నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

రేపటి నుంచీ15 రోజులపాటు జల్ ఉత్సవ్

డీడీడబ్ల్యూఎస్, జల శక్తిలతో కలసి ఉత్సవాన్ని నిర్వహిస్తున్న నీతి ఆయోగ్

20 రాష్ట్రాల్లోని 20 ఆకాంక్షాత్మక జిల్లాల్లో ఉత్సవ నిర్వహణ

Posted On: 05 NOV 2024 2:49PM by PIB Hyderabad

జల్ ఉత్సవ్’ ను రేపటి నుంచి 15 రోజుల పాటు నీతి ఆయోగ్ నిర్వహించనుంది. జల నిర్వహణ, జల సంరక్షణ, జల వనరులను ఎక్కువకాలం పాటు వినియోగించుకొనేటట్టు చూసుకోవడం.. ఈ విషయాలపై ప్రజల్లో చైతన్యాన్ని తీసుకుని రావాలన్నది ఈ ఉత్సవ ఉద్దేశం. డిసెంబరు-2023 లో జరిగిన ప్రధాన కార్యదర్శుల మూడో సమావేశం సందర్భంగా ‘నదీ ఉత్సవ్’ మాదిరిగానే ‘జల్ ఉత్సవ్’ను కూడా నిర్వహించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన సూచనకు అనుగుణంగా ఈ ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.


 

నేషనల్ జల్ జీవన్ మిషన్, తాగునీరు - పారిశుధ్య విభాగం (డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్టుమెంట్- డీడీడబ్ల్యూఎస్), జల్ శక్తి మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో జల ఉత్సవాన్ని- 20 ఆకాంక్షాత్మక జిల్లాలు/బ్లాకులలో ఈ నెల 6 నుంచి 24 వరకూ నిర్వహించనున్నారు. 20 రాష్ట్రాలలో ప్రారంభించే ఈ ఉత్సవంలో జల వనరులను కాపాడుకోవడంలో భాగంగా ప్రజలు పాలుపంచుకోవాలని పిలుపును ఇవ్వనున్నది. నీటిని అవసరం మేరకు వాడుకోవాలన్న జాగృతిని కుటుంబాల్లో కల్పించడం, నీటి నిర్వహణకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని నీటి సరఫరా సంస్థలకు, ఏజెన్సీలకు చెప్పడం - ఈ ఉత్సవ ఉద్దేశం. బడిపిల్లలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా వారి కుటుంబాలలో, వారు ఉంటున్న పేటలలో నీటి వినియోగ ప్రాముఖ్యాన్ని వారు ప్రచారం చేసేటట్లు తగిన మెళకువలను అందిస్తారు.

 

***


(Release ID: 2070905) Visitor Counter : 112


Read this release in: English , Hindi , Tamil , Urdu