రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

భిన్న సందర్భాల్లో సైనికులకు తోడ్పడే సూత్రావళిని విడుదల చేసిన సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

Posted On: 09 SEP 2024 4:10PM by PIB Hyderabad

సాధారణ సమయాల్లోనూ, యుద్ధ పరిస్థితుల్లోనూ సైనిక విభాగం అనుసరించాల్సిన నియమ నిబంధనల సూత్రావళి తో కూడిన ఒక ప్రచురణను త్రివిద దళాల ప్రధానాధికారి(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూ ఢిల్లీలో త్రివిద దళాల ప్రధానాధికారుల కమిటీ(సీఓఎస్సీ) సమావేశంలో విడుదల చేశారు. నేటి సంక్లిష్ట సైనిక వాతావరణంలో ఈ సూత్రావళి కమాండర్‌లకు అధికారిక నిర్ణయాల్లో మార్గనిర్దేశం చేస్తూ కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ అధికారిక నిర్ణయం వల్ల హిందూ మహాసముద్ర ప్రాంతంలో సాధారణ, యుద్ధ సమయాల్లో వివిధ కార్యకలాపాలను విస్తృత స్థాయిలో నిర్వహించే అవకాశం సాయుధ దళాలకు లభిస్తుంది. ఈ కార్యకలాపాలు తద్వారా వివిధ సందర్భాలలో కీలక పాత్ర పోషించడమే గాక సాయుధ దళాల మధ్య సమన్వయం, ఏకీకరణకు ఉత్తమ ఉదాహరణగా నిలుస్తాయి.

ఈ ఏడాది  మొదట్లో సైబర్‌స్పేస్ కార్యకలాపాలకు సంబంధించిన అధికారిక ప్రచురణ వెలువడింది. ఇప్పుడు తాజాగా ఈ ప్రచురణ విడుదలైంది సాయుధ బలగాల కార్యకలాపాల్లో ముఖ్యంగా, యుద్ధ, సాధారణ సమయాల్లో అనుసరించాల్సిన పద్ధతులపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

 

****



(Release ID: 2053310) Visitor Counter : 47