రాష్ట్రపతి సచివాలయం
సింబయోసిస్ ఇంటర్నేషనల్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2024 2:47PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము మహారాష్ట్ర లోని పుణె లో సింబయోసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) లో ఈ రోజు జరిగిన ఇరవై ఒకటో స్నాతకోత్సవంలో పాలుపంచుకున్నారు.
విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. విద్యార్థులు ప్రస్తుతం ఎంత సమర్థులుగా మారారంటే వారు వారి వ్యక్తిత్వంతో, జ్ఞానంతో దేశ, విదేశాలలో సానుకూల మార్పును తీసుకు రాగలుగుతారు అని రాష్ట్రపతి పేర్కొన్నారు. వారు మేనేజ్మెంట్, ఆరోగ్య సంరక్షణ, న్యాయశాస్త్రం, సామాజిక శాస్త్రాలు, ఇంకా ఇతర రంగాలలో నవకల్పన, కృత్రిమ మేధ (ఎఐ) లతో పాటు మెషిన్ లెర్నింగ్ రంగాలలో ప్రభావవంతమైన తోడ్పాటును అందించగలరని రాష్ట్రపతి అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన, విభిన్న సముదాయాలకు చెందిన సంస్కృతి తో పాటు వారి వర్తమాన అవసరాలను అర్థం చేసుకోవాలని విద్యార్థులను రాష్ట్రపతి కోరారు. ఈ తరహా జ్ఞానం ఆధారంగా ప్రతి ఒక్కరి వికాసానికి, ప్రత్యేకించి సమాజంలో ఆదరణకు నోచుకోకుండా దూరంగా ఉండిపోయిన వర్గాలకు చెందిన వారి వికాసంలో సహాయకారి కాగలిగిన సాఫ్ట్ వేర్ ను, ఆరోగ్య సంరక్షణ ఉత్పాదనలను, మార్కెటింగ్ వ్యూహాలను విద్యార్థులు సిద్ధం చేయాలని, స్థిరత్వాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రపతి సూచించారు. విద్యార్థులకు వారి లక్ష్యాల ను సాధించడంలో వారికి స్టార్ట్-అప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇంకా డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు కూడా సాయపడతాయని ఆమె అన్నారు.
సింబయోసిస్ ఇంటర్నేషనల్ లో చదువుకొంటున్న సుమారు 33,000 మంది విద్యార్థులలో అమ్మాయిల సంఖ్య, అబ్బాయిల సంఖ్య దాదాపు సరి సమానంగా ఉందని రాష్ట్రపతి అంటూ, మహిళా శక్తి పురోగతి పౌరులు గర్వపడే అంశం ఒక్కటే కాక దేశ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన కొలబద్ధగా కూడా ఉంటుందన్నారు. సింబయోసిస్ డీమ్డ్ యూనివర్సిటీ మహిళలకు, పురుషులకు సమ ప్రాధాన్యాన్ని ఇవ్వడంతో పాటు అమ్మాయిలు విద్యార్జన చేయడానికి అవసరమైన సదుపాయాలను, తగిన వాతావరణాన్ని సమకూర్చుతోందని తెలుసుకొని తాను సంతోషించానని రాష్ట్రపతి అన్నారు. మహిళా విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేటట్టు వారిని ప్రోత్సహించడంతో పాటు వారి కోసం సురక్షిత, సమర్థనాత్మక పరిసరాలను ఏర్పరచాలని విద్యబోధన సంస్థలన్నింటిని రాష్ట్రపతి కోరారు.
వైద్య సేవలను మెరుగు పరచే దిశలో ఒక అడుగును ముందుకు వేసి ‘సింబయోసిస్ ఆరోగ్య ధామ్’ ను ఏర్పాటు చేయడాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. సింబయోసిస్ డీమ్డ్ యూనివర్సిటీ ఆవరణకు పరిసర ప్రాంతాలలోని గ్రామాల కుటుంబాల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని సంచార వైద్య శాలలను నిర్వహిస్తూ ఉన్నారన్న సంగతి తనకు ఆనందాన్ని కలిగించిందని రాష్ట్రపతి అన్నారు. యువతరానికి జ్ఞానంతో పాటే అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని, విలువలను ప్రబోధించే విద్యను అందించడమే విద్య బోధన సంస్థలన్నిటి ధ్యేయం కావాలని రాష్ట్రపతి అన్నారు.
విద్య బోధన వ్యవస్థలో పరిశోధనను ప్రోత్సహించండంటే సింబయోసిస్ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు, అధ్యాపక సభ్యులకు, పూర్వ విద్యార్థులకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు. ఏళ్ళ తరబడి పరిశోధనలు నవకల్పనలకు దారితీస్తాయి, సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలను అందిస్తాయని ఆమె అన్నారు. భారతదేశంలో పరిశోధక విద్యార్థులు ఒక్క మన దేశ మస్యలకే కాకుండా ప్రపంచ సమస్యలకు కూడా పరిష్కారాలను కనుగొన గలరని ఆమె అన్నారు. జాతీయ విద్య విధానం సైతం పరిశోధనను ప్రోత్సహించాలని చెబుతోందని ఆమె అన్నారు. జల వనరుల నిర్వహణ, మూలకణాలు, నానోసైన్స్, వాతావరణ మార్పు వంటి అనేక విషయాలపై ఈ విశ్వవిద్యాలయంలో బహుళ విభాగాలతో కూడిన పరిశోధన కేంద్రాలు కృషి చేస్తున్నాయని తెలిసిందంటూ, ఈ అంశం తనను సంతోష పెట్టిందన్నారు.
ప్రతి ఒక్క పనిలో ఉత్తమ ఫలితాన్ని సాధించడానికి ప్రయత్నించండంటూ విద్యార్థులకు రాష్ట్రపతి సలహానిచ్చారు. ‘శ్రేష్ఠత్వం కోసం పరుగు పెట్టండి- విజయం మీ వెన్నంటి వస్తుంద’నే మాటలను విద్యార్థులు తప్పక వినే ఉంటారని ఆమె అన్నారు. అయితే చాలా సందర్భాలలో జరిగేది ఏమిటంటే కొంత మంది ఎక్కువ డబ్బును కలిగి వుండడం, ఒక పెద్ద ఇంటిని, ఒక పెద్ద కారును, ఇంకా ఇతర విషయాలను విజయ సూచికలుగా భావిస్తూ ఉంటారని ఆమె అన్నారు. అలాంటి వారు సాఫల్యానికి సిసలైన అర్థాన్ని గ్రహించగలుగుతారని, మరి ఇతరుల జీవన ప్రమాణాలను సైతం మెరుగు పరచేటటువంటి పనులకు నడుంబిగిస్తారన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2051551)
సందర్శకుల సూచీ సంఖ్య : : 76