హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

వరద ప్రభావిత గుజరాత్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలకు జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి ముందస్తుగా రూ.675 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో వరద ప్రభావిత రాష్ట్రాలకు సాధ్యమైనంత సహాయం అందించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం


వరద ప్రభావిత అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్ రాష్ట్రాల్లో నష్టాలను అక్కడికక్కడే అంచనా వేయటానికి ఆయా రాష్ట్రాలను సందర్శించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసీటీ)

ఇటీవల వరదల బారిన పడ్డ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని అక్కడికక్కడే అంచనా వేసేందుకు త్వరలోనే సందర్శించనున్న ఐఎంసీటీలు

ఈ ఏడాది 21 రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ నుంచి రూ.9044.80 కోట్లు, 15 రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి రూ.4528.66 కోట్లు, 11 రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్‌డీఎంఎఫ్) నుంచి రూ.1385.45 కోట్లు విడుదల


వరద ప్రభావిత రాష్ట్రాలన్నింటికీ అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైనిక దళ బృందాలు, వైమానిక దళాన్ని మోహరించటంతో పాటు అన్ని రకాల రవాణా సహాయాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వం

Posted On: 30 SEP 2024 7:45PM by PIB Hyderabad

జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి ముందస్తుగా గుజరాత్‌కు రూ.600 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఈ రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో వరద ప్రభావిత రాష్ట్రాలకు సాధ్యమైనంత సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.

భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అస్సాం, మిజోరం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈ ప్రభావిత రాష్ట్రాలన్నింటిలో నష్టాన్ని అక్కడికక్కడే అంచనా వేయడానికి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్(ఐఎంసీటీ)ను నియమించారు. ఐఎంసీటీ నివేదికలు అందిన తర్వాత మిగిలిన రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటారు.


ఇటీవల బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కూడా భారీగా వరదలు వచ్చాయి. నష్టాన్ని అక్కడికక్కడే అంచనా వేసేందుకు త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో ఐఎంసీటీలు సందర్శించనున్నాయి.

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ నుంచి రూ.9044.80 కోట్లు, 15 రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి రూ.4528.66 కోట్లు, 11 రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి(ఎస్డీఎంఎఫ్) నుంచి రూ.1385.45 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక సహాయంతో పాటు, వరద ప్రభావిత రాష్ట్రాలన్నింటికీ అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైనిక దళ బృందాలు, వైమానిక దళాలను మోహరించడంతో సహా అన్ని రకాల రవాణా సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది.

 

***



(Release ID: 2060481) Visitor Counter : 12