వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

‘‘స్వచ్ఛతా హీ సేవా- 2024’’ లో భాగంగా, కృషి భవన్ లో సఫాయి మిత్రల పిల్లలకు బహుమతుల పంపిణీ, సత్కారం

Posted On: 02 OCT 2024 11:59AM by PIB Hyderabad

‘స్వభావ్ స్వచ్ఛతా- సంస్కార్ స్వచ్ఛతా’ ఇతివృత్తంతో  స్వచ్ఛతా హీ సేవ- 2024 ఉద్యమాన్ని గత నెల 17 న మొదలై, నిన్నటి వరకు- అంటే అక్టోబరు 2 వరకు- పాటించగా, వ్యవసాయం, రైతుల సంక్షేమ విభాగం దేశవ్యాప్తంగా ఉన్న తన ఆధ్వర్యంలోని సంస్థలు, తన అనుబంధ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు, సార్వజనిక రంగంలోని సంస్థలు, క్షేత్ర కార్యాలయాల తో కలసి ఈ ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకొంది.

ఈ వ్యవస్థ లో సఫాయి మిత్రలు ఓ విడదీయరాని ఒక భాగంగా ఉంటూ, పరిసరాలను విధుల నిర్వహణకు అనువైనవిగా ఆరోగ్యవంతమైనవిగా, పరిశుభ్రమైనవిగా తీర్చిదిద్దడంలో తోడ్పడుతున్నారు. ఈ విభాగం విశాల హితాన్ని కోరి వారి కీలక పాత్రను వ్యవసాయం- రైతుల సంక్షేమ విభాగం దృష్టిలో పెట్టుకొని నిన్న అంటే అక్టోబరు 1న వారి కోసం ఒక సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. నూట ఏభై మందికి పైగా సఫాయి మిత్రలను ఈ కార్యక్రమంలో సన్మానించారు.

దీనికి అదనంగా, సఫాయి మిత్రల పిల్లలకు గత నెల 21న కృషి భవన్ లో నిర్వహించిన చిత్రలేఖన పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేసేందుకు మరో కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయం- రైతుల సంక్షేమ విభాగం కార్యదర్శి డాక్టర్ దేవేశ్ చతుర్వేది తో పాటు ఆ విభాగం అదనపు కార్యదర్శి శుభ ఠాకుర్ కూడా పాల్గొన్నారు.



(Release ID: 2061425) Visitor Counter : 12