మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఉపాధ్యాయ విద్యా సంస్థలు 2021-22 & 2022-23 విద్యా సంవత్సరాలకు పనితీరు మదింపు నివేదికల దాఖలుకు ఎన్‌సిటిఇ నోటీసు జారీ

Posted On: 10 SEP 2024 12:34PM by PIB Hyderabad

నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిటిఇ) ఒక చట్టబద్ధ సంస్థ; ఈ సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్1993 (సంఖ్య 73/1993) కు అనుగుణంగా 1995 ఆగస్టు 17న  ఉనికి లోకి వచ్చింది.  దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్య తాలూకు ప్రణాళికయుక్తసమన్వయభరిత వికాస సాధనకుఉపాధ్యాయ విద్యా వ్యవస్థ నియమాలు, ప్రమాణాలతో పాటు తత్సంబంధిత అంశాల క్రమబద్ధీకరణకు ఈ సంస్థను స్థాపించారు. 

 

గుర్తింపును పొందిన సంస్థలలో జవాబుదారీతనాన్ని అమలుపరచడానికి, దేశమంతటా ఉపాధ్యాయ విద్య రంగంలో ప్రమాణాలను సంబంధిత అంశాలను మెరుగుపరిచేందుకు ఎన్‌సిటిఇ యాక్ట్, 1993 నిబంధనలుకౌన్సిల్ నిర్దేశించిన ఆదర్శాలుప్రమాణాలుఇంకా మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా సంస్థలు వాటి విధులను నిర్వహిస్తున్నదీ లేనిదీ తెలుసుకోవడానికి కౌన్సిల్ గత నెల 5న నిర్వహించిన 61వ సర్వ భ్య సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దీని ప్రకారం, ఉపాధ్యాయ విద్యా సంస్థలు (టిఇఐస్) అన్నీ 2021-22 & 2022-23 విద్యా సంవత్సరాల వారీ పనితీరు మదింపు నివేదికల (పిఎఆర్ స్) ను ఎన్‌సిటిఇ (NCTE) పోర్టల్ లో విధిగా సమర్పించాలి.

కౌన్సిల్ తీసుకొన్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎన్‌సిటిఇ ఈ నెల 9న ఒక బహిరంగ ప్రకటనను జారీ చేసింది.  ఈ ప్రకటన  ఎన్ సిటిఇ వెబ్ సైట్  https://ncte.gov.in   లో ఉంది. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ విద్యా సంస్థలు 2021-22 విద్యా సంవత్సరంతో పాటు 2022-23 విద్యా సంవత్సరానికి పిఎఆర్ స్ ను https://ncte.gov.in    పోర్టల్ లో సమర్పించవలసి ఉంటుంది.  పిఎఆర్ పోర్టల్  సంబంధిత లింకు https://ncte.gov.in/par/  ను కూడా బహిరంగ ప్రకటనలో ఇచ్చారు.  పిఎఆర్ ను ఆన్ లైన్ మాధ్యమం ద్వారా 2024 సెప్టెంబరు 9 నుంచి 2024 నవంబరు 10 లోగా (రాత్రి 11:59 నిమిషాల్లోపల) దాఖలు చేయవలసి ఉంటుంది.

 

***



(Release ID: 2053508) Visitor Counter : 4