పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పారిస్ లో జరుగుతున్న ‘ఐ ఎఫ్ టీ ఎం టాప్ రెసా’ 2024 పర్యాటకానికి ప్రోత్సాహం!


ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే వైవిధ్య ప్రత్యామ్నాయాలను అందిస్తున్న ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా పెవిలియన్’

సందర్శకులను ఆకర్షిస్తున్న యోగా ప్రదర్శనలు

Posted On: 18 SEP 2024 12:04PM by PIB Hyderabad

ఫ్రాన్స్ దేశం పారిస్ లో సెప్టెంబర్ 17 నుంచి 19 వరకూ జరిగే ప్రతిష్టాత్మక ‘ఐ ఎఫ్ టీ ఎం టాప్ రెసా’ 2024 పర్యాటక వ్యాపార ప్రదర్శనలో మన దేశ పర్యాటక శాఖ పాల్గొంటోంది.


కేంద్రంతో పాటు, మేఘాలయ, జమ్ము కాశ్మీర్ పర్యాటక శాఖ అధికారులు, ప్రముఖ  పర్యాటక రంగ నిపుణుల  సమక్షంలో ఫ్రాన్స్ లో  భారత రాయబారి శ్రీ జావెద్ అష్రఫ్, ఇన్ క్రెడిబుల్ ఇండియా పెవిలియన్ ను ప్రారంభించారు.

మన దేశ విలక్షణ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం, ఆధునిక పర్యాటక అవకాశాలను ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా పెవిలియన్’  ప్రదర్శిస్తోంది. వినూత్న పర్యాటక ప్రాంతాలు, ఉత్పత్తుల గురించి తెలియచేయడమే కాక,  స్థానిక టూర్ ఆపరేటర్లు ఈ రంగంలోని అంతర్జాతీయ భాగస్వాములతో సంభాషించే అవకాశాన్ని ఈ పెవిలియన్ కల్పిస్తోంది. ఇక్కడ జరుగుతున్న యోగా ప్రదర్శనలు  సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

కీలక అంతర్జాతీయ విపణుల్లో తన స్థానాన్ని బలపరుచుకోవడంతో పాటు మన దేశాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్యను పెంచుకునే లక్ష్యంతో భారత్  ఈ  ప్రదర్శనలో పాలుపంచుకుంటోంది.

2023 లో భారత్ లో  92.4 లక్షల మంది విదేశీయులు పర్యటించగా, వీరిలో 18 లక్షల మంది ఫ్రాన్స్ కు చెందిన వారే. భారత్ ను సందర్శించే అధిక పర్యాటకుల దేశాల్లో ఫ్రాన్స్  11 వ స్థానంలో ఉన్నది.

పర్యాటక సంస్థలు, టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, హోటల్ యాజమాన్యాలు, క్రూయిజ్ సంస్థలు, పర్యాటక సాంకేతిక నిపుణులు సహా పర్యాటక ఆతిధ్య రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనలో భాగమవడం పరిపాటి.


 

****


(Release ID: 2056242) Visitor Counter : 51