కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రైవేటు రేడియో ప్ర‌సార‌కర్త‌ల కోసం డిజిట‌ల్ రేడియో ప్ర‌సార విధానం రూపకల్పనకు సంప్ర‌దింపుల ప‌త్రాన్ని విడుద‌ల చేసిన ట్రాయ్‌

Posted On: 30 SEP 2024 12:39PM by PIB Hyderabad

ప్రైవేటు రేడియో ప్ర‌సార‌కర్త‌ల కోసం డిజిట‌ల్ రేడియో ప్ర‌సార విధానాన్ని రూపొందించేందుకు టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్‌) ఈరోజు సంప్ర‌దింపుల ప‌త్రాన్ని(సీపీ) విడుద‌ల చేసింది.

ప్ర‌స్తుతం భార‌త్‌లో అన‌లాగ్ టెరెస్ట్రియాల్  రేడియో ప్ర‌సారాలు మీడియం వేవ్‌(ఎండ‌బ్ల్యూ) (526–1606 KHz), షార్ట్ వేవ్‌(ఎస్‌డ‌బ్ల్యూ) (6–22 MHz), వీహెచ్ఎఫ్‌-II (88–108 MHz) స్పెక్ట్ర‌మ్ బాండ్ల‌పై న‌డుస్తున్నాయి. వీహెచ్ఎఫ్‌-II బాండ్‌లో విస్తార‌మైన ఫ్రీక్వెన్సీ మాడ్యులేష‌న్‌(ఎఫ్ఎం) సాంకేతిక‌త ఉన్నందున దీనిని ఎక్కువ‌గా ఎఫ్ఎం బాండ్ అని పిలుస్తుంటారు. ప్ర‌భుత్వ సంస్థ అయిన ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్‌) ఎండ‌బ్ల్యూ, ఎస్‌డ‌బ్ల్యూ, ఎఫ్ఎం బాండ్ల‌పై రేడియో ప్ర‌సార సేవ‌ల‌ను అందిస్తోంది. ప్రైవేటు రంగ రేడియో ప్ర‌సార‌క‌ర్త‌ల‌కు మాత్రం ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ బాండ్ (88-108 MHz)లో మాత్ర‌మే కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేయ‌డానికి అనుమ‌తి ఉంది.

అన‌లాగ్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌తో పోలిస్తే డిజిట‌ల్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్ అనేక ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తుంది. ఒకే ఫ్రీక్వెన్సీ కారియ‌ర్‌పై మూడు నుంచి నాలుగు చాన‌ళ్ల‌ను ప్ర‌సారం చేసే సామ‌ర్థ్యం ఉండ‌టం డిజిట‌ల్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌లో ప్ర‌ధాన ప్ర‌యోజ‌నం. పైగా అన్ని చాన‌ళ్ల ఆడియో నాణ్య‌త కూడా అద్భుతంగా ఉంటుంది. అన‌లాగ్ ప‌ద్ధ‌తిలో మాత్రం ఒక ఫ్రీక్వెన్సీ కారియ‌ర్‌పై ఒకే చాన‌ల్ ప్ర‌సారాలు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతాయి. ఈ పోటీ వాతావ‌ర‌ణంలో రేడియో ప్ర‌సార‌క‌ర్త‌ల‌కు డిజిట‌ల్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్ అనేది ఉత్సాహ‌వంత‌మైన కొత్త అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది. శ్రోత‌ల‌కు సైతం విలువ ఆధారిత‌ సేవ‌ల‌ను అందించ‌వ‌చ్చు.

అన‌లాగ్ ఎండ‌బ్ల్యూ, ఎస్‌డ‌బ్ల్యూ రేడియో ప్ర‌సార వ్య‌వ‌స్థ‌ను డిజిట‌లీక‌ర‌ణ చేసే ప‌నిని ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్‌) ప్రారంభించింది. ఇందులో భాగంగా 38 అన‌లాగ్ ట్రాన్స్‌మిట్ట‌ర్ల స్థానంలో డిజిట‌ల్ ట్రాన్స్‌మిటర్లను  ఏర్పాటు చేసింది. ఎఫ్ఎం బాండ్‌లో డిజిట‌ల్ రేడియో సాంకేతిక‌త‌లపై ఏఐఆర్ ఇప్ప‌టికే ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించింది. అయితే, ఎఫ్ఎం డిజిట‌లీక‌ర‌ణ‌కు ప్రైవేటు ఎఫ్ఎం రేడియో ప్ర‌సారక‌ర్తలు మాత్రం ఇంకా చొర‌వ తీసుకోవాల్సి ఉంది.

డిజిట‌ల్ రేడియో ప్ర‌సారాల‌ను విస్త‌రించే సౌల‌భ్యం క‌ల్పించే అనుకూల‌ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసేందుకు 2018 ఫిబ్ర‌వ‌రి 1న “భార‌త్‌లో డిజిట‌ల్ రేడియో ప్ర‌సారాల‌కు సంబంధించిన అంశాల‌”పై ట్రాయ్ సొంతంగా ప‌లు ప్ర‌తిపాద‌న‌లు చేసింది. డిజిట‌ల్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసేందుకు స‌మ‌ష్టిగా ప‌ని చేసేలా ప్రోత్స‌హించేందుకు రేడియో ప్ర‌సార‌క‌ర్త‌లు, ప్ర‌సార ప‌రిక‌రాల త‌యారీదారులు, డిజిట‌ల్ రేడియో రిసీవ‌ర్ త‌యారీదారులు వంటి అంద‌రూ భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ట్రాయ్ గుర్తించింది. నిర్ణీత కాల వ్య‌వ‌ధిలో డిజిట‌ల్ రేడియో ప్ర‌సారాల‌ను ప్రారంభించేందుకు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను అందించేలా భార‌త్‌లో డిజిట‌ల్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్ కోసం విధానప‌ర‌మైన ప్రాథ‌మిక ప్ర‌ణాళిక‌ను ప్ర‌భుత్వం రూపొందించాల్సి ఉంద‌ని అథారిటీ పేర్కొన్న‌ది.

దీంతో ప్రైవేటు రేడియో ప్ర‌సార‌క‌ర్త‌ల కోసం డిజిట‌ల్ రేడియో ప్ర‌సార విధానాన్ని రూపొందించేందుకు ఏప్రిల్ 23న ట్రాయ్ నుంచి స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ ప్ర‌తిపాద‌న‌లను కోరింది. సాంకేతిక‌త‌ మార్పున‌కు వీలు క‌ల్పించేలా ప్ర‌స్తుతం ఎఫ్ఎం ఫేస్‌-3 కింద ఉన్న ప‌లు నిబంధ‌న‌ల‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎంఐబీ ఈ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నది. డిజిట‌ల్ రేడియో ప్ర‌సార విధాన రూప‌క‌ల్ప‌న కోసం ప్ర‌తిపాద‌న‌ల‌ను రూపొందించేందుకు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన ప‌లు అంశాల‌ను ఎంఐబీ ప్ర‌ధానంగా పేర్కొన్న‌ది.

ఈ క్ర‌మంలో ప్రైవేటు రేడియో ప్ర‌సార‌క‌ర్త‌ల కోసం డిజిట‌ల్ రేడియో ప్ర‌సార విధానాన్ని రూపొందించ‌డానికి సంబంధించి వివిధ అంశాల‌పై భాగ‌స్వామ్య‌ప‌క్షాల అభిప్రాయాలు సేక‌రించేందుకు గానూ ట్రాయ్ సంప్ర‌దింపుల ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. సంప్ర‌దింపుల ప‌త్రంపై భాగ‌స్వామ్య ప‌క్షాలు వ‌చ్చే నెల 28వ తేదీ లోగా రాత‌పూర్వ‌కంగా అభిప్రాయాల‌ను తెలియ‌జేయాల్సిందిగా కోరింది. వీటిపై ఏవైనా అభ్యంత‌రాలు ఉంటే న‌వంబ‌రు 11 లోగా అంద‌జేయాల్సిందిగా కోరింది. అభిప్రాయాలు, వాటిపై అభ్యంత‌రాల‌ను ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తిలో advbcs-2@trai.gov.injtadvbcs-1@trai.gov.in మెయిల్ ఐడీల‌కు పంపించ‌వ‌చ్చు.

మ‌రింత వివ‌ర‌ణ‌/ స‌మాచారం కోసం +91-11- 20907774 నెంబ‌రు ద్వారా స‌ల‌హాదారు(బీ ఆండ్ సీఎస్‌) శ్రీ దీప‌క్ శ‌ర్మ‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

సంప్ర‌దింపుల పత్రానికి సంబంధించిన పూర్తి పాఠం ట్రాయ్ వెబ్‌సైట్ www.trai.gov.inలో అందుబాటులో ఉంటుంది.

 

 

 

***


(Release ID: 2060488) Visitor Counter : 55