ప్రధాన మంత్రి కార్యాలయం
మీర్జాపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని; పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహార ప్రకటన
Posted On:
04 OCT 2024 10:52AM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి ఈ రోజు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలుగా అవసరమైన సాయం అందజేస్తుందని వివరించారు.
"उत्तर प्रदेश के मिर्जापुर में हुआ सड़क हादसा अत्यंत पीड़ादायक है। इसमें जान गंवाने वालों के शोकाकुल परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं। ईश्वर उन्हें इस पीड़ा को सहने की शक्ति प्रदान करे। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है।"
‘‘ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోజరిగిన రోడ్డు ప్రమాదం బాధాకరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధను తట్టుకునే శక్తి భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను అన్ని విధాలా ఆదుకుంటుంది.’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి తెలిపారు
ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల పరిహారాన్ని శ్రీ మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం అందిస్తారు.
‘‘యూపీలోని మీర్జాపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల ఎక్స్-గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం అందిస్తాం.’’ అని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఎక్స్ లో తెలిపింది
***
MJPS/SR
(Release ID: 2061954)
Visitor Counter : 47
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam