీ నిర్వహించింది. ఫిలిప్ నోయ్స్, జాన్ సీల్, రణబీర్ కపూర్, ఏఆర్ రెహ్మాన్, క్రిస్ క్రిష్బమ్, ఇంతియాజ్ ఆలీ, మణి రత్నం, సుహాసినీ మణిరత్నం, నాగార్జున, ఫరూఖ్ దోండి, శివ కార్తికేయన్, ఆమిష్ త్రిపాఠి, తదితర ప్రముఖుు పాల్గొన్నారు.

నవంబర్ 22న మణిరత్నంతో జరిగిన కార్యక్రమానికి ఆడిటోరియం సామర్థ్యంలో అత్యధికంగా 89 శాతం మంది హాజరవగా, రణబీర్ కపూర్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి 83 శాతం హాజరయ్యారు.

మణిరత్నం మాస్టర్ క్లాస్ లో నిండిపోయిన ఆడిటోరియం

స్టూడెంట్ ఫిలిం మేకర్ కార్యక్రమం

యంగ్ ఫిలిం మేకర్ కార్యక్రమంలో సుమారుగా ఎఫ్‌టీఐఐ, ఎస్ఆర్ఎఫ్‌టీఐ అరుణాచల్ ప్రదేశ్, ఐఐఎంసీ సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వ, ప్రవేటు సంస్థలకు చెందిన 13 ఫిలిం స్కూళ్లకు చెందిన 279 మందితో సహా మొత్తం 345మంది విద్యార్థులు పాల్గొన్నారు. అదనంగా ఈశాన్య భారతానికి చెందిన మరో 66 మంది విద్యార్థులు, యువ దర్శకులను ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపిక చేశారు.

48 గంటల చిత్ర నిర్మాణ ఛాలెంజ్ లో పాల్గొంటున్న విద్యార్థులు

మీడియా అక్రిడేషన్ కోసం దేశవ్యాప్తంగా 1,000 దరఖాస్తులు పీఐబీకి వస్తే, అందులో 700 మందికి పైగా జర్నలిస్టులకు ఇఫీ వేడుకల వార్తలను అందించేందుకు గుర్తింపు కార్డులను ఇచ్చింది. ఆసక్తి కలిగిన కొంత మంది జర్నలిస్టులకు ఎఫ్‌టీఐఐ సహకారంతో ఫిలిం అప్రిసియేషన్ లో ఒక రోజు కోర్సును అందించారు.

వివిధ మీడియా వేదికల్లో ఇఫీ 2024కు విస్తృత స్థాయి ప్రచారం కల్పించారు. పత్రికా మాధ్యమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైమ్స్, మిడ్ డే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది హిందూ తదితర పత్రికల్లో ప్రచురితమైన దాదాపు 500 పైగా కథనాలు పండగ ప్రాధాన్యాన్ని తెలియజేశాయి.

డిజిటల్ వేదికల్లో, బాలీవుడ్ హంగామా, పింక్ విల్లా తదితర ప్రముఖ సినిమా వెబ్‌సైట్లు, లైవ్‌మింట్, ఎకనామిక్ టైమ్స్ లాంటి బిజినెస్ కేంద్రంగా ఉన్న వేదికల్లో 600 కథనాలు ప్రచురితమయ్యాయి. వీటికి అదనంగా ఇఫీని మరింత ఎక్కువ మందికి చేర్చేలా 45 మంది సోషల్ మీడియా ప్రతినిధులు వివిధ డిజిటల్ వేదికల్లో మైగవ్ ద్వారా పనిచేశారు.

ఇంగ్లీష్ సహా ఆరు విదేశీ భాషల్లో ఏర్పాటు చేసిన అధికారిక ఖాతాల ద్వారా 26 దేశాలకు పీఐబీ వార్తలను అందించింది. విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో, వెరైటీ, స్క్రీన్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యం కుదర్చుకున్న ఇఫీ అంతర్జాతీయ సబ్‌స్క్రైబర్లకు మూడు ఈ డైలీలను పంపించి, పండగ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది.

***

iffi reel

(Release ID: 2079725) Visitor Counter : 31