ఆయుష్
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచార ఉద్యమం 3.0లో భాగంగా 1346 ప్రజా ఫిర్యాదులను పరిష్కరించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

Posted On: 12 SEP 2024 1:41PM by PIB Hyderabad

 పని ప్రదేశాన్ని మెరుగుపరచడంతో పాటు పరిసరాల పరిశుభ్రతను పరిరక్షించే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక ప్రచార ఉద్యమం 3.0ని ముందుకు తీసుకుపోవడంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ పురోగతిని సాధించింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం చేసిన సన్నాహాల్లో భాగంగా మంత్రిత్వ శాఖ గత నవంబరు నుంచి కిందటి నెల మధ్య కాలంలో వేర్వేరు అంశాలను గుర్తించి పరిష్కరించింది. వీటిలో పార్లమెంటు సభ్యులు సూచించిన 33 అంశాలు, పార్లమెంటులో ఇచ్చిన 18 హామీలు, 1346 ప్రజా ఫిర్యాదులు, 187 ప్రజా వినతులతో పాటు 765 ఫైల్ మేనేజ్‌మెంట్ పనులు, ఇవి కాక రిసరాల పరిశుభ్రతకు సంబంధించిన ప్రచార ఉద్యమాలకు సంబంధించినవి మరో పదకొండు ఉన్నాయి.

పని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడంపని ప్రదేశంలో సమస్యల్ని పరిష్కరించడం ద్వారా చేస్తున్న పనిగొప్ప అనుభూతిని కలిగించేలా చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. మంత్రిత్వ శాఖ కు చెందిన కార్యాలయాల్లో  అక్కర్లేని సామాన్లను తొలగించి, పరిశుభ్రతను పరిరక్షించడం అనే అంశాలకు ఈ ప్రచార ఉద్యమం పెద్దపీటను వేస్తున్నది. ఒక ఉత్తమమైన వాతావరణాన్ని పెంచి పోషిస్తూ, ఉద్యోగులు వారి పనితీరును మెరుగు పరచుకునేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు.

ప్రస్తుతం ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0 కోసం నడుం బిగిస్తున్న  మంత్రిత్వ శాఖ తన అధికారులందరు ఒక ప్రతిజ్ఞను స్వీకరించేటట్టు చేసి, అలా వారు ప్రతిన చేయడం ద్వారా స్వచ్ఛమైన, వ్యర్థాలకు తావు ఉండనటువంటి భారతదేశాన్ని ప్రోత్సహించాలని కంకణం కట్టుకొన్నది.  ఈ ప్రచార ఉద్యమం సాగే కాలంలో లక్ష్యాలను సాధించడంలో సాఫల్యం కోసం పాటుపడాలంటూ సీనియర్ అధికారులకు కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కోటేచా విజ్ఞప్తి చేశారు. రోజువారీ పురోగతిని పర్యవేక్షించే బాధ్యతను ఒక జట్టుకు అప్పగించారు. వేర్వేరు సంస్థలు, కౌన్సిళ్లు, వాటి ఆవరణలను, బస్ స్టేషన్లనూ, పార్కులను, హెర్బల్ గార్డెన్లనూ, జలాశయాలను ఇతర బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచేందుకు పూనుకొన్నాయి.  ఈ కార్యక్రమంలో భాగంగా ఆయుష్ సమాజం సభ్యులతోపాటు, ఉన్నతాధికారులు ఆయుష్ భవన్ ను, ఆ భవనం చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చే పనిలో పాలుపంచుకొన్నారు.  స్వచ్ఛత అభియాన్ మాదిరిగానే, ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా తన ఆధ్వర్యంలో అమలవుతున్న దేశ వ్యాప్త ప్రచార ఉద్యమంలో చురుకైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని తన పరిశోధన మండళ్లనూ, జాతీయ సంస్థలనూ ఆదేశించింది.

 


(Release ID: 2054170) Visitor Counter : 60