సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతపై ప్రత్యేక ప్రచారం 4.0 విజయవంతంగా పూర్తి చేసిన సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ


78,543 కిలోల తుక్కు తొలగింపు: రూ.85,99,249 ఆదాయం

391 ప్రజా ఫిర్యాదులు, 72 అప్పీళ్ల పరిష్కారం

Posted On: 07 NOV 2024 6:57PM by PIB Hyderabad

అపరిష్కృతత్వాన్ని తగ్గించి స్వచ్ఛతను సంస్థాగతం చేయడంతోపాటు సుందరీకరణస్థలాన్ని సద్వినియోగం చేసుకోవడం... ప్రధాన లక్ష్యంగా సమాచారప్రసార మంత్రిత్వ శాఖ అక్టోబర్ నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచారాన్ని 4.0ను విజయవంతంగా నిర్వహించింది.

 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 600కు పైగా క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారుమంత్రిత్వ శాఖ అధికారులను ఆయా కార్యాలయాల్లో నియమించి దీని అమలును పర్యవేక్షించారు.

 

మంత్రిత్వ శాఖకు చెందిన పర్యవేక్షణాధికారి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సులువాట్సాప్ సందేశాల ద్వారా కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించారుకార్యక్రమ మొత్తం పురోగతిని కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు క్రమం తప్పకుండా పరిశీలించారు.

 

కార్యక్రమ ముఖ్యాంశాలు:

64,567 ఫైళ్లను పరిశీలించి 38,774 ఫైళ్లను తొలగించారు.

2,136 -ఫైళ్లను పరిశీలించి 1,331 ఫైళ్లను మూసేశారు.

391 ప్రజా ఫిర్యాదులు, 72 అప్పీళ్ల పరిష్కారం.

78,543 కిలోల తుక్కును తొలగించారుఅమ్మకాల ద్వారా రూ.85,99,249 ఆదాయం సమకూరింది.

866 బహిరంగ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.

65,561 చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి వచ్చింది.

325 వాహనాలను గుర్తించి 30 వాహనాలకు జరిమానా విధించారు.

పార్లమెంటు సభ్యుల నుంచి 33, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 1, పీఎంవో నుంచి సూచనలు రాగా వాటిని పరిష్కరించారు.

నిర్వహణ సామర్థ్యాన్నిపెంపొందించడానికి నిబంధనలను సులభతరం చేశారు.

కార్యక్రమం సందర్భంగా మంత్రిత్వశాఖక్షేత్ర కార్యాలయాలు అనేక అత్యుత్తమ పద్ధతులను అవలంబించాయివాటిలో కొన్ని:

 

ఇంధన సంరక్షణవ్యర్థాలను సంపదగా మార్చడంసుందరీకరణస్థలాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలైన అంశాలతో పాట్నా డీడీకే సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టిందితద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.

ఆలిండియా రేడియో ప్రసార కేంద్రాల్లో ఇంధన అడిట్ సమీక్ష.

ఢిల్లీలోని ఆలిండియా రేడియో ద్వారా మహిళల కోసం శానిటేషన్ విక్రయ యంత్రాన్ని అమర్చడం.

ఈ సమయంలో 325 వాహనాలను గుర్తించివాటిలో 30 వాహనాలకు జరిమానా విధించారు.

స్వచ్ఛత అభియాన్ కోసం నోయిడా లోని సత్యం ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్విద్యార్థుల భాగస్వామ్యం.

జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎఫ్ డీసీపాత ఫైళ్లను స్కానింగ్ చేసి భద్రపరచిఅనంతరం వాటిని తొలగించింది.

ఎన్ఎఫ్ డీసీ-ఎన్ఎంఐసీ బడి పిల్లలతో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాయితమ దృష్టిలో స్వచ్ఛత అంటే ఏమిటో సృజనాత్మక కార్యకలాపాల ద్వారా పిల్లలు వెల్లడించారు.

ఏక్ పేడ్ మా కే నామ్’ ద్వారా ఉద్యాన వనాల సుందరీకరణను ఎన్ఎఫ్ డీసీ చేపట్టింది.

కలకత్తాలోని సత్యజిత్ రే ఫిల్మ్టెలివిజన్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఆర్ఎఫ్ టీఐఆధ్వర్యంలో ‘మన పరిసరాల్లో స్వచ్ఛత ప్రాధాన్యం’పై వీధి నాటకాలు.

10. కలకత్తాలోని ఎస్ఆర్ఎఫ్ టీఐ ఎంపీపీ ప్రాంతం వెనుక ఉన్న వీఏటీ ప్రాంత సుందరీకరణ.

 

కలకత్తాలోని ఎస్ఆర్ఎఫ్ టీఐ సిబ్బంది నివాస గృహ సముదాయం ఎదురుగా ఉన్న వ్యర్థ భూమిని ఉద్యానవన ప్రాంతంగా తీర్చిదిద్దడం.

ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లకు బదులు పుస్తకాలను ప్యాక్ చేయడం కోసం ప్రచురణల విభాగంలో కాగితంతో చేసిన క్యారీ బ్యాగ్‌లను ఉపయోగించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తున్నారుఅలాగే వ్యర్థాలను పర్యావరణ హిత విధానంలో తొలగిస్తున్నారు.

రికార్డుల నిర్వహణఅనంతరం అనవసర రికార్డుల తొలగింపు కోసం డీపీడీ ప్రధాన కార్యాలయంలో మూడు నెలలకు ఒకసారి ఫైళ్లను సమీక్షించడం కోసం ఏర్పాట్లు చేశారు.

ఒకవైపు ముద్రించిన ఏపేపర్లను మరోసారి వినియోగించడం ద్వారా ప్రచురణల విభాగం ద్వారా వృక్షాలను రక్షిస్తున్నారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం 4.0 లక్ష్యాలకు పూర్తిగా కట్టుబడిన సమాచారప్రసార మంత్రిత్వ శాఖ.. సమష్టి కృషిసుస్థిర పద్ధతుల్లో స్వచ్ఛతను మెరుగుపరచడంస్వచ్ఛతను సంస్థాగతం చేయడంనిర్వహణ పరమైన అంశాలను మెరుగుపరచడంమొదలైన అంశాల ద్వారా అక్టోబరు 31న దాని ముగింపు అనంతరం కూడా క్రియాశీలంగా ఆ సంకల్పాన్ని కొనసాగిస్తోంది..

 

ప్రత్యేక ప్రచారం 4.0 ప్రారంభానికి ముందు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ వరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం జరిగిందిఅందులో ఈ ప్రత్యేక కార్యక్రమానికి మూలాధారాలైన మూడు కీలక అంశాల పరిధిలో దాదాపు 4871 కార్యక్రమాలు నిర్వహించారుస్వచ్ఛత మే జన భాగీదారీసంపూర్ణ స్వచ్ఛత (స్వచ్ఛత లక్షిత్ ఏకై లేదా సీటీయూ సహా), సఫాయి మిత్ర సురక్ష శివిర్ అన్నవి ఆ మూడు కీలక ఆధారాలుమంత్రిత్వ శాఖకు చెందిన వివిధ క్షేత్ర కార్యాలయాలలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు

 

 

***


(Release ID: 2071947) Visitor Counter : 26