రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 13,822 జన ఔషధి కేంద్రాల ఏర్పాటు
గత పదేళ్లలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ద్వారా రూ.6100 కోట్ల విలువైన మందుల విక్రయం:
బ్రాండెడ్ మందులతో పోలిస్తే పౌరులకు రూ.30,000 కోట్లు ఆదా
Posted On:
03 OCT 2024 7:16PM by PIB Hyderabad
ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 13,822 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, సెప్టెంబరులో, ఈ కేంద్రాలు రికార్డు స్థాయిలో ₹ 200 కోట్ల అమ్మకాలను సాధించాయి. ఇవి ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన చరిత్రలో అత్యధిక నెలవారీ అమ్మకాలు.

పోల్చి చూస్తే, 2023 సెప్టెంబర్‌లో అమ్మకాలు ₹141 కోట్లు ఉండగా, ఇది వార్షిక ప్రాతిపదికన గణనీయమైన 42% వృద్ధిని నమోదు చేసింది. ఈ అసాధారణమైన పెరుగుదల- సామాన్యులకు అందుబాటులో చవకైన ఆరోగ్య పరిష్కారాలను అందించడంలో ఈ కార్యక్రమం విజయాన్ని ప్రతిబింబిస్తుంది. మొత్తంగా 2024 సెప్టెంబర్ వరకు, వార్షిక వృద్ధి 31.20% గా ఉంది, ₹913.30 కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని ఇప్పటికే సాధించారు. దాదాపు 10 లక్షల మంది ప్రతిరోజూ జన ఔషధి కేంద్రాల నుంచి మందులు కొనుగోలు చేస్తున్నారు.
ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పిఎంబిజెపి) కింద, గత పదేళ్లలో, ఈ కేంద్రాల ద్వారా రూ .6100 కోట్ల విలువైన మందుల అమ్మకాలు జరిగాయి, ఇది బ్రాండెడ్ మందులతో పోలిస్తే ప్రజలకు రూ .30,000 కోట్లు ఆదా అయ్యేందుకు దారితీసింది.
పిఎంబిజెపి కింద ఒక ఔషధం ధర మూడు బ్రాండెడ్ ఔషధాల సగటు ధరలో గరిష్టంగా 50 శాతం ఉంటుంది. జన ఔషధి మందులు, శస్త్రచికిత్స పరికరాలు , న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల ధరలు కనీసం 50% , కొన్ని సందర్భాల్లో, మార్కెట్లో లభించే బ్రాండెడ్ మందుల మార్కెట్ ధరలో 80% నుండి 90% వరకు చౌకగా ఉంటాయి. దేశంలో 25000 జన ఔషధి కేంద్రాల లక్ష్యాన్ని సాధించే దిశగా పిఎంబిఐ ఇప్పటికే చాలా వేగంగా పురోగమిస్తోంది.
*****
(Release ID: 2061966)