యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛ క్రీడలకు డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ మద్ధతు ఎన్ఏడీఏ ఇండియా తీసుకువచ్చిన ‘నో యువర్ మెడిసిన్’ యాప్ ను అనుసరించాలంటూ దేశ ప్రజలకు పిలుపు

Posted On: 14 NOV 2024 5:11PM by PIB Hyderabad

నో యువర్ మెడిసిన్ – ‘కేవైఎమ్’  (మీరు వాడే మందులను గురించి తెలుసుకోండిఅనే పేరుతో రూపొందిన యాప్‌ను వినియోగించుకోండి అంటూ కేంద్ర యువజన వ్యవహరాలుక్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.  క్రీడలలో డోపింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలపరిచేందుకు నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (ఎన్ఏడిఏఇండియా ఈ యాప్ ను రూపొందించింది.  దీనిని క్రీడాకారులుకోచ్ లతో పాటు క్రీడారంగంతో అనుబంధం ఉన్న వారందరూ వినియోగించుకోవాలని మంత్రి కోరారు.  క్రీడాకారులు తెలిసీ తెలియక డోపింగ్‌ పాలబడకుండా ఉండటానికి వారికి సాయపడే కీలక సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే ఈ వినూత్న యాప్ లక్ష్యం

క్రీడలలో నైతికవర్తనకు పెద్దపీట వేయాలని డాక్టర్ మాండవీయ తన సందేశంలో ప్రధానంగా చెప్పారు‘‘మన క్రీడాకారులు మన దేశానికి గర్వకారణం. మరి వారు స్వచ్ఛమైనన్యాయమైన పోటీకి మద్ధతిచ్చే సాధనాలను అందుబాటులో ఉంచుకోవడం అత్యవసరం. కేవైఎమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొనిసేవలను వినియోగించుకోవలసిందిగా క్రీడాకారులనుకోచ్‌లనుక్రీడా రంగ వృత్తి నిపుణులను నేను కోరుతున్నాను. దీనివల్ల పొరపాటున అయినా సరేడోపింగ్‌కు గురికాకుండా ఉంటూ పారదర్శకత్వంతో కూడిన క్రీడా సంస్కృతికి మీ వంతు తోడ్పాటును అందించిన వారవుతారు’’ అని మంత్రి అన్నారు.

డోపింగ్‌కు వ్యతిరేకంగా చైతన్యాన్ని పెంచడానికిక్రీడాకారులు వారి తప్పేమీ లేకుండా నడచుకోవడానికి అనువుగా తగిన జాగ్రత్త చర్యలను సూచిస్తూ ఈ కేవైఎమ్ యాప్ ను ఎన్ఏడీఏ ఇండియా రూపొందించింది.  ఈ యాప్దీనిని ఉపయోగించే వారికి మందుల గురించిఆ మందు తయారీలో వాడిన పదార్థాల గురించీఒకవేళ అవి వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (డబ్ల్యూఏడీఏనిషేధించినవి అవునాకాదా అనే సంగతిని ఇట్టే తెలుసుకోవడానికి సాయపడుతుందిసులభంగానుఎలాంటి అంతరాయానికి తావు ఇవ్వని విధంగాను రూపొందించిన ఈ కేవైఎమ్ యాప్ క్రీడాకారులకు ఎంతో సహాయకారిగా ఉంటుందిఇది క్రీడాకారులలో ఆట పట్ల చిత్తశుద్ధిని కలిగి ఉంటూ క్రీడాస్ఫూర్తిని నిలబట్టేటట్లు వ్యవహరించడానికి తోడ్పడుతుంది.


 

దీనిలో ఇమేజ్ఆడియో సెర్చ్ సదుపాయం వంటి విశిష్ట అంశాలున్నాయియాప్ వినియోగదారు తనకు సంబంధించిన క్రీడా కేటగిరీ ని ఎంపిక చేసుకొని ఆ క్రీడకు సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని వెతుక్కోవడానికి ఈ యాప్ అనువుగా ఉంటుందిక్రీడాకారులు కోరుకున్న సమాచారాన్ని సులభంగానే తెలుసుకొనేలా యాప్ ను తీర్చిదిద్దడం విశేషం.

ఈ కింది లింకు ను క్లిక్ చేసి కేవైఎం యాప్ ను గురించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు:

https://play.google.com/store/apps/details?id=com.nada.doppingapp&hl=en&gl=US

ఎన్ఏడీఏ ఇండియా వెబ్ సైట్ ను సందర్శించడానికి ఈ కింది లింకును క్లిక్ చేయగలరు:

https://nadaindia.yas.gov.in/


(Release ID: 2073523) Visitor Counter : 7