యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
రేపు ఎల్ఎన్ఐపీఈ పదో స్నాతకోత్సవం: హాజరు కానున్న డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ
రీసెట్ కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం దీక్ష ఆరంభ్
400 పడకల వసతిగృహం, అత్యాధునిక స్టూడియోల ప్రారంభోత్సవం
Posted On:
03 OCT 2024 2:48PM by PIB Hyderabad
లక్ష్మీబాయి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎల్ఎన్ఐపీఈ) పదో స్నాతకోత్సవంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ రేపు పాల్గొంటారు. ఎల్ఎన్ఐపీఈకి ఛాన్సలర్‌గా డాక్టర్ మాండవీయ వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఉంది.
ఈ సంస్థ నుంచి 2022-23 విద్యాసంవత్సరంలో పట్టభద్రులైన 320 మంది విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలు అందజేస్తారు. బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు బహుకరిస్తారు.
అనంతరం రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ (రీసెట్) కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం దీక్ష ఆరంభ్ (విద్యార్థులకు స్వాగత కార్యక్రమం)ను డాక్టర్ మాండవీయ ప్రారంభిస్తారు. రిటైరయిన అథ్లెట్లకు సాధికారత కల్పించే దిశగా యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. క్రీడలకు వీడ్కోలు పలికిన అథ్లెట్లకు కొత్త కెరీర్ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తోంది.
అలాగే ఎల్ఎన్ఐపీఈ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా నిర్మించిన 400 పడకలతో కూడిన వసతి గృహం, అత్యాధునిక వసతులతో కూడిన స్టూడియోను మంత్రి రేపు ప్రారంభిస్తారు.
***
(Release ID: 2061715)
Visitor Counter : 42