సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కంటెంట్ హబ్‌గా భారత్: వేవ్ సదస్సును ఏర్పాటు చేసిన సమాచార, ప్రసార శాఖ, కంటెంట్ క్రియేటర్లకు 27 సవాళ్లు

ప్రభుత్వం ఏవీజీసీ రంగంపై దృష్టి సారించి ఏకగవాక్ష విధానం ద్వారా సులభతర వ్యాపార విధానాలను మెరుగుపరిచేందుకు కంటెంట్ రచనను ప్రోత్సహిస్తుంది: డా.ఎల్. మురుగన్

‘‘సమాచార ప్రసార విభాగంలో నూతనంగా ఆవిర్భవిస్తున్న పోకడలు, సాంకేతికతలు’’ అనే అంశంపై ట్రాయ్ ఏర్పాటు చేసిన సింపోజియాన్ని ప్రారంభించిన డా.ఎల్.మురుగన్

5జీ టెక్నాలజీ పరిణామాత్మక ప్రభావం; ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంలో స్టార్టప్‌లు, సృజనాత్మకతను ప్రోత్సహించి సమాచార అనుభవాన్ని మెరుగుపరుస్తాం: శ్రీ సంజయ్ జాజు

Posted On: 17 OCT 2024 4:56PM by PIB Hyderabad

‘సమాచార ప్రసార విభాగంలో నూతనంగా ఆవిర్భవిస్తున్న పోకడలు, సాంకేతికతలు’’ అనే అంశంపై జరిగిన సింపోజియంను సమాచార, ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ ఈ రోజు ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ-2024)లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ట్రాయ్ నిర్వహించింది. ఈ సింపోజియానికి ట్రాయ్ ఛైర్మన్ శ్రీ అనిల్ కుమార్ లహోటీ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ట్రాయ్ కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ చౌధరి హాజరయ్యారు. ఈ రంగంలో ఇటీవలి కాలంలో వచ్చిన సాంకేతిక పురోగతులు, వాటి ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

 

భారత సమాచార ప్రసార రంగాన్ని మారుస్తున్న సాంకేతికత

 

భారతీయ ప్రసార రంగంలో వస్తున్న సాంకేతిక పురోగతుల వల్ల కలుగుతున్న ప్రభావం గురించి తన ప్రారంభోపన్యాసంలో సమాచార ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా.ఎల్.మురుగన్ ప్రధానంగా ప్రస్తావించారు. ఏ అంశాన్ని ప్రసారం చేస్తున్నామనే దానినే ప్రేక్షకులు పరిగణనలోకి తీసుకుంటారని అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బలహీన వర్గాలకు చెందినవారిని కూడా మిళితం చేసేందుకు వారికి అందించే సమాచార ప్రసార సేవలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని వివరించారు.

మనం విషయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో జీవిస్తున్నాం. భారత్ కంటెంట్ హబ్ గా మారుతోంది. సోషల్ మీడియా ద్వారా సమాచార ప్రసారం దిగంతాలకు వ్యాపించింది. ఈ నేపథ్యంలో కంటెంట్ క్రియేటర్లకు ప్రయోజనం చేకూర్చేలా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సంయుక్తంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 - 9 తేదీల మధ్య వేవ్ సదస్సు నిర్వహిస్తుంది. ఈ సదస్సులో కంటెంట్ సృష్టికర్తలకు 27 సవాళ్లను ఇస్తారు. వాటిని పరిష్కరించడం ద్వారా వారి ప్రతిభను జాతీయ అంతర్జాతీయ వేదికలపై రుజువు చేసుకునే అవకాశం వస్తుంది. తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు సైతం లభిస్తాయి.

 

 

ఏవీజీసీ(యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. భారత్‌లో క్రమబద్ధీకరించిన ఏకగవాక్ష విధానం ద్వారా సులభతర వ్యాపార విధానాలను మెరుగుపరిచేందుకు కంటెంట్ రచనను ప్రోత్సహించాలన్నారు.

 

234 కొత్త నగరాల్లో ఎఫ్ఎం రేడియో ఛానళ్లను వేలం వేసేందుకు కేంద్ర కేబినెట్ ఇటీవలే నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. వీటి ద్వారా స్థానిక సమాచార ప్రసారాన్ని ప్రోత్సహించడం, మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రసార రంగంలో సాంకేతికతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తద్వారా ఆర్థికవృద్ధి, సాంస్కృతిక విస్తరణలో బ్రాడ్ కాస్టింగ్ రంగం పోషించే పాత్రను బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. అలాగే అందరికీ నాణ్యమైన సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ 2047 నాటికి వికసిత భారత్ అన్న ప్రధాన మంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు.

 

డిజిటల్ రేడియో, డీ2ఎం బ్రాడ్‌కాస్టింగ్, 5జీ సామర్థ్యం

 

సమాచార ప్రసార శాఖ(ఎంఐబీ) కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ ప్రసార రంగాన్ని మెరుగుపరిచేందుకు అభివృద్ధి ఆధారిత విధానాలు, కార్యక్రమాల రూపకల్పనలో మంత్రిత్వ శాఖ పోషిస్తున్న పాత్రను వివరించారు. స్పెక్ట్రమ్‌ను అనుకూలంగా వినియోగించుకుంటూ నాణ్యమైన శబ్ధ ప్రసారాన్ని అందించే డిజిటల్ రేడియో సామర్థ్యాన్ని వివరించారు. ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రసార సాధనమని తెలిపారు. నేరుగా మొబైల్ ఫోన్లకే సమాచారాన్ని అందించే డైరెక్ట్-టు-మొబైల్ (డీ2ఎం) ప్రసారాల వల్ల కలిగే ప్రయోజనాలను సైతం మంత్రి వివరించారు. ప్రభుత్వ రంగంలోని ప్రసారవ్యవస్థ అయిన ప్రసార భారతి ఐఐటీ కాన్పూర్, సాంఖ్య లాబ్స్ తో సంయుక్తంగా హైపవర్, లోపవర్ ట్రాన్సిమిటర్లను ఉపయోగించి డీ2ఎం పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు.

అలాగే 5జీ తీసుకువచ్చే పరిణామాల ప్రభావం గురించి కూడా చర్చించారు. ఆగ్మంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీలాంటి నూతన సాంకేతికతలతో కలిసినప్పుడు అత్యున్నత స్థాయి సమాచార ప్రసార అనభవాన్ని 5 జీ అందిస్తుందని తెలిపారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్సెంటెడ్ రియాల్టీ(ఏవీజీసీ-ఎక్స్‌ఆర్) రంగం గణనీయమైన అభివృద్ధి చెందే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇది స్టార్టప్ సంస్కృతిని పెంపొందిస్తుంది. సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. వార్తా వినియోగ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని వివరించారు

 

 

నియంత్రణా విధానాలను బలోపేతం చేయడం

 

ఈ రంగంలో ఇటీవలి కాలంలో వస్తున్న మార్పులపై చర్చించేందుకు, ట్రాయ్ చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సింపోజియం సహకరిస్తుందని ట్రాయ్ కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ చౌధరి అన్నారు. అలాగే నియంత్రణా విధానాల్లో తీసుకురావాల్సిన మార్పుల అవసరాన్ని చర్చిస్తుందన్నారు.

 

2026 నాటికి ఎం&ఈ రంగం రూ.3.08 ట్రిలియన్లకు చేరుకుంటుంది

 

 

మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో గణనీయమైన అభివృద్ధి గురించి ట్రాయ్ ఛైర్మన్ శ్రీ అనిల్ కుమార్ లహోటీ మాట్లాడారు. ఈ రంగంలో కొత్త మీడియా వేదికల విస్తరణ ద్వారా 2026 నాటికి రూ.3.08 ట్రిలియన్ల వృద్ధిని సాధిస్తుందని అన్నారు. మానవులకు వీక్షిస్తున్న వాటిలో లీనమయ్యే అనుభవాన్నిచ్చే ఇమర్సివ్ టెక్నాలజీల ప్రభావం గురించి ప్రధానంగా ప్రస్తావించారు.

 

డైరెక్ట్-టు-మొబైల్ బ్రాడ్ కాస్టింగ్ విధానం ప్రసారసేవల్లో ప్రత్యామ్నాయ టెక్నాలజీగా అభివృద్ధి చెందుతోందని, ఇంటర్నెట్ అవసరం లేకుండా సమాచారాన్ని ప్రసారం చేస్తోందని ఆయన తెలిపారు. అలాగే డిజిటల్ రేడియో అందించే ప్రయోజనాలను ప్రముఖంగా ప్రస్తావించారు. టీవీ ప్రసారాలు లేని ప్రాంతాల్లో వినియోగదారుల ఆసక్తులను పరిరక్షించే అంశంలో సూచనలు స్వీకరించేందుకు, నిబంధనలు రూపొందించేందుకు ట్రాయ్ కట్టుబడి ఉందన్నారు. సర్వీస్ ప్రొవైడర్లకు సమాన అవకాశాలు కల్పించి సమాచార ప్రసార రంగ వృద్దికి కృషి చేస్తామన్నారు. జాతీయ సమాచార ప్రసార విధాన రూపకల్పనకు ఇటీవలే ట్రాయ్ పలు సూచనలు చేసింది.

 

బ్రాడ్‌కాస్టింగ్ భవిష్యత్తు ఆవిష్కరణలు అన్వేషించడం

 

వివిధ సమాచార ప్రసార విధానాల్లో ఇమర్సివ్ టెక్నాలజీల ఆచరణాత్మక వినియోగ అవకాశాలను అన్వేషించడమే ఈరోజు జరిగిన సింపోజియం లక్ష్యం. దీనికోసం మూడు వేర్వేరు అంశాలపై వరుస చర్చలను ఏర్పాటు చేశారు. మొదట ‘సమాచార ప్రసార రంగలో ఇమర్సివ్ టెక్నాలజీల వినియోగం’పై చర్చ జరుగుతుంది. అనంతరం ‘డీ2ఎం, 5జీ ప్రసారాలు: అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై రెండో చర్చ సాగుతుంది. చివరిగా ‘డిజిటల్ రేడియో టెక్నాలజీ: భారత్ లో వ్యూహాల అమలు’పై మూడో చర్చ జరుగుతుంది.

 

టెలివిజన్, రేడియో బ్రాడ్ కాస్టింగ్ రంగాలకు చెందిన కమ్యూనికేషన్, టెక్నాలజీ నిపుణులు, డివైజ్, నెట్వర్క్ తయారీదారులు, సాంకేతిక దిగ్గజాలు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. వంద మందికి పైగా జాతీయ అంతర్జాతయ నిపుణులు ఈ సింపోజియంకు హాజరయ్యారు

 

సింపోజియంకు సంబంధించిన సమాచారం, సందేహ నివృత్తి కోసం ట్రాయ్ అడ్వైజర్(బీ&సీఎస్) శ్రీ దీపక్ శర్మను advbcs-2@trai.gov.in ఈ మెయిల్లో సంప్రదించవచ్చు.

 

****

 



(Release ID: 2066068) Visitor Counter : 9