ప్రధాన మంత్రి కార్యాలయం
బహమాస్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
Posted On:
22 NOV 2024 3:25AM by PIB Hyderabad
బహమాస్ ప్రధాని శ్రీ ఫిలిప్ డేవిస్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-కారికోమ్ శిఖరాగ్ర సమావేశాన్ని గయానాలోని జార్జ్‌టౌన్‌లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా వారిరువురు సమావేశమయ్యారు. ప్రధానమంత్రులు ఇరువురూ సమావేశం కావడం ఇదే మొదటిసారి.
ఆర్థిక సహకారం, హరిత భాగస్వామ్యం, ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు.. ఈ విషయాలపై నేతలిద్దరూ నిర్వహించన చర్చలు ఫలప్రదం అయ్యాయి. అబాకో హరికేన్ బాధితులకు ఆశ్రయాన్ని కల్పించడానికి భారతదేశం అందించిన పది లక్షల అమెరికా డాలర్ల ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు యూఎన్‌డీపీ ఆధ్వర్యంలో నిలకడగా పురోగమిస్తున్నందుకు నేతలు ఇద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు.
(Release ID: 2075850)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam