ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియాన్-ఇండియా సదస్సు సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానిని కలిసిన ప్రధానమంత్రి
Posted On:
10 OCT 2024 7:18PM by PIB Hyderabad
ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వియెంటియాన్, లావో పీడీఆర్‌లో న్యూజిలాండ్ ప్రధానమంత్రి శ్రీ క్రిస్టోఫర్ లక్సన్‌ను కలిశారు. ఈ ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి.
వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం, విద్య, డెయిరీ, అగ్రి-టెక్, క్రీడలు, పర్యాటకం, అంతరిక్షం, ప్రజా సంబంధాలు సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలను ఇరువురు ప్రధానులు చర్చించారు. తరచూ ఉన్నత స్థాయి సంప్రదింపుల ద్వారా ద్వైపాక్షిక సంబంధాల్లో మంచి పురోగతి సాధ్యమైందని వారు పేర్కొన్నారు. ఇటీవల భారత రాష్ట్రపతి న్యూజిలాండ్ పర్యటన విజయవంతమైన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలన్న న్యూజిలాండ్ నిర్ణయాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు.
బహుళ పక్ష వేదికలలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడం, భారత్-న్యూజిలాండ్ సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం పట్ల ఇరు దేశాల ప్రధానులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
పరస్పర అనుకూలతను బట్టి భారత్‌ను సందర్శించాలన్న ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆహ్వానానికి న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ అంగీకరించారు.
***
(Release ID: 2064009)
Visitor Counter : 84
Read this release in:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam