కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సుప్రీంకోర్టుకు 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్మారక తపాలా బిళ్ల ను విడుదల చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
31 AUG 2024 7:43PM by PIB Hyderabad
భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక స్మారక తపాలా బిళ్ల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున విడుదల చేశారు. జిల్లా న్యాయమూర్తుల సమావేశం తాలూకు ప్రారంభ సదస్సు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగ్గా ఆ కార్యక్రమంలో భాగంగా ఈ స్టాంపును ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డి.వై. చంద్రచూడ్, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మన దేశ న్యాయ వ్యవస్థ కు సుప్రీంకోర్టు చేస్తున్న గొప్ప సేవకు, దేశ న్యాయ/శాసన సంబంధి ముఖచిత్రానికి మెరుగులు దిద్దడంలో సుప్రీం కోర్టు పోషిస్తున్న కీలక పాత్రకు ఈ స్మారక తపాలా బిళ్ల సంకేతాత్మకంగా ఉంది. 1950వ సంవత్సరంలో జనవరి 28న జాతి ఏర్పాటు చేసుకొన్న సుప్రీంకోర్టు చట్ట పాలన ను పరిరక్షించడంలోను, పౌరుల హక్కులను రక్షించడంలోను, దేశమంతటా న్యాయ పాలనకు పూచీ పడడంలోను అగ్రస్థానంలో నిలుస్తోంది.
మన దేశ న్యాయ చరిత్రలో చెక్కుచెదరని వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న సుప్రీంకోర్టుపై... స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడంపై సమాచార మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న తపాలా విభాగం గర్విస్తోంది.
ఈ కార్యక్రమం దేశంలో న్యాయాన్ని, చట్టపాలనను నిలబెట్టడంలో గడచిన ఏడున్నర దశాబ్దాలుగా సుప్రీంకోర్టు చాటుతున్న నిబద్ధతను ఓ ఉత్సవంగా నిర్వహించుకునేందుకు ఏర్పాటైన ఈ కార్యక్రమం భారతదేశ న్యాయపాలన వ్యవస్థ చరిత్రలోనే ఓ ప్రముఖ అధ్యాయంగా నిలుస్తుంది.
***
(Release ID: 2050686)
Visitor Counter : 82