ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని సీకర్‌ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి నష్ట పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 OCT 2024 7:32PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని సీకర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారుపీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.  

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్’ వేదికగా ఈ సందేశాన్ని పోస్ట్ చేసింది:

"రాజస్థాన్‌లోని సీకర్‌లో జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకంగా ఉందిఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానుఈ బాధను తట్టుకోగల మనోధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలిఅలాగేగాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నానురాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక అధికారుల బృందం బాధితుల సహాయక చర్యల్లో నిమగ్నమైంది: PM @narendramodi

 

 

‘‘రాజస్థాన్‌లోని సీకర్‌లో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలుఅలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి ఎక్స్-గ్రేషియా అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు” 

 

 

***

MJPS/VJ


(రిలీజ్ ఐడి: 2069715) సందర్శకుల సూచీ సంఖ్య : : 67