ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లో గోడకూలిన దుర్ఘటనలో మృతులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ఆర్థిక సహాయం ప్రకటన
Posted On:
12 OCT 2024 5:09PM by PIB Hyderabad
గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో గోడకూలిన దుర్ఘటనలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 వంతున ఆయన ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘గుజరాత్‌లోని మెహసానాలో గోడకూలిన దుర్ఘటన నన్నెంతో కలచివేసింది. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ లోటును భరించే శక్తిని ఆ దైవం వారికివ్వాలని ప్రార్థిస్తున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అక్కడి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరాను:PM @narendramodi.’’ అని పేర్కొన్నారు.
‘‘గుజరాత్‌లోని మెహసానాలో సంభవించిన దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాం’’ అని ప్రధాని ప్రకటించారు.
***
MJPS/RT
(Release ID: 2064596)
Visitor Counter : 33
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam