ప్రధాన మంత్రి కార్యాలయం

రైతుల సంక్షేమం కోసం అన్నిచర్యలు, నిర్ణయాలు తీసుకుంటాం: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 14 SEP 2024 6:32PM by PIB Hyderabad

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, రైతాంగ సంక్షేమం కోసం గ్రామీణ ఉపాధి సృష్టి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

వ్యవసాయ ఆదాయాన్ని, గ్రామీణ ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో ఇటీవల తీసుకున్న నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, ఉల్లి ఎగుమతి సుంకం తగ్గింపు, వంటనూనెలపై దిగుమతి సుంకం పెంపు వంటి నిర్ణయాలు మన ఆహార ఉత్పత్తిదారులకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఈ నిర్ణయాల వల్ల వారి ఆదాయం పెరగడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు.

ప్రధానమంత్రి 'ఎక్స్' పోస్టులో ఇలా పేర్కొన్నారు:

దేశ ఆహార భద్రత కోసం రేయింబవళ్లు శ్రమిస్తోన్న రైతు సోదరసోదరీమణుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉల్లి ఎగుమతి సుంకం తగ్గించడం లేదా వంట నూనెల దిగుమతి సుంకం పెంచడం వంటి అనేక నిర్ణయాలు మన అన్నదాతలకు గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తాయి. దీనివల్ల వారి ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.”

 

 

 

 ****

MJPS/ST



(Release ID: 2055110) Visitor Counter : 7