కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
బాల కార్మికుల ఆచూకీని కనిపెట్టే వ్యవస్థ
Posted On:
28 NOV 2024 5:01PM by PIB Hyderabad
ప్రభుత్వం ‘ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ (పీఈఎన్‌సీఐఎల్)’ పేరుతో ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను రూపొందించింది. బాలలు, కౌమార దశలో ఉన్న కార్మికుల (నిషేధం, నియంత్రణ) చట్టం-1986లోని నియమ నిబంధనలు అమలు చేయడానికి ఈ చర్య తీసుకున్నారు. ఈ పోర్టల్‌లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రాజెక్టు సొసైటీలు, చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్, ఫిర్యాదులు.. అని అయిదు విభాగాలున్నాయి.
చట్ట నిబంధనావళిని కచ్చితంగా అమలు చేయడం కోసం డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్లను (డీఎన్ఓస్) నియమించారు.
వలస కార్మికులు, బాలికలు, ఎస్‌సీ/ఎస్‌టీ బాలలు సహా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక ఆదర్శ రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను (ఎస్ఏపీ) కూడా కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ రూపొందించింది.
ఈ వివరాలను కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి శోభ కరంద్‌లాజే ఈ రోజు రాజ్యసభలో తెలియజేశారు.
(Release ID: 2078885)
Visitor Counter : 70