ఆర్థిక మంత్రిత్వ శాఖ
మనీలాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు వంటి అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్)
భారత్ ను అత్యున్నత రేటింగ్ కేటగిరీ అయిన
'రెగ్యులర్ ఫాలో-అప్'లో ఉంచిన ఎఫ్ఎటి ఎఫ్
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2024 7:06PM by PIB Hyderabad
మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటు (టెర్రిరిజం ఫైనాన్సింగ్) వంటి అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడానికి భారతదేశం అమలు చేస్తున్న చర్యలను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) ప్రశంసించింది. మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటుకు వ్యతిరేకంగా తాను అందిస్తున్న సిఫార్సులకు అనుగుణంగా- సాంకేతికపరంగా చర్యలు తీసుకోవడంలో భారతదేశం ఉన్నత స్థాయిని అందుకుందని ఎఫ్ఎటిఎఫ్ పేర్కొంది. చట్టవిరుద్ధ ఆర్థిక కార్యకలాపాలను ఎదుర్కొనే చర్యలను అమలు చేయడంలో భారతదేశం కీలకమైన అడుగులు వేసిందని ‘మానీ లాండరింగ్, తీవ్రవాదానికి ఆర్థిక తోడ్పాటు నిరోధక ఆర్థిక చర్యలు’ పేరుతో భారతదేశంపై ఇచ్చిన మ్యూచువల్ ఇవాల్యుయేషన్ నివేదిక (ఎంఈఆర్)లో ఎఫ్ఎటిఎఫ్ పేర్కొన్నది.
మనీలాండరింగ్ కు , ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటు అందించడానికి వ్యతిరేకంగా భారత్ అమలు చేసిన కార్యాచరణ మంచి ఫలితాలను సాధిస్తోందని ఎఫ్ఎటిఎఫ్- ఎపిజి- ఇఎజిల ఉమ్మడి అంచనా నిర్ధారించింది. అధికారులు ఆర్థిక సంబంధమైన నిఘా సమాచారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా సమర్థవంతంగా సహకరిస్తున్నారు.
ఈ మదింపు తరువాత, ఎఫ్ఎటిఎఫ్ అత్యధిక రేటింగ్ కేటగిరీ అయిన "రెగ్యులర్ ఫాలో-అప్" లో భారతదేశాన్ని ఉంచింది. భారత్ కాకుండా ఇతర జి -20 దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి.
బ్యాంకు ఖాతాదారులను పెంచడం, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడటాన్ని ప్రోత్సహించడం కంటే- ఆర్థిక సమ్మిళితపరంగా భారతదేశం గణనీయమైన చర్యలు తీసుకుందని నివేదిక ప్రముఖంగా పేర్కొంది. ఈ ప్రయత్నాలు ఆర్థిక పారదర్శకతను పెంచడంతో పాటు, ఎఎమ్ఎల్/ సిఎఫ్టి ప్రయత్నాలకు దోహదం చేశాయి.
భారతీయ వ్యవస్థ పరిమాణం, సంస్థాగత సంక్లిష్టతలతో నిమిత్తం లేకుండా, ఆర్థిక నిఘా వ్యవస్థల సహకారంతో భారత అధికారులు- అక్రమ ఆర్థిక కార్యకలాపాల నియంత్రణకు సమర్థవంతంగా చర్యలు తీసుకుంటూ, సమన్వయంతో పని చేస్తున్నారు.
అంతర్జాతీయ సహకారాన్ని పొందడం ద్వారా భారతదేశం- అక్రమంగా తరలిపోయిన సంపదను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటున్నదని, చట్టవిరుద్ధ మార్గాల్లో డబ్బు తరలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నదని పేర్కొంది.
ఆర్థిక రంగంలో, ముఖ్యంగా వాణిజ్య బ్యాంకుల్లో ఎదురయ్యే ప్రతికూలతలు, వాటిని నివారించే చర్యల అమలుపై కూడా బ్యాంకులకు సరైన అవగాహన ఉందని తెలిపింది.
మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటు, ఆర్థిక తోడ్పాటు వంటి అంశాల్లో భారతీయ అధికారులకు చక్కటి అవగాహన ఉందని అభినందించింది. ఆర్థిక నేరాల వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి వారికి తెలుసునని, అయితే ఆయా ప్రమాదాల గురించి సంబంధిత వర్గాలన్నింటితో సమాచారాన్ని పంచుకోవాల్సింది ఎంతో ఉందని అన్నది.
భారతదేశం తీవ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నదనీ, అలాగే తీవ్రవాదానికి ఆర్థిక తోడ్పాటు సమస్యను కూడా ఎదుర్కొంటున్నదనీ, ఐఎస్ఐఎల్ లేదా అల్ ఖైదా వంటి సమస్యలు కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది. చాలా సంక్షిష్టమైన ఆర్థిక దర్యాప్తులను కూడా నిర్వహించిందనీ, అయితే విచారణలను సత్వరమే పూర్తి చేసి, నిందితులకు శిక్షలు విధించాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
ఉగ్రవాదులకు నిధులు అందించడానికి లాభాపేక్షలేని సంస్థలను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఉద్దేశించిన చర్యలను హానికరమనే దృష్టితో అమలు చేయాలని, ఉగ్రవాదులకు నిధులు అందిస్తే కలిగే అనర్థాల గురించి ఆ సంస్థలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించింది.
రాజకీయ ప్రముఖులు, లేదా రాజకీయాలతో సంబంధం ఉన్న అధికారుల వంటి వారి విషయంలో- ఆర్థిక సంస్థలు అనేక చర్యలు తీసుకుంటున్నా, సాంకేతిక నిబంధనలను పూర్తిగా అమలు చేయాలన్న దృక్కోణంలో కొన్ని సంస్థలకు మినహాయింపులు ఉన్నాయి. ఆయా సంస్థలు పూర్తిగా నిబంధనలు పాటిస్తున్నట్లు సమాచారాన్ని అందించేలా చూడాల్సి ఉంది. ఆర్థికేతర వ్యవస్థలూ, క్లయింట్ల తరఫున పరోక్ష సంపదను నిర్వహించేవారూ, ఆయా రంగాలపై నిఘా ఉంచడం విషయంలో భారతదేశం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. విలువైన లోహాలు, జెమ్స్ రంగంలోని డీలర్లపై డబ్బుపరంగా ఆంక్షలు విధించాల్సిన అవసరం కూడా ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2056970)
సందర్శకుల సూచీ సంఖ్య : : 138