ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

'కర్మయోగి సప్తాహ్' - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి


జాతీయ అభ్యాస వారోత్సవాల నుంచి వచ్చే కొత్త అభ్యాసాలతో 2047 వికసిత్ భారత్: ప్రధానమంత్రి

సరికొత్త ఆలోచనలు... పౌర కేంద్రీకృత విధానం.. ముఖ్యమన్న ప్రధాని
ప్రపంచ ఉత్తమ ప్రమాణాలు, పరస్పరం నేర్చుకోవడం, సమాచార వినిమయం... ముఖ్యమంటూ సివిల్స్ శిక్షణ సంస్థలకు ఉద్బోధ

కృత్రిమ మేథస్సుతో.. ఆకాంక్షాత్మక భారతంలో పురోగతీ, అవసరమైన మార్పూ సాధ్యం: ప్రధానమంత్రి

Posted On: 19 OCT 2024 6:57PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్  ఇంటర్నేషనల్ సెంటర్ లో కర్మయోగి సప్తాహ్ జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూమిషన్ కర్మయోగి ద్వారా మన దేశాభివృద్ధికి చోదక శక్తిగా మారే మానవ వనరులను సృష్టించడమే మన లక్ష్యమని అన్నారుఇంతవరకు సాధించిన పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాన మంత్రిఇదే ఉత్సాహంతో పనిచేస్తేదేశం పురోగతి చెందకుండా ఎవరూ ఆపలేరని అన్నారుజాతీయ అభ్యాస వారోత్సవాల (నేషనల్ లెర్నింగ్ వీక్ సందర్భంగా నేర్చుకునే కొత్త విషయాలుఅనుభవాలు మన పని  వ్యవస్థలను మెరుగుపరచడంలో సామర్ధ్యాన్ని అందిస్తాయనిఇది 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మనకు సహాయపడుతుందని ఆయన  చెప్పారు.

గత పదేళ్లుగా ప్రభుత్వ ఆలోచనా ధోరణిని మార్చడానికి తీసుకున్న చర్యల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.  ఇది నేడు ప్రజలకు సానుకూల ఫలితాలు అందిస్తోందని చెప్పారుఇది ప్రభుత్వంలో పని చేస్తున్న వారి ప్రయత్నాల కారణంగానూమిషన్ కర్మయోగి వంటి చర్యల ప్రభావం ద్వారానూ సాధ్యమయిందని ఆయన తెలిపారు.

కృత్రిమ మేధను ప్రపంచం ఒక అవకాశంగా భావిస్తుండగాభారత్ కు ఇది సవాలుతో పాటు అవకాశంగా కూడా మారిందని  ప్రధాని తెలిపారుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఆస్పిరేషనల్ ఇండియా అనే రెండు ఎఐల గురించి ఆయన మాట్లాడారుఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ... ఆకాంక్షాత్మక భారతదేశాన్ని ముందుకు నడిపించేందుకు మనం కృత్రిమ మేధస్సును విజయవంతంగా ఉపయోగించుకుంటేఅది సరికొత్త మార్పులకు దారితీస్తుందని అన్నారు.

డిజిటల్ విప్లవంసోషల్ మీడియా ప్రభావంతో అందరికీ సమాచార సమానత్వం ఒక ప్రామాణికంగా మారిందని ప్రధాన మంత్రి అన్నారుకృత్రిమ మేధతో సమాచారాన్ని విశ్లేషించి అవసరమైనది తీసుకోవడం కూడా అంతే సులువుగా మారుతోందిపౌరులకు సమాచారం అందించడంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించేలా వారికి సాధికారత కూడా కల్పిస్తోందికాబట్టిపెరుగుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వోద్యోగులు తమను తాము తాజా సాంకేతిక అభివృద్ధితో మమేకం చేసుకోవాల్సిన అవసరం ఉందిదీనిలో మిషన్ కర్మయోగి వారికి సహాయపడుతుంది.

వినూత్న ఆలోచనలుప్రజా ప్రయోజన దృక్పథాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రముఖంగా తెలిపారుకొత్త ఆలోచనలు కోసం అంకుర సంస్థలుపరిశోధనా సంస్థలుయువత సహకారం తీసుకోవాలని కోరారుప్రభుత్వ శాఖలు ప్రతి అంశంపై పూర్తి సమాచార యంత్రాంగాలను కలిగి ఉండాలని ఆయన సూచించారు

ఐజీఓటీ వేదికను  ప్రశంసిస్తూ... ఈ ప్లాట్ ఫామ్ పై 40 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారని ప్రధాని తెలిపారు. 1400కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయనివివిధ కోర్సులను పూర్తి చేసిన 1.5 కోట్ల మందికి పైగా అధికారులు సర్టిఫికెట్లు అందుకున్నారని  తెలిపారు.

సివిల్ సర్వీసు శిక్షణ సంస్థలు స్వతంత్రంగాఒకరితో ఒకరు సంబంధం లేకుండా పనిచేయడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారువాటి మధ్య భాగస్వామ్యాలుసహకారాలను పెంపొందించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారుశిక్షణ సంస్థలు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలనిప్రపంచ ఉత్తమ పద్ధతులను పరిశీలించి అవలంబించాలనిఅలాగే మొత్తం ప్రభుత్వ దృక్పథాన్ని పెంపొందించడానికి సరైన సమాచార మార్గాలను ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు.

మిషన్ కర్మయోగిని 2020 సెప్టెంబరులో ప్రారంభించారుఇది ప్రపంచ దృక్పథం కలిగి భారతీయ నైతిక విలువలకు అనుగుణంగా భవిష్యత్ పౌర సేవలను లక్ష్యంగా పెట్టుకుందిజాతీయ అభ్యాస వారం (నేషనల్ లెర్నింగ్ వీక్ ఎన్ ఎల్ డబ్ల్యుప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగతవృత్తిగత సామర్థ్యాభివృద్ధికి కొత్త ఊపును అందిస్తూ, “ఒక ప్రభుత్వం” సందేశాన్ని సృష్టిస్తుందిఇది అందరినీ జాతీయ లక్ష్యాల బాటలో సమన్వయం చేస్తూ జీవితాంతం నేర్చుకునే ప్రాముఖ్యతను ప్రోత్సహిస్తుంది.

 

***



(Release ID: 2066419) Visitor Counter : 10