ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఎన్‌పిఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


తెలంగాణలోని మూడు ప్రాంతాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు న్యూఢిల్లీలో జరిగిన ప్రారంభ కార్యక్రమాన్ని వీడియో అనుసంధానం ద్వారా తిలకించారు

Posted On: 18 SEP 2024 8:15PM by PIB Hyderabad

కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రకటించిన మేరకు, ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు.

ఎన్‌పీఎస్ వాత్సల్య ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఎన్‌పీఎస్ వాత్సల్య సభ్యత్వం కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం, పథకం వివరాలతో కూడిన కరపత్రం విడుదల అలాగే కొత్తగా సభ్యులుగా చేరే మైనర్‌లకు పర్మనెంట్ రిటైర్మెంట్ నంబర్ (పిఆర్ఎఎన్) కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

న్యూఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రారంభ కార్యక్రమ సమయంలోనే తెలంగాణలోని 3 ప్రాంతాలలో మూడు ఎన్‌పీఎస్ వాత్సల్య ఈవెంట్‌లను నిర్వహించారు.

 హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలోని ప్రభుత్వ మోడల్ హైస్కూల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బొల్లారంలో గల కేంద్రీయ విద్యాలయ, హనుమకొండలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఈ ఎన్‌పీఎస్ వాత్సల్య ప్రారంభ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలలో ఆయా జిల్లాల లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ (ఎల్‌డిఎంలు), డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్స్ (డిడిఎంలు), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్), తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ (టిజిబి) ప్రతినిధులతో పాటు ఆయా పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 2056404) Visitor Counter : 64