సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
మహాత్మా గాంధీకి అంకితం చేస్తూ రూపొందిన ప్రత్యేక రైల్వే కోచ్
రాజ్ ఘాట్ లోని గాంధీదర్శన్ లో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
Posted On:
10 SEP 2024 6:42PM by PIB Hyderabad
మహాత్మా గాంధీకి అంకితం చేస్తూ తయారు చేసిన ప్రత్యేక రైల్వే కోచ్‌ను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించనున్నారు. బుధవారం (సెప్టెంబర్ 11న) రాజ్‌ఘాట్‌లోని గాంధీదర్శన్ లో ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ వినూత్న ప్రదర్శనను రైల్వే మంత్రిత్వ శాఖ అందించింది. ఇందుకోసం మహాత్మా గాంధీ కాలం నాటి రైల్వే కోచ్‌ను తీసుకొని దానిని చాలా జాగ్రత్తగా పునరుద్ధరించారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో దేశాన్ని ఏకం చేయడానికి, న్యాయం, సమానత్వ సాధనకోసం గాంధీజీ చేపట్టిన మిషన్లో ఆయన రైలు ప్రయాణాలు కీలకంగా నిలిచాయి.
మహాత్మా గాంధీ భారత ఉపఖండం అంతటా మూడో తరగతి రైల్వే కంపార్ట్‌మెంట్‌లలో చేసిన తొలి ప్రయాణాలు దేశం పట్ల ఆయనలో అవగాహనను , సమైక్య దేశంపట్ల ఆయనలో పరిశీలనాశక్తిని రూపొందించడంలో కీలకంగా నిలిచాయి.. ఈ ప్రయాణాలు గాంధీ జీవితంలో కీలక పాత్ర పోషించాయి. ఇవి అన్ని వర్గాల ప్రజలతో మమేకమవ్వడానికి, వారి పోరాటాలను అర్థం చేసుకోవడానికి ఆయనకు ఉపయోగపడ్డాయి. సత్యం, అహింస , సామాజిక న్యాయాలకు సంబంధించిన తాత్వికతను ఆయనలో పెంపొందింపచేయడానికి ఈ ప్రయాణాలు దోహదం చేశాయి. అంతే కాదు సమష్టి బలం ప్రాధాన్యతను గ్రహించడానికి ఈ ప్రయాణాలు వీలు కల్పించాయి. అణచివేతకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో దేశ ప్రజలను ఏకం చేయడానికి ఈ ప్రయాణాలు ఆయనకు ఉపయోగపడ్డాయి. ఏకీకృత, సమ్మిళిత భారతదేశ సాధనకోసం ఆయన చేపట్టిన కార్యక్రమంలో ఈ రైల్వే ప్రయాణాలు ఆయనకు కీలకమైన సాధనంగా మారాయి.
****
(Release ID: 2053743)
Visitor Counter : 48