రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

భారత వైమానిక దళ 92వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు 7,000 కి.మీ. 'వాయు వీర్ విజేత' కార్ ర్యాలీ


ప్రారంభానికి ముందుగా న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక ప్రాంతం వద్ద

ఆత్మీయ వీడ్కోలు చెప్పనున్న రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్

Posted On: 28 SEP 2024 7:29PM by PIB Hyderabad

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 92వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన లద్దాఖ్ లోని థోయిస్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వరకు వేల కిలోమీటర్ల 'వాయు వీర్ విజేతకార్ ర్యాలీని నిర్వహించనున్నారు.  ర్యాలీ ప్రారంభానికి ముందుగా, అక్టోబర్ 01న న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక ప్రాంతం వద్ద రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ లాంఛనంగా వీడ్కోలు పలుకుతారుసముద్ర మట్టానికి 3,068 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వైమానిక స్థావరం థోయిస్ నుండి అక్టోబర్ వ తేదీన అధికారికంగా ర్యాలీ ప్రారంభమైఅక్టోబర్ 29న తవాంగ్ వద్ద ముగుస్తుంది.

ఈ ర్యాలీని ఉత్తరాఖండ్ యుద్ధ స్మారక అనుభవజ్ఞుల సహకారంతో భారత వాయు సేన నిర్వహిస్తోందిఐఏఎఫ్ ఘనచరిత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం దీని లక్ష్యంయుద్ధాల్లోసహాయక చర్యల్లో వైమానిక యోధులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రజలకు తెలియజెప్పడం కూడా ఈ ర్యాలీ ఉద్దేశంగా ఉందిమాతృభూమికి సేవ చేసే దిశగా యువతలో స్ఫూర్తిని రగిలించేలా ర్యాలీ కొనసాగుతుందిఈ మెగా కార్ ర్యాలీలో మహిళలతో సహా 52 మంది వైమానిక దళ సిబ్బంది పాల్గొంటారుమాజీ వైమానిక దళాధిపతులు కూడా వివిధ ప్రాంతాల్లో పాల్గొంటారుమార్గమధ్యంలో ఎయిర్ వారియర్స్ (వాయు వీరులు) 16 ప్రాంతాల్లో ఆగుతూవివిధ కళాశాలలువిశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను కలవనున్నారుఐఏఎఫ్ కు చెందిన సాహస విభాగం ఈ ర్యాలీకి నేతృత్వం వహిస్తోంది.

 

***



(Release ID: 2060069) Visitor Counter : 7


Read this release in: English , Urdu , Hindi , Marathi