సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రతిభకు పట్టాభిషేకం భారత ఫిల్మ్ బజార్-2024లో ప్రధాన ఆకర్షణలుగా వ్యూయింగ్ రూమ్, వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్
ఈ రెండింటి కోసం దరఖాస్తులు పంపాలంటూ చిత్ర నిర్మాతలకు ఆహ్వానం
Posted On:
26 SEP 2024 8:26PM by PIB Hyderabad
ఫిల్మ్ బజార్ 18వ సంచిక అనేక వినూత్న కార్యక్రమాలతో ప్రతిభకు పట్టాభిషేకం చేయనున్నది. కో-ప్రొడక్షన్ మార్కెట్ (సీపీఎం), స్క్రీన్ రైటర్స్ ల్యాబ్, వర్క్-ఇన్-ప్రోగ్రెస్ (డబ్ల్యూఐపి) ల్యాబ్, వ్యూయింగ్ రూమ్ (వీఆర్), మార్కెట్ స్క్రీనింగ్, ప్రొడ్యూసర్స్ వర్క్‌షాప్ వంటి అనేక రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నాలెడ్జ్ సిరీస్‌లోని ఇన్ఫర్మేటివ్ సెషన్ల శ్రేణి, నెట్వర్కింగ్, వినూత్న సినిమా ప్రాజెక్ట్‌లను ప్రదర్శించడం కోసం చిత్ర నిర్మాతలు, పరిశ్రమ నిపుణులకు ఇది కీలకమైన కేంద్రంగా ఉంటుంది.
ఫిల్మ్ బజార్ ద్వారా కొత్త పరిచయాలను ఏర్పరుచుకునేలా చూడటం, అందుకు తగిన సహాకారాన్ని అందించడం, సినిమా నిర్మాణానికి అవసరమైన నిధుల లభ్యతకు సంబంధించిన అవకాశాలను చూపించడం ఈ కార్యక్రమాల లక్ష్యం. ఈ ఫిల్మ్ బజార్ ను నవంబర్ 20-24 వరకు గోవాలో నిర్వహిస్తున్నారు. ఈ సంచికలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తాజా, విభిన్న చిత్రాలను ఎంపిక చేస్తారు.
స్వతంత్ర చిత్రనిర్మాతలను శక్తిమంతం చేయడం: విభిన్న కథనాలను ప్రోత్సహించడం
పరిశ్రమకు ప్రవేశ మార్గంగా యువతరాన్ని అనుసంధానం చేయడానికి వర్కింగ్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్, వ్యూయింగ్ రూమ్ విభాగాలు అవసరం అవుతాయి. వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ ఇప్పటికీ నిర్మాణంలో ఉన్న చిత్రాలకు లాంచ్‌ప్యాడ్‌గా పనిచేస్తుంది. అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి అభిప్రాయాలను పొందడానికి అవకాశం ఉంది. సినిమా నమూనా వీడియోల ప్రదర్శన ద్వారా ప్రేక్షకుల స్పందనను తెలుసుకోవడం ద్వారా పూర్తి సినిమా నిర్మాణంపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు వీలవుతుంది. అవసరమైన సర్దుబాట్లూ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం, వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్‌లో భాగంగా ఫీచర్ ఫిక్షన్, యానిమేషన్ ఫిక్షన్‌లను కూడా అంగీకరిస్తున్నారు.
పెద్దగా ప్రాశస్త్యంలోకి రాని స్వరాలను విస్తృత ప్రేక్షకులతో కనెక్ట్ చేయడానికి అనుమతించడం ద్వారా కథనాల్లో వైవిధ్యానికి వ్యూయింగ్ రూమ్ ఒక అవకాశాన్ని అందిస్తుంది. సంప్రదాయ కథనాలను సవాలు చేసే చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ఇది విభిన్న సంస్కృతులు, దృక్కోణాల గురించి గొప్ప అవగాహనను ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ బజార్ రికమెండ్స్ (ఎఫ్ బి ఆర్) అని పిలిచే వ్యూయింగ్ రూమ్, క్యూరేటెడ్ సెగ్మెంట్, సమర్పణ విభాగాల్లో తప్పక చూడవలసిన చిత్రాలకు అవకాశం ఇస్తారు. ఇది ప్రేక్షకులు, పరిశ్రమ నిపుణుల కోసం రూపొందించారు.
విశేషమైన విజయాలు
వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్, వ్యూయింగ్ రూమ్ విజయంలో భాగంగా, 'జోరామ్', 'ఆల్ ఇండియా ర్యాంక్' వంటి సినిమాలు ఉదాహరణగా నిలిచాయి. అలాగే ఇన్ ది బెల్లీ ఆఫ్ ఎ టైగర్, ఆగ్రా, అట్టం (ది ప్లే), బి.ఎ. పాస్, తుంబాద్, షాంఘై చిత్రాలు కూడా సమకాలీన సినిమాపై చైతన్యాన్ని నింపాయి.
వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్, వ్యూయింగ్ రూమ్ రెండింటి కోసం దరఖాస్తులను సెప్టెంబర్ 30 వరకు పంపుకోవచ్చు. సినిమాలను ఇంకా అభివృద్ధి చేయడానికి, పరిశ్రమలోని దిగ్గజాలతో కనెక్ట్ అవ్వడానికి దర్శకులకు ఇదో మంచి అవకాశం.
***
(Release ID: 2059958)
Visitor Counter : 30