మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సుస్థిరాభివృద్ధి లక్ష్యం గల నగరాలు, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించి 3 ‘అత్యుత్తమ కృత్రిమ మేధ’ కేంద్రాలను అక్టోబర్ 15 న ప్రారంభించనున్న కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
प्रविष्टि तिथि:
14 OCT 2024 1:28PM by PIB Hyderabad
సుస్థిరాభివృద్ధి లక్ష్యం గల నగరాలు, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ రంగాలకు సంబంధించి, 3 ‘అత్యుత్తమ కృత్రిమ మేధ కేంద్రాల'ను కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అక్టోబర్ 15న న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు.

‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన దిశగా ప్రారంభమవుతున్న ఈ మూడు ‘అత్యుత్తమ కృత్రిమ మేధ’ కేంద్రాలకు, ఉన్నత స్థాయి విద్యా సంస్థలు నేతృత్వం వహిస్తాయి. ఇందుకు పరిశ్రమ వర్గాల, అంకుర పరిశ్రమల సహకారం తీసుకుంటాయి. ఈ మూడు రంగాల బహువిషయిక అంశాలతో కూడిన పరిశోధనల నిర్వహణ, అత్యాధునిక సాంకేతిక ద్వారా అత్యంత సమర్ధంగా పనిచేసే వ్యవస్థల నిర్మాణాన్నీ చేపడతాయి. మూడు కీలక రంగాల్లో సమర్ధమైన కృత్రిమ మేధ వాతావరణ కల్పన, నాణ్యమైన మానవ వనరులకు ప్రోత్సాహం లక్ష్యంగా పథకం రూపుదిద్దుకుంటోంది.
“భారత్ లో తయారైన ఏఐ, భారత్ కోసం పనిచేసే ఏఐ” లక్ష్యంగా, ఈ కేంద్రాల ఏర్పాటు 2023-24 వార్షిక బడ్జెట్, 60వ పేరాలో ప్రకటించారు. తదనుగుణంగా, మూడు కేంద్రాల ఏర్పాటుకు 2023-24 నుంచి, 2027-28 మధ్య కాలానికి 990 కోట్ల రూపాయలను కేటాయించారు.
పథకం అమలు నిమిత్తం జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ శ్రీధర్ వెంబు సహ అధ్యక్షుడిగా, ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కార్యక్రమానికి ఉన్నత విద్యా విభాగ కార్యదర్శి శ్రీ కె. సంజయ్ మూర్తి, ఐఐటీ విద్యా సంస్థల డైరెక్టర్లు, ఉన్నత విద్యా సంస్థల, పరిశ్రమల అధిపతులూ, అంకుర పరిశ్రమల వ్యవస్థాపకులు, వివిధ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు హాజరవుతారు.
***
(रिलीज़ आईडी: 2064750)
आगंतुक पटल : 184