హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని సెన్సస్ బిల్డింగ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించి, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్ఎస్) మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


దేశాన్ని ఐక్యతా బంధంతో ముడిపెట్టి బలమైన భారతదేశానికి పునాది వేసిన సర్దార్ పటేల్

దేశ ప్రయోజనాల కోసం పోరాటానికీ, త్యాగానికీ చిహ్నమైన ఈ ఉక్కు మనిషి విగ్రహం దేశంలో ప్రజాస్వామ్య విలువల స్థాపనలో ఆయన అచంచల అంకితభావానికి నిదర్శనంగా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది: అమిత్ షా

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సిఆర్ఎస్ ) మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించడం సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలనతో అనుసంధానం చేసే ఒక ముఖ్యమైన ఆవిష్కరణ

ఈ అప్లికేషన్ తో పౌరులకు ఎక్కడి నుంచైనా తమ రాష్ట్ర అధికార భాషలో జనన, మరణాలను నమోదు చేసుకునే సౌలభ్యం; గణనీయంగా తగ్గనున్న రిజిస్ట్రేషన్ సమయం

Posted On: 29 OCT 2024 7:16PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని సెన్సస్ బిల్డింగ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు ఆవిష్కరించారుసివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్ఎస్మొబైల్ అప్లికేషన్ ను కూడా శ్రీ అమిత్ షా ప్రారంభించారు.

సర్దార్ పటేల్ దేశాన్ని ఐక్యతా బంధంతో ముడిపెట్టి బలమైన భారతదేశానికి పునాది వేశారని శ్రీ అమిత్ షా ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’  పోస్ట్ లో పేర్కొన్నారుదేశ ప్రయోజనాల కోసం పోరాటానికిత్యాగానికి చిహ్నమైన ఈ ఉక్కు మనిషి విగ్రహం దేశంలో ప్రజాస్వామ్య విలువల స్థాపనలో ఆయన అచంచలమైన అంకితభావానికి నిదర్శనంగా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా ప్రారంభించిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సిఆర్ఎస్ మొబైల్ అప్లికేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలనతో అనుసంధానం చేసే ఒక ముఖ్యమైన ఆవిష్కరణ అని శ్రీ అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా చేసిన మరో పోస్టులో పేర్కొన్నారుఈ అప్లికేషన్ ద్వారా పౌరులు ఎప్పుడైనాఏ ప్రాంతం నుంచైనాస్థానిక భాషలో జననమరణాల వివరాలను ఎలాంటి ఇబ్బందీఅంతరాయం లేకుండా నమోదు చేసుకోవచ్చనిఇది రిజిస్ట్రేషన్ కు పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు




(Release ID: 2069390) Visitor Counter : 16