రక్షణ మంత్రిత్వ శాఖ
సెంట్రల్ ఎయిర్ కమాండ్- ఏఓసీగా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
Posted On:
01 SEP 2024 1:49PM by PIB Hyderabad
సెంట్రల్ ఎయిర్ కమాండ్- ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ సెప్టెంబరు 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ 06 డిసెంబర్ 1986న భారతీయ వైమానికదళ ( IAF) ఫైటర్ స్ట్రీమ్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఎయిర్ ఆఫీసర్ అశుతోష్ ప్రయోగాత్మక టెస్ట్ పైలట్. అంతే కాదు ఆయన భారతీయ వైమానిక దళం ఇన్వెంటరీలో వివిధ రకాల విమానాలను 3,300 గంటల కంటే ఎక్కువ సమయం నడిపిన అనుభవం కలిగిన క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్. ఆయన ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (బంగ్లాదేశ్), నేషనల్ డిఫెన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థి. ఆపరేషన్ -సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్ వంటి అనేక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు.
37 సంవత్సరాల తన ప్రతిష్ఠాత్మక ఉద్యోగ జీవితంలో వైమానిక దళ అధికారి శ్రీ అశుతోష్ పలు ముఖ్యమైన విధులను నిర్వహించారు. కమాండింగ్ ఆఫీసర్‌గా ఐఏఎఫ్ ( lAF ) స్క్వాడ్రన్లలో ఒకదాన్ని అత్యాధునిక మిరేజ్ ఎయిర్ క్రాఫ్ట్ తో తీర్చిదిద్దారు. తరువాత వెస్ట్రన్ సెక్టార్‌లో ఫ్రంట్-లైన్ ఫైటర్ ఎయిర్ బేస్, సదరన్ సెక్టార్‌లో ప్రీమియర్ ఫైటర్ ట్రైనింగ్ బేస్‌కు నాయకత్వం వహించారు. ఆయన ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్‌లో డైరెక్టింగ్ స్టాఫ్‌గా పనిచేశారు.
శ్రీ అశుతోష్ సదరన్ ఎయిర్ కమాండ్ లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్ గా పని చేశారు. ఎయిర్ హెడ్ క్వార్టర్స్ లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్స్)గా, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్లాన్స్) గా తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వహించారు. సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా తాత్కాలిక బాధ్యతల్లో ఉన్నారు.
ఎయిర్ ఆఫీసర్ అశుతోష్ తన మునుపటి పదవీ కాలంలో అధునాతన సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా అనేక కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆత్మనిర్భరత- స్వయం సమృద్ధి విధానానికి ప్రాధాన్యత ఇస్తూనే ఐఏఎఫ్ ఆధునీకరణకు కృషి చేశారు.
భారత వైమానిక దళం తన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకునేలా అన్ని సందర్భాలలో సెంట్రల్ ఎయిర్ కమాండ్ సంసిద్ధంగా ఉండేలా చూడడం ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ప్రధాన బాధ్యత.
ఆయన తన విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతులమీదుగా అతి విశిష్ట సేవా పతకం, వాయు సేన పతకం, విశిష్ట సేవా పతకాలను పొందారు.
***
(Release ID: 2050857)
Visitor Counter : 78