సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
‘జాతీయ అనుభవ్ పురస్కారాల పథకం, 2025’ ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులతో పాటు ‘అనుభవ్ పురస్కార్ పథకం’ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు
‘అనుభవ్ పోర్టల్’ లో పింఛన్‌దారుల అభిప్రాయాలను తెలియజేయడానికి 2025 మార్చి 31 ఆఖరి తేదీ;
అనుభవ్ పోర్టల్ లో అభిప్రాయాలను చెప్పాలంటూ పింఛనుదారులను కోరనున్న
మంత్రిత్వ శాఖలు/విభాగాలు
జాతీయ అనుభవ్ పురస్కారాల పథకం: జాతి నిర్మాణానికి అనుభవాల ఖజానా
ఇంతవరకు 59 అనుభవ పురస్కారాలను, 19 న్యాయ నిర్ణేతల మండలి- ధ్రువ పత్రాలను ఇచ్చిన డీఓపీపీడబ్ల్యూ
प्रविष्टि तिथि:
07 OCT 2024 5:33PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా పింఛను - పింఛనుదారుల సంక్షేమ విభాగం ‘అనుభవ్’ పేరుతో ఒక వెబ్ సైటును 2015 మార్చి నెలలో ప్రారంభించింది. పదవీ విరమణ చేస్తున్న, లేదా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ప్రభుత్వ అనుమతి తర్వాత- వారి స్వీయానుభవాలను ఇతరులతో పంచుకోవచ్చు. విశ్రాంత ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకునేలా వారిని ప్రోత్సహించేందుకు ఈ వార్షిక పురస్కారాల పథకాన్ని ప్రారంభించారు.
ఇంతవరకు మొత్తం 10,886 రచనలు అచ్చయ్యాయి. వాటిలో 78 విశిష్ట రచనలకు 59 అనుభవ్ పురస్కారాలను, 19 న్యాయ నిర్ణేతల మండలి- ధ్రువ పత్రాలను ఇప్పటి వరకు ఏడు సార్లు నిర్వహించిన కార్యక్రమాలలో అందజేశారు.
‘జాతీయ అనుభవ్ పురస్కారాల పథకం- 2025’ను భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకంలో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు వారి వారి అనుభవాలకు అక్షరరూపాన్నిచ్చే నివేదికలను దాఖలు చేయవలసి ఉంటుంది. ఆ తరువాత, సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు 2025 మార్చి నెల 31 వరకు ప్రచురణకు నోచుకొన్న రచనలను మదింపు చేసి అయిదు అనుభవ్ పురస్కారాలకు, పది న్యాయ నిర్ణేతల మండలి ధ్రువపత్రాలను ప్రదానం చేయడానికి తాత్కాలిక ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తాయి.
అనుభవ్ పోర్టల్ చరిత్రలో ‘జాతీయ అనుభవ్ పురస్కారాల పథకం- 2025 ఒక మేలు మలుపు అని చెప్పాలి. దీనిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తోడు, మొట్టమొదటి సారిగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సహా కేంద్రీయ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు (సీపీఎస్ యూలు) కూడా వారి వారి అనుభవాలను పంచుకొనే రచనలను దాఖలు చేయడానికి అర్హతను సంపాదించుకోనున్నారు. బలమైన, చైతన్య భరితమైన దేశ ప్రభుత్వ రంగంలో సేవలను అందించిన కాలంలో ఉద్యోగులు సంపాదించుకున్న విలువైన అనుభవాలను, అవగాహన, అత్యుత్తమ పని విధానాలను ఇందులో పంచుకోవడం వల్ల అనుభవ్ పోర్టల్- ఒక అనుభవాల ఖజానాగా మారుతున్నది. ఇప్పటి వరకు ఉద్యోగులు వారు పదవీ విరమణ చేశాక ఒక సంవత్సరం లోపల వారి రచనలను సమర్పించవలసి ఉండగా ఇప్పుడు ఈ కాల పరిమితిని మూడు సంవత్సరాల వరకూ పొడిగించారు.
మదింపు ప్రక్రియను వ్యవస్థీకరించేందుకు, వేర్వేరు వేతన స్థాయులకు ఒక కొత్త మార్కుల వ్యవస్థను ప్రవేశపెట్టారు.
మరింత సమాచారం కోసం అర్హత గల ఉద్యోగులు లేదా పింఛనుదారులు ‘అనుభవ్ పోర్టల్’ (యూఆర్ఎల్ www.pensionersportal.gov.in/anubhav )ను తప్పక సందర్శించవలసివుంటుంది. ఆ పోర్టల్ లో రచనను పంపించడానికి సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు, పాటించవలసిన పద్ధతులు, ఉదాహరణకు ఎంపిక చేసిన కొన్ని రచనలు, అనుభవ్ పురస్కార గ్రహీతలకు సంబంధించిన చిన్న చిత్రాలు, ప్రశంసాపత్రాలతో కూడిన చిన్న పుస్తకాలను జతపరిచారు. రచనలను పంపేందుకు ఆసక్తి ఉన్న వారు వాటిని పరిశీలించవచ్చు.
***
(रिलीज़ आईडी: 2063115)
आगंतुक पटल : 112