రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పరమవీరచక్ర అవార్డ్ గ్రహీతల పేర్లు కలిగిన 21 అండమాన్/నికోబార్ ద్వీప సమూహాలకు చేసిన మొట్ట మొదటి ‘ఓపెన్ వాటర్ స్విమ్మింగ్’ సాహసయాత్ర బృందానికి రక్షణ మంత్రి స్వాగతం


అనేక సవాళ్లను అధిగమించి పరమవీరుల శౌర్యగాథలను,

త్యాగాలను ప్రజలకు చేర వేసినందుకు బృందానికి ధన్యవాదాలు తెలిపిన శ్రీ రాజ్ నాథ్ సింగ్

అయిదు మాసాలు, మూడు వందల కిలోమీటర్ల దూరం ఏ సహాయం లేకుండా ఈత కొట్టిన 11 మంది సైనిక, తీర రక్షణదళ సిబ్బంది: ప్రతి ద్వీపంలోనూ జాతీయ జెండా

Posted On: 20 SEP 2024 2:29PM by PIB Hyderabad

పరమవీరచక్ర అవార్డు గ్రహీతల పేర్లు కలిగిన 21 అండమాన్ నికోబార్ ద్వీపాలకు సాహసయాత్ర చేపట్టిన మొట్టమొదటి ‘ఓపెన్ వాటర్ స్విమ్మింగ్’ బృందానికి రక్షణమంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్సెప్టెంబర్ 20న న్యూఢిల్లీలో స్వాగతం పలికారు.  ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకునే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి జనవరి 23గత ఏడాది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంత వరుకూ పేర్లు లేని అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 ద్వీపాలకు పరమ వీరచక్ర అవార్డ్ గ్రహీతల పేర్లు పెట్టారు.   

నామకరణం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంలో త్రివిధ దళాలకు చెందిన బృందం ‘ఎక్స్ పెడిషన్ పరమ్ వీర్’ పేరిట ఈ 21 దీవులకు సాహస యాత్ర చేపట్టిందిభారత సైన్యంనౌకా దళంవాయుసేనతీర రక్షక దళాలతో కూడిన 11 మంది సభ్యుల బృందం ఈ 21 దీవులకు చేరుకుని, 21 పరమవీరుల శౌర్యంత్యాగాలకు నివాళిగా ప్రతి దీవిలో జాతీయ జెండాను ఎగురవేసిందిబృందానికి ప్రఖ్యాత ఓపెన్ వాటర్ ఈతగాడుటెన్ జింగ్ నార్గే  జాతీయ సాహస పురస్కార గ్రహీతవింగ్ కమాండర్ పరమ్ వీర్ సింగ్ నేతృత్వం వహించారు.  

సముద్రంలో ఎదురైన కఠినమైన సవాళ్ళను అధిగమించిపరమవీరుల శౌర్యగాథలనుత్యాగాలను ప్రజలకు చేరవేసినందుకు బృందానికి ధన్యవాదాలు తెలిపిన శ్రీ రాజ్ నాథ్ సింగ్... బృందం ధైర్య సాహసాలను కొనియాడారుదేశం కోసం ఎన్నో సాహసాలు చేసిదేశసేవలో ప్రాణాలు అర్పించిన ధీ సైనికుల గాథలు పౌరులకుముఖ్యంగా నేటి యువతకు తెలియచెప్పాలన్న ప్రభుత్వ ఆశయాలకి అనుగుణంగా ఈ యాత్ర జరిగిందని మంత్రి చెప్పారుఇటువంటి శౌర్యగాథలు తెలుసుకున్న యువత... వీర సైనికులని తమ హీరోలుగా ఆరాధిస్తారటూసైనిక దళాలకు చెందిన బృంద సభ్యులంతా దేశానికి పేరు తెస్తూ యువతకు స్ఫూర్తి దాతలుగా ఉండగలరని ఆకాంక్షించారు.    

కార్యక్రమం సందర్భంగాయాత్ర చేపట్టిన కారణాన్ని గుర్తు చేస్తూ.. సాహసయాత్రా పతాకను బృందం మంత్రికి అందజేసిందియావత్తు యాత్రకి సాక్షిగా నిలిచిన ఈ పతాకబృందం ఎదుర్కొన్న సవాళ్ళుసభ్యుల మధ్య నెలకొన్న స్నేహపూర్వక వాతావరణంకష్టసాధ్యమైన యాత్ర సంపూర్ణమైనందుకు ప్రతీకగా నిలిచిందిఈ కార్యక్రమంలో త్రివిధ దళాల ప్రధానధికారి జనరల్ అనిల్ చౌహాన్సైనిక దళ అధినేత జనరల్ ఉపేంద్ర ద్వివేదిఅండమాన్ నికోబార్ కమాండ్ దళం అధినేత (సిన్ కాన్/కమాండర్-ఇన్-ఛీఫ్ఎయిర్ మార్షల్ సాజు బాలకృష్ణన్ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ప్రపంచ నీటి దినోత్సవమైన మార్చ్ 24న ఈ సాహసయాత్ర శ్రీ విజయపురం నుండి నేతాజీ సుభాష్ చంద్ర దీవి వరకూ ఈదుకుంటూ వెళ్లాలన్న లక్ష్యంతో మొదలైందిదీనిని లాంఛనంగా సిన్ కాన్ ప్రారంభించారుఐదు నెలల వ్యవధిలో, 300 కిలోమీటర్లు పైబడిన దూరాన్ని పూర్తి చేసి 21 దీవులని చేరుకున్న బృందం, 78 వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు తన యాత్రను ముగించిందియాత్ర ఆఖరిదశలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్ర దీవి నుంచి శ్రీ విజయపురం వరకు జరిగిన ఈతలో,  సాయుధ దళాలుతీరరక్షక దళాలకు చెందిన 78 మంది పాల్గొన్నారు.

సాహసయాత్రలో పాల్గొన్న మన దేశ ఈతగాళ్ళ బృందం, ‘అన్ అసిస్టెడ్ ఓపెన్ వాటర్ స్విమ్’ (ఎటువంటి సామగ్రి సహాయం లేకుండా కేవలం ఈత దుస్తులుకళ్ళజోళ్ళుటోపీలు మాత్రమే ఉపయోగిస్తూ చేపట్టే ఈతఅంతర్జాతీయ ప్రమాణాలునిబంధనలకు అనుగుణంగా తన యాత్రను పూర్తి చేసిందిసముద్రంలో ఈదుతున్న సమయంలో విపరీతమైన అలసటశరీరంలో నీటి పరిమాణం తగ్గుదల (డీహైడ్రేషన్), తీవ్రమైన ఎండ వల్ల కలిగిన చర్మ సమస్యలుసముద్రంలో అల్లకల్లోల పరిస్థితుల వంటి సమస్యలే కాకప్రమాదకర సముద్రజీవులను కూడా ఈతగాళ్ళు ఎదుర్కొన్నారుఅధిక శాతం సిబ్బంది మొట్టమొదటిసారిగా ‘ఓపెన్ వాటర్ స్విమ్’లో పాల్గొన్నప్పటికీ మొత్తం యాత్రలో ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా యాత్రను పూర్తి చేయడాన్ని  ఘన విజయంగా పేర్కొనవచ్చు.   

 

***


(Release ID: 2057309) Visitor Counter : 70