వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఎం గతిశక్తి కింద 18 రోడ్ ప్రాజెక్టుల అధ్యయనం
Posted On:
06 SEP 2024 5:05PM by PIB Hyderabad
పీఎం గతిశక్తి చొరవ కింద నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్పిజి) 78వ సమావేశం న్యూఢిల్లీలో పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) అదనపు కార్యదర్శి శ్రీ రాజీవ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్ టిహెచ్) ప్రతిపాదించిన పద్దెనిమిది కీలకమైన రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మూల్యాంకనం చేయడంపై సమావేశం దృష్టి సారించింది. తమిళనాడు, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్‌తో సహా వివిధ రాష్ట్రాల్లోని ఈ ప్రాజెక్టులు, పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపి)లో వివరించిన సమగ్ర ప్రణాళిక సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి.
తమిళనాడు, కేరళలో ప్రాజెక్టులు
మదురై-కొల్లం ఐసీఆర్ (రెండు ప్రాజెక్టులు): రోడ్ కారిడార్ రెండు రాష్ట్రాలు అంటే తమిళనాడు, కేరళ మీదుగా వెళుతున్నందున ఈ అలైన్‌మెంట్ రెండు విభిన్న ప్రాజెక్టులలో అభివృద్ధి చేశారు. ఈ 4-లైన్ల కారిడార్ 129.92 కి.మీ (తమిళనాడులో 68.30 కి.మీ, కేరళలో 61.62 కి.మీ) విస్తరించి ఉంది. ప్రయాణ దూరాన్ని తగ్గించడం, ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం, పరిశ్రమలు, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు నేరుగా ప్రయోజనం చేకూర్చడం ఈ రెండు ప్రాజెక్టుల లక్ష్యం. కారిడార్ ప్రయాణ దూరాన్ని 10 కి.మీ తగ్గించి సగటు వేగాన్ని రెట్టింపు చేస్తుందని అంచనా. ఇది సరుకు రవాణాను గణనీయంగా పెంచుతుంది, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
మదురై-ధనుష్కోడి హైవే: ఈ 46.67 కి.మీ 4-లేన్ విస్తరణ ప్రధాన ధార్మిక, పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరచడంతోపాటు ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది.
చెన్నై-మహాబలిపురం-పాండిచ్చేరి కారిడార్: ఈ 46.05 కి.మీ 4-లైన్ల ప్రాజెక్ట్ ఆర్థిక కారిడార్‌లతో తీరప్రాంతాల కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది పర్యాటకం, స్థానిక పరిశ్రమల అభివృద్ధికి కీలకమైనది.
తోపూర్ ఘాట్ సెక్షన్ ను మెరుగుపరచడం: తమిళనాడులోని కొండ ప్రాంతాలలో 6.60 కి.మీ అధిక సామర్థ్యం గల 8-లైన్ల రోడ్ ప్రాజెక్ట్ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ఒక క్లిష్టమైన భాగం ఇది. ఈ ప్రాజెక్ట్ దీని భద్రత, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాజెక్టులు
బెలగావి రింగ్ రోడ్ (ఎన్ హెచ్ 848 ఆర్): ఈ 4-లైన్ల రహదారి 75.39 కి.మీ విస్తీర్ణంలో ఉంది. పట్టణ ట్రాఫిక్‌ను తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కర్ణాటకలోని పారిశ్రామిక కేంద్రాల కనెక్టివిటీని మెరుగుపరచడం దీని లక్ష్యం.
తుమకూరు బైపాస్: 44.10 కిమీల 4-లైన్ల వ్యూహాత్మక బైపాస్ హైవే తుమకూరు నగరం చుట్టూ ట్రాఫిక్ ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం.
భోపాల్-సాగర్ ఎకనామిక్ కారిడార్: 4-లైన్ల 138.00 కి.మీ రోడ్ కారిడార్ మధ్యప్రదేశ్ అంతటా నిరంతరాయంగా ఉండేలా కనెక్టివిటీని సులభతరం చేయడానికి రూపొందించారు. ఇది ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
గ్వాలియర్ నగరం వెస్ట్రన్ బైపాస్: ఈ 4-లేన్ 56.90 కిమీ బైపాస్ పట్టణ చైతన్యాన్ని మెరుగుపరచడం, గ్వాలియర్‌లో రద్దీని తగ్గించడం, ప్రాంతం ఆర్థిక అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
అయోధ్య నగర్ బైపాస్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రూపొందించిన 6-లైన్ల 16.44 కి.మీ.
మహారాష్ట్ర, తెలంగాణలో ప్రాజెక్టులు
అహ్మద్ నగర్ - సోలాపూర్ కారిడార్ 4-లైన్ల 59.22 కి.మీ రోడ్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధికి తోడ్పడడం దీని లక్ష్యం.
తలేగావ్-చకన్-శిక్రాపూర్ కారిడార్: 4-లైన్లే 54.00 కి.మీ రోడ్ ప్రాజెక్ట్ సరుకు రవాణాను క్రమబద్ధీకరిస్తుంది, పూణే సమీపంలోని ఇండస్ట్రియల్ జోన్లకు ప్రయోజనం చేకూరుస్తుంది.
జగిత్యాల్-కరీంనగర్ హైవేలు: తెలంగాణలోని ఈ 4-లైన్ రోడ్ ప్రాజెక్ట్, మొత్తం 58.87 కి.మీ.లు విస్తరించి, రాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో కీలకం.
ఆర్మూర్-జగిత్యాల్-మంచిర్యాల హైవే: తెలంగాణలోని జగిత్యాల-కరీంనగర్ హైవేల హై-స్పీడ్ కారిడార్‌ను విస్తరించే ఈ 4-లైన్ల 131.90 కి.మీ రహదారి ప్రాజెక్ట్ రాష్ట్రంలోని ప్రయాణ మార్గాలను అనుసంధానం చేస్తుంది. ప్రధాన మార్కెట్లు, ఆర్థిక కేంద్రాలను కూడా కలుపుతుంది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్ ప్రాజెక్టులు
బద్వేల్-నెల్లూరు కారిడార్: ఆంధ్రప్రదేశ్‌లో 108.13 కి.మీ విస్తరించి ఉన్న ఈ 4-లైన్ల హైవే, వ్యవసాయ ప్రాంతాలు, మార్కెట్‌ల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది.
సంబల్‌పూర్ రింగ్‌రోడ్: ఈ 4-లైన్ల రహదారి ప్రాజెక్టులు ఒడిశాలో 35.38 కి.మీ. రద్దీని తగ్గించడం మరియు ఈ ప్రాంతంలోని కీలకమైన ఓడరేవుల దగ్గర పారిశ్రామిక వృద్ధికి తోడ్పాటు అందించడం అవసరం.
కటక్ పారాదీప్ కారిడార్: ఒడిషాలో 86.79 కి.మీ విస్తరించి ఉన్న 4-లైన్ల హైవే పారాదీప్ పోర్ట్ ఆర్థిక నోడ్‌లకు కీలకమైన అనుసంధానం, ఇతర అధిక సామర్థ్యం గల హైవేలకు కూడా కనెక్ట్ అవుతుంది. ఇది సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
బకర్‌పూర్-మాణిక్‌పూర్-సాహెబ్‌గంజ్-అరెరాజ్-బెట్టియా హైవే: బీహార్‌లో 4-లైన్ల 162.95 కి.మీ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ ప్రాజెక్ట్ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఆర్థిక అవకాశాలను మెరుగుపరచడంపై దృష్టి సారించింది.
పీఎం గతిశక్తి నిబంధనలు- బహుముఖ మౌలిక నిర్మాణం, ఆర్థిక, సామాజిక కూడళ్లకు చేరుకునే అవకాశాలు, బహుళ రవాణా వ్యవస్థల మధ్య సంబంధం, సమస్యల్లేకుండా అన్నీ కలిసి పని చేయడానికి ఉన్న వీలు- వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ 18 ప్రాజెక్టులనూ ఎన్పీజీ అధ్యయనం చేసింది. వివిధ రవాణా వ్యవస్థలను అనుసంధానం చేయడం ద్వారా దేశ నిర్మాణంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్రను పోషిస్తాయని, ఆర్థిక-సామాజిక ప్రయోజనం కలుగుతుందని, అన్ని ప్రాంతాలూ అభివృద్ధికి నోచుకుంటాయని భావిస్తున్నారు.
***
(Release ID: 2052787)