ఆర్థిక మంత్రిత్వ శాఖ
2024-25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల అద్భుత పనితీరు: గతేడాదితో పోలిస్తే 11% వృద్ధి
Posted On:
12 NOV 2024 3:27PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో, కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మార్గదర్శకత్వంలో కొన్నేళ్లుగా - లభ్యతను పెంచడం, అత్యున్నత సేవల్ని అందించడం, దివాళా కోడ్ (ఐబీసీ) అమలు, పటిష్టమైన పాలనా వ్యవస్థను అందుబాటులోకి తేవడం, జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (ఎన్ఏఆర్ సీఎల్) ఏర్పాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం తదితర చర్యలను చేపట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన ప్రభుత్వ రంగ బ్యాంకుల ముఖ్య కార్యనిర్వాహకులతో జరిగిన సమీక్ష సమావేశాల్లో ప్రస్తుత సమస్యలతోపాటు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. సంస్కరణలు, నిరంతర పర్యవేక్షణ అనేక సవాళ్లను పరిష్కరించాయి. ఆర్థిక క్రమశిక్షణ, నిరర్థక ఆస్తులను గుర్తించి పరిష్కరించడం, బాధ్యతాయుతమైన రుణ వితరణ, నిర్వహణను మెరుగుపరచడం, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాలు, సాంకేతిక పద్ధతులను అవలంబించడం కోసం వ్యవస్థాగతంగా, విధానాలపరంగా మెరుగైన చర్యలను తీసుకున్నారు. ఇవి మొత్తంగా బ్యాంకింగ్ రంగంలో సుస్థిరతకు, పటిష్టతకు కారణమయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రస్తుత పనితీరు మెరుగ్గా ప్రతిబింబించింది:
-
మొత్తం సగటు వ్యాపారం రూ. 236.04 లక్షల కోట్లకు చేరింది (గతేడాదితో పోలిస్తే 11% వృద్ధి).
-
అంతర్జాతీయ రుణాలు రూ.102.29 లక్షల కోట్లకు చేరి గతేడాదితో పోలిస్తే 12.9% వృద్ధి నమోదు చేయగా, డిపాజిట్లు గతేడాదితో పోలిస్తే 9.5% వృద్ధితో రూ. 133.75 లక్షల కోట్లకు చేరాయి.
-
ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో నిర్వహణ లాభం రూ. 1,50,023 కోట్లు కాగా (గతేడాదితో పోలిస్తే 14.4% వృద్ధి), నికర లాభం రూ. 85,520 కోట్లు (గతేడాదితో పోలిస్తే 25.6% వృద్ధి).
-
ఈ ఏడాది సెప్టెంబరు నాటికి స్థూల నిరర్థక ఆస్తులు 3.12%, నికర నిరర్థక ఆస్తులు 0.63% (గతేడాదితో పోలిస్తే స్థూల నిరర్థక ఆస్తులు 108 బేసిస్ పాయింట్లు, నికర నిరర్థక ఆస్తులు 34 బేసిస్ పాయింట్లు తగ్గాయి).
-
ఈ ఏడాది సెప్టెంబరు నాటికి మూలధనంలో ఆర్ డబ్ల్యూఏ ఆస్తుల నిష్పత్తి (సీఆర్ఏఆర్) 15.43%గా ఉంది. నిబంధనల ప్రకారం అవసరమైన 11.5% కన్నా ఇది ఎక్కువగా ఉంది.
-
కృత్రిమ మేధ/ క్లౌడ్/ బ్లాక్ చైన్ వంటి కొత్త సాంకేతికతలను అవలంబించడంలో, సాంకేతిక మౌలిక సదుపాయాల నవీకరణలో, అవసరమైన వ్యవస్థలు/ సైబర్ భద్రత ప్రమాదాల పరిష్కారానికి నియంత్రణల ఏర్పాటులో ప్రభుత్వ రంగ బ్యాంకులు విశేషమైన పురోగతిని సాధించి వివిధ దశల్లో
***
(Release ID: 2072937)