ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి కి ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్’ జాతీయ పురస్కార ప్రదానం
Posted On:
17 NOV 2024 8:11PM by PIB Hyderabad
నైజీరియా అధ్యక్షుడు శ్రీ బోలా ఆహమద్ టీనుబూ ‘‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్’’ జాతీయ పురస్కారాన్ని స్టేట్ హౌస్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రదానం చేశారు. శ్రీ నరేంద్ర మోదీ రాజనీతి కౌశలానికి, భారత్-నైజీరియా సంబంధాలను పెంచడంలో ఆయన అందించిన గొప్ప తోడ్పాటుకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసి, గౌరవించారు. ప్రధాని దూరాలోచన భరిత నాయకత్వ మార్గదర్శకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఓ మహా శక్తిగా రూపొందిందని, అనేక మార్పులను తీసుకు వచ్చిన ఆయన పరిపాలన ఏకతను, శాంతిని, అందరికీ సమృద్ధిని పెంచిందని పురస్కార సన్మానపత్రంలో పేర్కొన్నారు.
పురస్కారాన్ని ప్రధాన మంత్రి స్వీకరిస్తూ, ఈ గౌరవాన్ని భారతదేశ ప్రజలతో పాటు భారత్ కు , నైజీరియాకు మధ్య చిరకాలంగా వర్ధిల్లుతూ వస్తున్న చరిత్రాత్మక మైత్రికి అంకితమిచ్చారు. రెండు దేశాల మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, వికాస శీల దేశాల ఆకాంక్షల విషయంలో నైజీరియా, భారత్ ల ఉమ్మడి నిబద్ధతను ఈ మాన్యత ప్రధానంగా చాటిచెబుతోందని కూడా ఆయన అన్నారు.
ఈ పురస్కార గౌరవాన్ని 1969 తరువాత తొలిసారి ఓ విదేశీ నేతకు ఇచ్చారు. ఆ నేత ఎవరో కాదు, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.
(Release ID: 2074143)
Visitor Counter : 22
Read this release in:
Odia
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam