ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పంతొమ్మిదో ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థల అంతర్జాతీయ సమావేశాన్ని (ఐసీడీఆర్ఏ) ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జె.పి. నడ్డా

భారతదేశంలో మొదటిసారి ఐసీడీఆర్ఏ సమావేశం, ప్రపంచ ఆరోగ్య సంస్థలోని 194 కు పైగా సభ్యత్వ దేశాల నుంచీ నియంత్రణ ప్రాధికార సంస్థలు, విధాన రూపకర్తలు, ఆరోగ్య అధికారులు

కోవిడ్ సమయంలో- ఆరోగ్యపరంగా, నవకల్పనల్లో భారత్ ప్రపంచనేతగా మారింది. ఔషధ రంగంలో తన ప్రాముఖ్యతను నిరూపించుకున్న భారత్: శ్రీ జె.పి. నడ్డా

‘‘ప్రపంచం అంతటా వైద్య ఉత్పాదనల సురక్ష, ప్రభావశీలత్వం, నాణ్యతలకు పూచీపడే నియంత్రణ సంబంధిత నియమాలను రూపొందించడానికి, భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి ఐసీడీఆర్ఏ ఒక వేదికను అందిస్తోంది’’

‘‘దేశంలో సురక్షితమైన, ప్రభావాన్వితమైన ఔషధాలకు, వైద్య పరికరాలకు ఆమోదాన్ని తెలిపేందుకు, ప్రపంచంలో 200కు పైగా దేశాలకు ఎగుమతి చేయడానికి పటిష్ట వ్యవస్థలను సీడీఎస్ సీఓ అభివృద్ధి పరచింది’’

‘‘సీడీఎస్ సీఓ లో ప్రస్తుతం 95 శాతానికి పైగా నియంత్రణ సంబంధిత ప్రక్రియలను డిజిటలీకరించారు, దీని ద్వారా సంబంధిత వర్గాలలో నమ్మకాన్ని పెంచడంతో పాటు పారదర్శకత్వాన్ని తీసుకు వచ్చారు’’

మందుల నియంత్రణలో భౌగోళిక సహకారం ముఖ్యం, మరీ ముఖ్యంగా మహమ్మారి అనంతర కాలపు ప్రపంచంలో సూక్ష్మజీవి నాశక గుణ నిరోధకత్వం, ఆరోగ్య

Posted On: 14 OCT 2024 1:48PM by PIB Hyderabad

ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా పంతొమ్మిదో ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థల అంతర్జాతీయ సమావేశాన్ని (ఐసీడీఆర్ఎ)ఢిల్లీలో ఈ రోజున ప్రారంభించారుఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓసహకారంతో కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్  (సీడీఎస్‌సీఓఈ నెల 14 నుంచి 18 వరకు భారతదేశంలో మొదటిసారిగా నిర్వహిస్తున్నదిఈ కార్యక్రమం డబ్ల్యూహెచ్ఓలో 194 కు పైగా సభ్య దేశాల నియంత్రణ ప్రాధికార సంస్థలనువిధాన రూపకర్తలనుఆరోగ్య అధికారులను ఒక చోటుకు తీసుకు వస్తున్నది.

ఈ సందర్భంగా శ్రీ జె.పినడ్డా ప్రసంగిస్తూ.. ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ సంబంధిత ప్రమాణాలను పెంపొందింపచేయడానికి,  ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉమ్మడిగా కృషి చేయవలసి ఉందని స్పష్టం చేశారు. ఇదివరకు మానవ జాతి ఎరుగని కోవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగంలో తలెత్తిన ప్రతికూలతను ఎదుర్కోవడంలో భారతదేశం ఓ భౌగోళిక నేతగా ఎదగడం ఒక్కటే కాకుండాప్రపంచానికి ఔషధాలయంగా తన పాత్రను పునరుద్ఘాటించింది కూడా అన్నారు.  ‘‘భారతదేశం తన ఆరోగ్య సంరక్షణ రంగ మౌలిక సదుపాయాలను వేగవంతంగా విస్తరించిదేశంలోనుబయటి దేశాలలోను టీకా అవసరాలను తీర్చడానికి ఉత్పత్తిని పెంచి వేసింది. ఒక వంద కోట్లకు పైగా ప్రజలకు కోవిడ్-19 నిరోధక టీకా కార్యక్రమాన్ని అమలు చేయడంలో సాఫల్యాన్ని సాధించడంమా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నిరూపించింది’’ అని శ్రీ నడ్డా అన్నారు.

ప్రపంచం అంతటా వివిధ దేశాలకు ఎంతో అవసరమైన మందులనుటీకాలను వైద్య చికిత్సా ఉత్పత్తులను తక్కువ ఖరీదులో అందజేయడంలో భారతదేశం ఒక కీలక పాత్రను పోషించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.  ‘‘మహమ్మారి విజృంభించిన కాలంలో మేం ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న సూక్తి మార్గదర్శకత్వంలో 150కి పైగా దేశాలకు ప్రాణ రక్షక మందులనుటీకాలను అందజేసి మా సమర్ధనను చాటిచెప్పాం.  ప్రపంచ ఆరోగ్య రంగం విషయంలో అంతర్జాతీయంగా సంఘీభావాన్ని కనబరచాలన్నదే భారతదేశం అవలంబించిన వైఖరికి కీలకం అయిందిప్రపంచం ప్రగతి పథంలో సాగితేనే మా దేశ ప్రగతి సాధ్యంఈ రెండు అంశాలు విడదీయలేనివి అని మేం నమ్ముతున్నాం. మరి అందుకే మేం ప్రపంచ ఆరోగ్య భద్రతకుప్రపంచ స్థిరత్వానికి ఎప్పటికీ నిబద్ధతతో పాటుపడతాం’’ అని ఆయన అన్నారు.

‘‘ప్రపంచంలో సురక్షితప్రభావాన్వితగుణకారి వైద్య ఉత్పాదనలకు పూచీపడడానికి గాను జ్ఞానాన్ని పంచుకోవడానికిభాగస్వామ్యాలను ప్రోత్సహించడానికినియంత్రణ సంబంధిత నియమావళిని అభివృద్ధి పరచడానికి అవకాశాలను ఐసీడీఆర్ఏ కల్పిస్తుంద’’ని శ్రీ నడ్డా అన్నారు.

 

సీడీఎస్‌సీఓ  కార్యసాధనలను గురించి శ్రీ నడ్డా ప్రముఖంగా వివరిస్తూ, ‘‘సురక్షితప్రభావశీల ఔషధాలకువైద్య పరికరాలకు దేశంలో ఆమోదాన్ని తెలపడానికిఅలాగే వాటిని ప్రపంచంలో 200కు పైగా దేశాలకు ఎగుమతి చేయడానికి బలమైన వ్యవస్థలను సీడీఎస్‌సీఓ రూపొందించింద’’న్నారు. అందుబాటు ధరలలో నాణ్యత కలిగిన మందులు లభించేటట్లుగా చూడాలన్నదే దీనిలోని ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు.  ‘‘దేశంలో ప్రస్తుతం ఔషధ పరీక్షల ప్రయోగశాలలు పని చేస్తున్నాయి. మరో రెండు ప్రయోగశాలలను త్వరలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. మందులను త్వరగా పరీక్షించిమార్కెట్ లోకి విడుదల చేయడానికి వివిధ నౌకాశ్రయాలలో ప్రయోగశాలలు పనిచేస్తున్నాయిముడి పదార్థాలను దిగుమతి చేసుకొంటున్నాందీనికి అదనంగారాష్ట్ర స్థాయి ఔషధ నియంత్రణ సంస్థలకు చెందిన పరీక్షలు ప్రధాన వ్యాపకమైన ప్రయోగశాలలు మరో 38 కూడా వాటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అన్నీ కలుపుకొంటేనియంత్రణ సంబంధిత నిఘా యంత్రాంగం ద్వారా ప్రతి ఒక్క సంవత్సరంలో ఒక లక్షకు పైచిలుకు నమూనాలను పరీక్షిస్తున్నారు’’ అని కూడా మంత్రి తెలిపారు.

 

‘‘ప్రస్తుతానికి 95 శాతానికి పైగా నియంత్రణ సంబంధిత ప్రక్రియలను సీడీఎస్‌సీఓలో డిజిటలీకరించారు. దీనితోపారదర్శకత్వానికి ప్రాధాన్యం లభించడంతో పాటే సంబంధిత వర్గాలలో నమ్మకం అధికం అయింది’’ అని మంత్రి అన్నారు. ‘‘ఆరోగ్య సంరక్షణ సేవల అందజేతలో వైద్య పరికరాలకు ఉన్న ప్రాముఖ్యాన్ని లెక్కలోకి తీసుకొనిభారత్ లో వైద్య సాధనాల పరిశ్రమను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకు వస్తున్నాం. ఉత్తమ తయారీ మార్గదర్శకాలను మరింత సమగ్రంగా తీర్చిదిద్దడానికి వాటిని డబ్ల్యూహెచ్ఓ ఉత్తమ తయారీ మార్గదర్శకత్వాలకు తగినట్లుగా ఔషధ సంబంధిత నియమావళిని సవరించాం’’ అని కూడా ఆయన అన్నారు.


 

మందుల సరఫరా వ్యవస్థ పక్కాగా ఉండేటట్లు చూడటానికిఅగ్రగామి 300 ఔషధ ఉత్పాదనల బ్రాండులకు బార్ కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ కోడ్ ను తప్పక తీసుకోవాలని కూడా సూచించారు. అదే విధంగాభారతదేశంలో తయారు అయినలేదా బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకొన్న  అన్ని ఏపీఐ ప్యాక్ లకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి అనే నిబంధనను అమలుపరుస్తున్నారు.

 

ప్రపంచంలో ఆరోగ్య  సంరక్షణ ప్రమాణాలను పురోగమన పథంలో నిలపడానికి భారతదేశం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని నొక్కి చెప్తూకేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.  ‘‘మేం మూడు ‘ఎస్’లను నమ్ముతాం. ‘‘స్కిల్స్పీడ్ స్కేల్’’ ఈ మూడు అంశాలపై శ్రద్ధ వహించడం ద్వారా ఎలాంటి రాజీకి తావు ఇవ్వకుండా ప్రపంచ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూనే ఔషధ ఉత్పాదనలకు పెరుగుతున్న గిరాకీని మేం తీర్చ గలిగాం. మానవుల శరీరాల్లో సూక్ష్మజీవి నాశక శక్తి క్షీణత మొదలుకొని ప్రాణరక్షక వైద్య చికిత్సలు అందరికీ అందుబాటులో ఉండేటట్లుడి చూడడం తాలూకు పెను సవాళ్ళను పరిష్కరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మేం ఈ సంభాషణలో కేవలం ప్రతినిధులం కాదుఒక ఆరోగ్యవర్ధకసురక్షితమరింత వ్యతిరేకతలను తట్టుకొని నిలచే ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో భాగస్వాములుగా కూడా ఉన్నామ’’ని ఆయన అన్నారు.


 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒడైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఎడ్ నామ్ ఘెబ్రెయెసస్  మాట్లాడుతూఈ కీలక భౌగోళిక నియంత్రణ ప్రధాన సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు భారతదేశాన్ని ప్రశంసించారు. మందుల నియంత్రణలోమరీ ముఖ్యంగా మానవ దేహాలలో సూక్ష్మజీవి నాశక సంబంధి శక్తి క్షీణత వంటి సవాళ్ళమహమ్మారి తీవ్రత సమసిపోయిన నేటి కాలంలో తలెత్తుతున్న ఇతర రూపాల సవాళ్ళ తో పాటు కృత్రిమ మేధ (ఏఐ)ను ఆరోగ్య సంరక్షణ రంగంలో సురక్షితమైన రీతిలో వినియోగించుకోవాలనే సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఆయన ప్రస్తావించారు.

 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓనైరుతి ఆసియా ప్రాంతం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ సాయిమా వాజెద్ మాట్లాడుతూ, ‘‘భారతదేశం జనరిక్ మందులకు అతి పెద్ద సరఫరాదారుగా ఉందనిభారతదేశ ఔషధ నిర్మాణ పరిశ్రమ ప్రపంచంలో మూడో అతి పెద్ద పరిశ్రమగా ఉంద’’ని తెలిపారు. ప్రపంచానికి కావలసిన టీకామందులలో 50 శాతానికి పైగా టీకామందులను  భారతదేశమే అందిస్తోందన్నారు. అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యత అనే లక్ష్యాన్ని సాధించాలంటే అందుకు ఒక బలమైన నియంత్రణ వ్యవస్థల కలబోతవివిధ దేశాల నియంత్రణ ప్రాధికార సంస్థలు వాటి వద్ద ఉండే సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కీలకం అని ఆమె స్పష్టంచేశారు.


 

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ, ‘‘భారతదేశ ఔషధ నిర్మాణ పరిశ్రమ ఇటీవలే దేశానికి నాలుగో అతి పెద్ద ఎగుమతి రంగంగా ఎదిగిందన్నారు. దీనిని పట్టి చూస్తేప్రపంచంలో ఔషధ సరఫరా వ్యవస్థలో మా దేశం ఎంతలా మమేకం అయిందో అర్థం అవుతోందని ఆమె అన్నారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఔషధ ఉత్పత్తిదారు దేశం ఇండియాయేమరి యుఎస్ఏకు వెలుపల యుఎస్ ఎఫ్‌డీఏ ఆమోదాన్ని పొందిన కర్మాగారాల్లో భారీ సంఖ్యలో కర్మాగారాలు భారతదేశంలోనే ఉన్నాయి’’ అని  కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అన్నారు.  ‘‘ప్రపంచానికి అవసరమైన వేక్సీన్ లలో 50 శాతం వేక్సీన్ లను భారతదేశం సరఫరా చేస్తూ ఉంటేఆ సరఫరాలలో భీమ భాగం డబ్ల్యూహెచ్ఓయూనిసెఫ్ఇంకా పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పిఏహెచ్ఓ)జీఏవీఐ ల వంటి ఐక్య రాజ్య సమితి ఏజెన్సీలకు చేరుకొంటున్నాయ’’ని కూడా ఆమె అన్నారు.

 

డబ్ల్యూహెచ్ఓ లో అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సంఘం సహ అధ్యక్షురాలు మాలెబోనా ప్రెశియస్ మేట్ సొసొ మాట్లాడుతూ,  ‘‘మందుల నియంత్రణ ప్రస్తుతం అత్యంత కీలకమైన అంశాలలో ఒకటిగా ఉందన్నారు. నియంత్రణ సంబంధిత నిర్ణయాల ప్రభావాన్ని కేవలం జాతీయ స్థాయిలోనే కాక ప్రపంచ స్థాయిలో కూడాఅలాగే ఆసుపత్రి గదులలో కూడా గమనించవచ్చు’’ అని’ ఆమె అన్నారు. కుశల నియంత్రణపర్యవేక్షణల ద్వారా ప్రజారోగ్య రంగంలో జోక్యాలనుప్రతిస్పందనను పరిమితం చేయవచ్చని ఆమె అన్నారు.


 

భారతదేశాన్ని ప్రపంచ ఔషధాలయంగా ఆమె పేర్కొంటూఈ ఖ్యాతి భారత్ కు కొన్ని ఆశలనుసామర్థ్యాలను కూడా ముడి వేస్తుందన్నారు. నియంత్రణ అతిగా ఉండడంఅవసరాని కన్నా తక్కువగా ఉండడం.. ఈ రెండిటి కన్నా నియంత్రణ వివేకవంతమైందిగా ఉండడం ముఖ్యమని చెప్తూఆమె తన ప్రసంగాన్ని ముగించారు.


 

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశి తన ప్రసంగంలో మందుల నియంత్రణఇంకా వైద్య పరికరాల రంగంలో భారతదేశం సాధించిన ఘనతలను వివరించారు. భారతదేశం రూపొందించిన సీఏఆర్ టీ-సెల్ చికిత్సకు ఆమోదం లభించిందన్న సంగతిని కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘మేం మా నైపుణ్యాలకుమా వ్యవస్థలలోని సామర్థ్యాలకు అదే పనిగా సాన పెట్టుకొంటున్నాం. తక్కువ నియంత్రణలుఎక్కువ కార్యాచరణల బాటలో సాగిపోతున్నాం’’ అని ఆయన అన్నారు.

 

ఈ సమావేశాలు జరగడానికన్నా ముందుఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనలో భారతదేశం నవకల్పనసామర్థ్యాలుఔషధ నిర్మాణ రంగంలో భారత్ నాయకత్వంవైద్య చికిత్సలో ఉపయోగించే పరికరాలుక్లినికల్ రిసర్చ్ రంగం ప్రగతిని కళ్లకు కట్టారు. వివిధ దేశాల నియంత్రణ సంస్థల వారుసంబంధిత వర్గాల వారితో కూడిన అంతర్జాతీయ సందర్శకుల సమక్షంలో ఔషధ నిర్మాణ రంగ దిగ్గజాలువైద్య ఉపకరణాల తయారీదారు సంస్థలుఆరోగ్య సంరక్షణ రంగంలో నూతన ఆవిష్కర్తలు సహా తమ తమ ప్రగతినిసాఫల్యాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ప్రపంచానికి ఔషధాలయం’’గా భారతదేశానికి ఉన్న స్థాయిని వెల్లడించడంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సేవలలో భారత్ ప్రభావం అంతకంతకూ విస్తరించడాన్ని చాటిచెప్పింది.

 

ప్రధాన సమావేశ సదస్సుకు తోడుఅనేక అనుబంధ సదస్సులను కూడా నిర్వహించనున్నారువాటిలో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనినియంత్రణ రంగంలో ఎదురవుతున్న సవాళ్ళపై చర్చించనున్నారు. ఈ సమావేశాలు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనియంత్రణ వ్యవస్థలను బలపరచే దిశలో వివిధ దేశాల ప్రతినిధుల మధ్య సంభాషణలకు అవకాశాలను ఇచ్చిప్రపంచ ఆరోగ్య సంబంధ అవసరాలను తీర్చడంలో పరస్పర సహకారాన్ని పెంచి పోషించడానికి ఉద్దేశించిన ద్వైపాక్షికబహపాక్షిక మాటామంతీకి మార్గాన్ని సుగమం చేస్తాయని చెప్పాలి.

 

 

కీలక చర్చలునియంత్రణపరమైన సవాళ్ళు

అయిదు రోజు పాటు జరిగే ఈ సమావేశంలో నియంత్రణ ప్రాధికార సంస్థలుపరిశ్రమ ప్రముఖులు పాల్గొని,  ప్రపంచ మందులువైద్య పరికరాల నియంత్రణ రంగాలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలపై చర్చోపచర్చలను జరపనున్నారుకొన్ని ముఖ్య సదస్సులు ఈ కింది విధంగా ఉండబోతున్నాయి:

  • స్మార్ట్ నియంత్రణపై సర్వసభ్య సదస్సునియంత్రణ పరంగా విశ్వాసనీయత పరిధితో పాటువరల్డ్ లిస్టెడ్ ఆథారిటీస్ (డబ్ల్యూఎల్ఏరూపావళి అంతకంతకూ మారిపోతున్న క్రమంపై చర్చలు చోటు చేసుకోనున్నాయి. వివిధ దేశాలలో ప్రక్రియల సంస్కరణలో సహకారాన్ని ఏ విధంగా పెంపొందింప చేయాలో అనే అంశాన్ని ప్రపంచ నియంత్రణ సంస్థలు పరిశీలించనున్నాయి.

 వైద్య పరికరాల అంశంపై కార్యశాలలు ఇన్ విట్రో డయాగ్నోస్టిక్స్ (ఐవీడీ స్సహావైద్య పరికరాల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఈ చర్చలలో నిపుణులు పాల్గొని ప్రపంచ స్థాయిలోప్రాంతీయ స్థాయిలలో నియంత్రణ ఏ విధంగా ఉంటున్నదీ చర్చించనున్నారు.

  • ఔషధ నిర్మాణ రంగంలో ప్రారం సామగ్రి నాణ్యత ఔషధ నిర్మాణ రంగంలో తయారయ్యే ఉత్పాదనలలో నాణ్యతసురక్షలకు పూచీపడడం కోసం వాటి ఆరంభ దశ నుంచే కఠిన నిబంధనలను పాటించవలసిన ఆవశ్యకతపై ఈ కార్యశాల దృష్టిని సారించనుంది.

  • ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ): నియంత్రణ పరమైన పొరపాట్లుఫార్మాకో-విజిలెన్స్ఇంకా క్లినికల్ ట్రయల్స్.. వీటిని మెరుగు పరచడంలో ఏఐ పాత్రపై నియంత్రణ సంస్థల అధికారులుపరిశ్రమ నిపుణులు చర్చించనున్నారుఅలాగే సమాచారరాశి తాలూకు గోపనీయతఅమలులకు సంబంధించిన సవాళ్ళను పరిష్కరించడాన్ని గురించి కూడా వారు చర్చిస్తారు.

  • కోవిడ్ 19 మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని నియంత్రణ సంబంధి సన్నాహక చర్యలుఇది ఒక సర్వసభ్య సదస్సుదీనిలో కోవిడ్ - 19 మహమ్మారి నుంచి నేర్చుకొన్న పాఠాలను గురించి,  భవిష్యత్తులో ప్రజారోగ్య రంగంలో అత్యయిక స్థితులు తలెత్తితే వాటిని ఎదుర్కోవడానికి నియంత్రణ పరమైన నూతన ఆవిష్కరాలను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉండవలసిన అవసరాన్ని గురించి దృష్టిని సారించనున్నారు.


 

భాగస్వామ్యాల ద్వారాసమష్టి కృషి ద్వారా ప్రపంచ నియంత్రణ వ్యవస్థలను పటిష్ట పరచడంపై పంతొమ్మిదో ఐసీడీఆర్ఏ శ్రద్ధ తీసుకోనుంది. సవాళ్ళనువైద్య ఉత్పాదనలకు సంబంధించిన నియంత్రణలలో పొందికను తీసుకు రాగల అవకాశాలనుఆ క్రమంలో ఎదురు కాగల సవాళ్లనుసూక్ష్మజీవి నాశక నిరోధక శక్తి క్షీణతను పరిష్కరించడం ఎలాగన్న ప్రశ్ననుసాంప్రదాయిక ఔషధాల వినియోగాన్ని ముందుకు తీసుకు పోవడాన్ని వివిధ దేశాల నియంత్రణ ప్రాధికార సంస్థలు చర్చించనున్నాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శిఐసీఎమ్ఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ఆరోగ్య శాఖకు వ్యయ సలహాదారు శ్రీ రాజీవ్ వధావన్భారతదేశంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్ఆఫ్‌రన్ లతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు.

 

***


(Release ID: 2064871) Visitor Counter : 57