బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశీయ కోకింగ్ బొగ్గు వినియోగాన్ని పెంచే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీసీసీఎల్

Posted On: 26 SEP 2024 11:06AM by PIB Hyderabad

కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అనుబంధ సంస్థ, భారతదేశంలో అతిపెద్ద కోకింగ్ బొగ్గు ఉత్పత్తిదారు అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతతో ముందడుగు వేస్తోంది. దీనిలో భాగంగా "మిషన్ కోకింగ్ కోల్"  అనే  చొరవలో క్రియాశీల పాత్ర ద్వారా బొగ్గు దిగుమతిపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడంలో గణనీయమైన పురోగతి సాధించింది. 

కోకింగ్ బొగ్గు దిగుమతి వల్ల భారతదేశం విలువైన విదేశీ నిల్వలపై భారం పడుతుంది. ఈ దిగుమతులను తగ్గించడానికి, బీసీసీఎల్ తన కోకింగ్ బొగ్గు వేలం ప్రక్రియలను మరింత సరళంగా, పారదర్శకంగా, దేశంలోని ఉక్కు ఉత్పత్తిదారులకు ఆకర్షణీయంగా చేయడానికి గణనీయమైన సంస్కరణలను చేపట్టింది. ఈ దిశగా బీసీసీఎల్ తీసుకునే పెద్ద చర్యల్లో ఒకటి ట్రాంచ్ VI వేలం. ఇక్కడ ఆఫర్ చేసిన బొగ్గు ఏదీ బుక్ కాలేదు. ప్రతిగా, బీసీసీఎల్ తన వ్యూహాన్ని తిరిగి అంచనా వేసుకుని, మెరుగులు దిద్దింది. వాటిలో ముఖ్యమైనది కన్సార్టియం బిడ్డింగ్‌ను ప్రవేశపెట్టడం. ఇది చిన్న వినియోగదారులను వేలంలో సహకరించడానికి, సమిష్టిగా పాల్గొనడానికి అనుమతించింది. ఇది బిడ్డర్ల సమూహాన్ని విస్తృతం చేస్తుంది. ప్రక్రియను మరింత అందుబాటులోకి తెచ్చింది.

బిడ్ లలో ఎక్కువమంది పాల్గొడానికి ఆకర్షించే ప్రయత్నంలో, బీసీసీఎల్ లింకేజ్ వేలం బిడ్డర్‌ల కోసం అర్హత నిబంధనలకు సవరణలను ప్రతిపాదించింది. బీసీసీఎల్ క్రియాశీల డైరెక్టర్ల సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదించారు. తదుపరి పరిశీలన కోసం సిఐఎల్ కి పంపారు.  ఈ ప్రతిపాదనలో ఉక్కు కర్మాగారాలు, ఇప్పటికే ఉన్న లేదా కొత్త కోకింగ్ కోల్ వాషరీలు, వాషరీల పవర్ బొగ్గు ఉప-ఉత్పత్తులను వినియోగించగల ఇతర ప్లాంట్‌లతో కూడిన కన్సార్టియంల భాగస్వామ్యం ఉంది. సిఐఎల్ ఈ ఆలోచనను త్వరగా స్వీకరించింది, ఇది స్టీల్ సబ్ సెక్టార్ కోసం లింకేజ్ వేలం ట్రాంచ్ VII కోసం కొత్త స్కీమ్ డాక్యుమెంట్ అభివృద్ధికి దారితీసింది.

స్కీమ్ డాక్యుమెంట్ అధికారిక నోటిఫికేషన్, విస్తృత భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ముందు, బీసీసీఎల్, సిఐఎల్ ఉక్కు ఉత్పత్తిదారులు, పరిశ్రమ సంఘాల నుండి అభిప్రాయాన్ని సేకరించి ఢిల్లీలో వినియోగదారుల సమావేశాన్ని నిర్వహించాయి. ఈ ప్రయత్నం, సంభావ్య బిడ్డర్‌లతో నిరంతర ఫాలో-అప్, చురుకైన భాగస్వామ్యంతో పాటు, రెగ్యులర్ కమ్యూనికేషన్ వేలం ప్రక్రియలో భాగస్వామ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచింది.

ఈ కార్యక్రమాల ఫలితంగా, స్టీల్ సబ్ సెక్టార్ కోసం ఇటీవల ముగిసిన దీర్ఘకాలిక లింకేజ్ ఇ-వేలం (ట్రాంచ్ VII)లో బీసీసీఎల్ రికార్డ్-బ్రేకింగ్ విజయాన్ని సాధించింది. అందించిన 3.36 మెట్రిక్ టన్నుల కోకింగ్ బొగ్గులో, 2.40 మెట్రిక్ టన్నులు విజయవంతంగా బుక్ అయి, ఇది బొగ్గు బుకింగ్‌లలో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది.

బీసీసీఎల్ ద్వారా  ఈ ప్రయత్నాలు దేశీయ కోకింగ్ బొగ్గు వినియోగాన్ని గణనీయంగా పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, భారతదేశంలో ఉక్కు పరిశ్రమను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. కన్సార్టియం బిడ్డింగ్‌ను విజయవంతంగా అమలు చేయడంతో పాటు వేలం ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన సమాచార వ్యవస్థ నెలకొల్పడంతో దీనిలో పాల్గొనే వారి సంఖ్య పెరిగింది. ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చింది. ఆత్మనిర్భర్ భారత్ దృష్టిలో దిగుమతికి  ప్రత్యామ్నాయం కోసం దేశం ఆశిస్తున్న విస్తృత లక్ష్యం నెరవేరింది. 

ట్రాంచ్ VII విజయం పట్ల బీసీసీఎల్ సీఎండీ శ్రీ సమీరన్ దత్తా సంతృప్తిని వ్యక్తం చేస్తూ, వేలం ప్రక్రియను మరింత సమగ్రంగా, పారదర్శకంగా చేయడానికి సమిష్టి కృషి గణనీయంగా ఫలించిందని అన్నారు. విజయవంతమైన బుకింగ్‌లు దేశీయ కోకింగ్ బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించడానికి, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచాయని తెలిపారు. 

***


(Release ID: 2059962) Visitor Counter : 36