ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 09 NOV 2024 12:55PM by PIB Hyderabad

నేటి నుంచి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం మొదలవుతుందిఅంటే ఉత్తరాఖండ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతోందిరాష్ట్రానికి ఉజ్వలమైనజాజ్వల్యమానమైన భవిష్యత్తును నిర్మించే దిశగా అంకితభావంతో మనముందున్న వచ్చే 25 సంవత్సరాల ప్రస్థానాన్ని మనం ప్రారంభించాలియాదృచ్ఛికమే అయినాసంతోషకరమైన విషయమొకటి ఇందులో ఉందిజాతీయవృద్ధి కోసం అంకితం చేసిన 25 ఏళ్ల విశేష సమయమైన భారత అమృత్ కాల్మనం సాధించబోయే ఈ పురోగతి ఏకకాలంలో తటస్థించబోతున్నాయిఅభివృద్ధి చెందిన భారత్‌లో అభివృద్ధి చెందిన ఉత్తరాఖండ్ భావనను ఈ కలయిక దృఢపరుస్తుంది. ఈ కాలంలో మనందరి ఆకాంక్షలు నెరవేరతాయిఉత్తరాఖండ్ ప్రజలు రానున్న 25 ఏళ్ల లక్ష్యాలపై దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నానుఈ కార్యక్రమాల ద్వారా ఉత్తరాఖండ్ ఘనతను చాటడంతోపాటు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనే భావన రాష్ట్ర ప్రజలందరిలో ప్రతిధ్వనిస్తుందిదృఢ సంకల్పాన్ని స్వీకరించిన ఈ ముఖ్య సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానురెండు రోజుల కిందటే ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్ విజయవంతంగా నిర్వహించారుమన ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో గణనీయమైన పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

ఉత్తరాఖండ్ ప్రజలు తమ ఆశలుఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘంగా పోరాడవలసి వచ్చిందిగౌరవనీయులైన అటల్ గారి నాయకత్వంలోబీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ పోరాటం విజయవంతమైందిఉత్తరాఖండ్ ఏర్పాటు స్వప్నం క్రమంగా సాకారం కావడం నాలో సంతోషాన్ని నింపిందిదేవభూమి ఉత్తరాఖండ్ మా అందరిపైనాబీజేపీ పైనా ఎల్లప్పుడూ అపారమైన ప్రేమఆప్యాయతలను కురిపించిందిప్రతిగా... ఉత్తరాఖండ్ నిరంతర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందిఈ దేవభూమి సేవలో మా అంకిత భావమే మమ్మల్ని నడిపిస్తుంది.

మిత్రులారా,

కొన్ని రోజుల కిందట కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు మూసేశారుకొన్నేళ్ల కిందట బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న అనంతరం ఆయన పాదాల చెంత కూర్చుని.. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దే అని నేను నమ్మకంగా ప్రకటించానునా నమ్మకానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో పరిస్థితులున్నాయి. కొన్నేళ్లలో నా నమ్మకం సరైందే అని నిరూపితమైందిఅభివృద్ధిలో నేడు ఉత్తరాఖండ్ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోందిగతేడాది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందిసులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌)లో ‘విజేత’గాఅంకుర సంస్థల విభాగంలో ‘లీడర్’గా గుర్తింపు పొందిందిగత ఏడాదిన్నరలో.. ఉత్తరాఖండ్ అభివృద్ధి రేటు 1.25 రెట్ల కన్నా ఎక్కువ పెరిగిందిజీఎస్టీ వసూళ్లు 14 శాతానికి పైగా పెరిగాయిఏటా దాదాపు రూ1.25 లక్షలుగా ఉన్న ఉత్తరాఖండ్ తలసరి ఆదాయం ప్రస్తుతం రూ2.60 లక్షలకు పెరిగిందిఅదేవిధంగా, 2014లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీదాదాపు రూ1.5 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడది దాదాపు రూ3.5 లక్షల కోట్లకు పెరిగి రెండింతలైందిఉత్తరాఖండ్ యువతకు కొత్త అవకాశాల కల్పనపారిశ్రామిక వృద్ధిలో రాష్ట్ర పురోగతిని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి.

ప్రభుత్వ చర్యల ద్వారా ఉత్తరాఖండ్ ప్రజలకుముఖ్యంగా మా తల్లులుసోదరీమణులుబిడ్డలకు జీవన సౌలభ్యం కలిగింది2014లో 5 శాతం కుటుంబాలకే కుళాయి నీరు అందగా, అదిప్పుడు 96 శాతానికి పెరిగిందిత్వరలోనే అన్ని కుటుంబాలకూ ఈ సదుపాయాన్ని అందించబోతున్నాంఅదేవిధంగా2014కు ముందు రాష్ట్రంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద కేవలం 6,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను మాత్రమే నిర్మించారుఇప్పుడుఈ రోడ్ల మొత్తం పొడవు 20,000 కిలోమీటర్లకు చేరిందిపర్వతాలలో రహదారులను నిర్మించడంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయోఆ రహదారులు ఎంత ఆవశ్యకమో నాకు బాగా తెలుసువేలాదిగా టాయిలెట్లను నిర్మించడం ద్వారాఇంటింటికీ విద్యుత్ ను సరఫరా చేయడం ద్వారాఉజ్వల పథకం కింద అనేక కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించడం ద్వారాఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచితంగా వైద్యచికిత్సలు అందించడం ద్వారా మా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకూ తోడుగా నిలుస్తోంది.

మిత్రులారా,

డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయోజనాలను ఉత్తరాఖండ్‌లో మనం స్పష్టంగా చూడవచ్చుకేంద్రం నుంచి ఉత్తరాఖండ్‌కు అందుతున్న ఆర్థిక సాయం దాదాపు రెట్టింపైందిరాష్ట్రానికి ఎయిమ్స్ఏఐఐఎంఎస్ ఉపగ్రహ కేంద్రం మంజూరైందిఈ సమయంలోనేడెహ్రాడూన్ లో దేశంలో మొదటి డ్రోన్ ప్రయోగ పరిశోధనా కేంద్రం ఏర్పాటైందిఉధమ్‌సింగ్‌ నగర్‌లో చిన్న పరిశ్రమల టౌన్‌షిప్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారునేడు ఉత్తరాఖండ్ వ్యాప్తంగా దాదాపు రూ.లక్షల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయిఅనుసంధానతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయిరిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు 2026 నాటికి పూర్తికావచ్చుఉత్తరాఖండ్‌లోని 11 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నారుడెహ్రాడూన్-ఢిల్లీ ఎక్స్ ప్రెస్ మార్గం పూర్తయితే ఆ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండున్నర గంటలు మాత్రమే పడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటేఉత్తరాఖండ్‌ అభివృద్ధికి భారీ కృషి జరుగుతోందిఈ దేవభూమి వైభవాన్ని పెంపొందించడంతోపాటు పర్వత ప్రాంతాల నుంచి వలసలను గణనీయంగా తగ్గించడంలో ఈ చర్యలు దోహదపడతాయి.

మిత్రులారా,

అభివృద్ధిలో ముందుకు సాగుతూనే వారసత్వ సంపదను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందిదేవభూమి సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ కేదార్‌నాథ్ ధామ్ ను అద్భుతంగా, దివ్యంగా పునర్నిర్మిస్తున్నాంబదరీనాథ్ ధామ్ లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయిమానస్ ఖండ్ మందిర్ మాల మిషన్ మొదటి దశలో 16 ప్రాచీన ఆలయ ప్రాంతాలను పునరుద్ధరించారుఅన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అనువుగా ఉండేలా రూపొందించిన రహదారులు చార్ ధామ్ యాత్రను మరింత సులభతరం చేశాయిపర్వతమాల ప్రాజెక్ట్ కింద ఆధ్యాత్మికపర్యాటక ప్రాంతాలను రోప్‌వేలు అనుసంధానం చేస్తున్నాయిమనా గ్రామాన్ని సందర్శించిన విషయం నాకు గుర్తుందిఅక్కడ సరిహద్దులో మా సోదరీ సోదరుల అమితమైన ప్రేమాభిమానాలు నాకు దక్కాయిఆ గ్రామం నుంచే ‘వైబ్రంట్ విలేజ్’ పథకాన్ని ప్రారంభించాంసరిహద్దు గ్రామాలను శివారు ప్రాంతాలుగా కాకుండాదేశానికి తొలి గ్రామాలుగా ప్రభుత్వం భావిస్తోందినేడు ఉత్తరాఖండ్‌లోని దాదాపు 50 గ్రామాల్లో ఈ కార్యక్రమం కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయిఈ చర్యల ద్వారా ఉత్తరాఖండ్‌లో పర్యాటక అవకాశాలు ఊపందుకున్నాయిపర్యాటకం అభివృద్ధి చెందడం ద్వారారాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయిఈ ఏడాది దాదాపు కోట్ల మంది పర్యాటకులుయాత్రికులు ఉత్తరాఖండ్‌ను సందర్శించినట్లు కొన్ని వారాల కిందట ఓ నివేదిక పేర్కొన్నది2014కు ముందు చార్ ధామ్ యాత్రికుల సంఖ్య 24 లక్షలుగతేడాది 54 లక్షల మందికి పైగా యాత్రికులు చార్ ధామ్ యాత్ర చేపట్టారుహోటళ్లువసతిగృహాల నుంచి టాక్సీ డ్రైవర్లువస్త్ర వ్యాపారుల వరకూ అందరికీ ఇది లబ్ది చేకూర్చిందికొన్నేళ్లలో 5,000కు పైగా వసతి గృహాలు (హోమ్ స్టేలు)  నమోదయ్యాయి.

మిత్రులారా

నేడు ఉత్తరాఖండ్ తీసుకుంటున్న నిర్ణయాలుఅమలు చేస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయిక్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిందిదానిని నేను లౌకిక పౌరస్మృతిగా సూచిస్తున్నానుదేశం మొత్తం ఇప్పుడు దానిపై చర్చిస్తూదాని ప్రాధాన్యానన్ని గుర్తిస్తోందిరాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడడం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం చీటింగ్ నిరోధక చట్టాన్ని కూడా ఆమోదించిందిచీటింగ్ మాఫియాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందిప్రస్తుతం నియామకాలు పూర్తి పారదర్శకతతో సకాలంలో జరుగుతున్నాయిఈ రంగాల్లో ఉత్తరాఖండ్ సాధించిన విజయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

మిత్రులారా

ఈ రోజు నవంబర్ 9వ తేదీశక్తికి ప్రతీక తొమ్మిదిఈ శుభదినాన నేను అభ్యర్థనలు చేయాలనుకుంటున్నాను – అయిదు ఉత్తరాఖండ్ ప్రజలకుమిగతా నాలుగు అభ్యర్థనలు పర్యాటకులుయాత్రికులకు.

మిత్రులారా,

ఉత్తరాఖండ్ మాండలికాలుఘర్వాలీకుమవోనిజౌన్సారి వంటివి సుసంపన్నమైనవివాటిని కాపాడుకోవడం అత్యావశ్యకంఉత్తరాఖండ్ ప్రజలు రాష్ట్ర సాంస్కృతిక అస్తిత్వాన్ని కొనసాగించడానికి భవిష్యత్ తరాలకు ఈ మాండలికాలను నేర్పించాలన్నది నా మొదటి అభ్యర్థనప్రకృతిపర్యావరణాలను అమితంగా గౌరవించడం ఉత్తరాఖండ్ ప్రత్యేకతఇది గౌరా దేవీ నిలయంఇక్కడ ప్రతి స్త్రీ... నంద మాతకు ప్రతిరూపంప్రకృతిని కాపాడుకోవడం కీలకంకాబట్టితల్లి పేరిట మొక్కలు నాటే ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమానికి సహకరించాలన్నది నా రెండో అభ్యర్థనఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఊపందుకుందిఉత్తరాఖండ్ క్రియాశీల భాగస్వామ్యం వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో దోహదపడుతుంది. ‘నౌల్ ధార’ను పూజించే సంప్రదాయాన్ని తప్పక పాటించాలిమీరంతా నదులనుజలవనరులను సంరక్షించాలనినీటి స్వచ్ఛత కోసం చేపట్టే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలన్నది నా మూడో అభ్యర్థనమీ గ్రామాలను తరచుగాప్రత్యేకించి ఉద్యోగ విరమణ అనంతరం సందర్శిస్తూ మూలాలతో అనుసంధానం కావాలన్నది నా నాలుగో అభ్యర్థనతద్వారా  అనుబంధం బలోపేతమవుతుందితివారీ గృహాలుగా పిలిచే పాత గ్రామీణ గృహాలను సంరక్షించాలన్నది నా అయిదో అభ్యర్థనవాటిని వదిలిపెట్టే బదులు వసతి గృహాలు (హోమ్ స్టే)గా మార్చి ఆదాయం సమకూర్చుకోండి.

మిత్రులారా,

ఉత్తరాఖండ్‌లో పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతోందిదేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులు వస్తున్నారుపర్యాటకులకు నేను నాలుగు అభ్యర్థనలు చేస్తున్నానుమొదటిదిమీరు పవిత్రమైన హిమాలయాలను సందర్శించే సమయంలో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వండిసింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకండిరెండోది, ‘స్థానిక (వోకల్ ఫర్ లోకల్)’ అన్న నినాదాన్ని మంత్రప్రదంగా భావించి ప్రయాణం కోసం మీరు కేటాయించిన బడ్జెట్ లో కనీసం శాతాన్ని స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులపై ఖర్చు చేయండి. మూడోదిభద్రత అత్యంత ప్రధానమైనది కాబట్టిపర్వత ప్రాంతాల్లో ట్రాఫిక్ నియమాలకు కట్టుబడి ఉండండినాలుగోదిసందర్శనకు ముందే ఆధ్యాత్మిక ప్రదేశాల ఆచారాలునియమాలను తెలుసుకుని ఆ నియమాలను పాటించండిఈ విషయంలో ఉత్తరాఖండ్ ప్రజలు మీకు సంతోషంగా సహకరిస్తారుఉత్తరాఖండ్ ప్రజలకు చేసిన అయిదు అభ్యర్థనలుసందర్శకులకు చేసిన నాలుగు అభ్యర్థనలు ఈ దేవభూమి అస్తిత్వాన్ని గణనీయంగా బలోపేతం చేయడంతోపాటు దాని అభివృద్ధికి దోహదం చేస్తాయి.

మిత్రులారా

మనం ఉత్తరాఖండ్‌ను వేగిరం.. ప్రగతి పథంలో ముందుకు నడిపించాలిదేశ లక్ష్యాలను సాధించడంలో మన ఉత్తరాఖండ్ పోషిస్తున్న కీలకపాత్రను కొనసాగిస్తుందన్న విశ్వాసం నాకుందిఉత్తరాఖండ్ ఆవిర్భావ రజతోత్సవ సందర్భంగా అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుబాబా కేదార్ మీ అందరికీ శ్రేయస్సును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానుధన్యవాదాలు

 

***


(Release ID: 2072101) Visitor Counter : 33