ఆయుష్
                
                
                
                
                
                    
                    
                        వివిధ వినూత్న పద్ధతుల ద్వారా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ లో తన వంతు పాత్ర  నిర్వహిస్తూ  విశిష్ట స్థానాన్ని పొందిన ఆయుర్వేదం 
                    
                    
                        
తొమ్మిదవ ఆయుర్వేద దినోత్సవం ఇతివృత్తం 
'ప్రపంచ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ఆవిష్కరణ' 
దేశవ్యాప్తంగా నెలరోజుల పాటు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన ఏఐఐఏ 
                    
                
                
                    Posted On:
                27 SEP 2024 6:28PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ఆయుర్వేద దినోత్సవం సంబంధించిన కార్యక్రమాల గురించి వివరించడానికి  కేంద్ర ఆయుష్ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ ఆయుష్ భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 9వ ఆయుర్వేద దినోత్సవం ఇతివృతం  “ప్రపంచ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ఆవిష్కరణ” అని ప్రకటించారు. ఈ సంవత్సరం ఆయుర్వేద దినోత్సవం అక్టోబర్ 29న జరుపుకున్నారు. ప్రధాన కార్యక్రమం న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ)లో జరిపారు. 
"ఈ ఇతివృత్తం వివిధ వినూత్న అభ్యాస పరిష్కారాల ద్వారా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో ఆయుర్వేదం సహకారం సామర్థ్యాన్ని స్పష్టం చేస్తుంది. భారతీయ సాంప్రదాయ వైద్య విధానంలో ఆయుర్వేదం ప్రధాన అంశంగా ప్రచారం చేయడాన్ని సులభతరం చేయడానికి, ఏఐఐఏ దేశం అంతటా ఒక నెల రోజుల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది” అని కేంద్ర మంత్రి చెప్పారు.
 

ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా 9వ ఆయుర్వేద దినోత్సవం ఇతివృత్తంపై ప్రస్తావించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యక్రమాలతో ఈ ఇతివృత్తం ప్రతిధ్వనిస్తోందని అన్నారు. 
9వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఏఐఐఏ చేపట్టిన ప్రయత్నాల గురించి డైరెక్టర్ డాక్టర్ తనూజా నేసరి మీడియాకు వివరించారు. భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఆయుర్వేదం ప్రయోజనాన్ని పొందే విధంగా సమ్మిళితమై ఉంటుంది.
ఆయుర్వేద దినం ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతి సందర్భంగా వస్తుంది, దీనిని ధంతేరస్ అని కూడా పిలుస్తారు. 2016 సంవత్సరం నుండి 'ఆయుర్వేద దినోత్సవం' మొత్తం ప్రభుత్వ దృక్పథంతో ఏటా జరుపుకుంటున్నాము. భారతీయ సాంప్రదాయ ఔషధ వ్యవస్థ సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, భారతదేశం మొత్తం ఆరోగ్య సంరక్షణ సంస్కృతిలో ఆయుర్వేదం ప్రోత్సాహకానికి భారతదేశ  నిబద్ధతను ఈ వేడుక ప్రతిబింబిస్తుంది.
నేడు ప్రారంభమైన ఆయుర్వేద దినోత్సవం నెల రోజుల ప్రచారంలో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజా చైతన్య కార్యక్రమాల నుండి అందరు భాగస్వామ్యం అయ్యే వరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణ ఫలితాలను మెరుగుపరిచే ప్రయత్నంలో, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదాన్ని ప్రధాన స్రవంతిలో కొనసాగించడం,  ఆవిష్కరణలను ప్రోత్సహించడం, 9వ ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడంతో దాని ప్రపంచవ్యాప్త పరిధిని విస్తరిస్తోంది.
***
                
                
                
                
                
                (Release ID: 2060175)
                Visitor Counter : 71