నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

భారత పర్యాటక రంగంలో 20 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి స్కిల్ ఇండియాతో వీసా సంస్థ ఒప్పందం


పర్యాటక, ఆతిథ్య నైపుణ్య కౌన్సిల్ (టీహెచ్ఎస్సీ), వీసా మధ్య

3 సంవత్సరాల వ్యవధికి 1 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం


ఈ భాగస్వామ్యం ద్వారా 10 రాష్ట్రాల్లో కనీసం 20వేల మంది భారత యువతకు అందనున్న పర్యాటక సంబంధిత నైపుణ్యాభివృద్ధి

Posted On: 30 AUG 2024 5:10PM by PIB Hyderabad

నైపుణ్యాభివృద్ధివ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పర్యాటకఆతిథ్య నైపుణ్య కౌన్సిల్(టీహెచ్ఎస్సీ).. డిజిటల్ చెల్లింపులలో గ్లోబల్ లీడర్ అయిన వీసా సంస్థతో 1 మిలియన్ డాలర్ల విలువైన మూడేళ్ల వ్యవధికి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా కనీసం 20 వేల మంది భారత యువతకు పర్యాటక సంబంధిత నైపుణ్యాన్ని అందిస్తారు. నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ) సహాయ మంత్రివిద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

వీసా సంస్థ, పర్యాటక మంత్రిత్వ శాఖల మధ్య ఇప్పటికే కొనసాగుతోన్న సహకారాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేయనుంది. ఈ ఒప్పందం పర్యాటకులకు పర్యాటక సేవల అనుభవాన్ని పెంచడానికి అస్సాంగుజరాత్హిమాచల్ ప్రదేశ్పశ్చిమ బెంగాల్‌తో సహా 10 రాష్ట్రాల్లోని యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. టూర్ గైడ్లుకస్టమర్ సర్వీస్ ప్రతినిధులుప్రకృతి శాస్త్రవేత్తలుపారాగ్లైడింగ్ టాండమ్ పైలట్లు వంటి దేశీయ పర్యాటక పరిశ్రమలో ముఖ్యమైన రంగాలపై ఈ కార్యక్రమం దృష్టి పెట్టనుంది.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ జయంత్ చౌదరి మాట్లాడుతూ.. "భారతదేశ పర్యాటక పరిశ్రమ ఆర్థికవృద్ధిని పెంచడానికిదేశవ్యాప్తంగా లక్షల్లో ఉద్యోగాలను సృష్టించే అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు పర్యాటక రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేయడానికిభారతదేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మార్చడానికి వీసాతో ఈ భాగస్వామ్యం ఒక కీలకమైన ముందడుగు. యువత తమ భవిష్యత్తును రూపొందించుకునేందుకుదేశాభివృద్ధికి దోహదం చేయటానికి అవసరమైన నైపుణ్యాలుఅవకాశాలతో వారికి సాధికారత కల్పించడానికి ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది” అన్నారు.

వీసా వైస్ చైర్మన్చీఫ్ పీపుల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ కెల్లీ మహోన్ టులియర్ మాట్లాడుతూ.. "పర్యాటక రంగంలో అభివృద్ధి చెందడానికి నైపుణ్యాలతో దేశంలోని యువతకు సాధికారత కల్పించడం ద్వారా వారి ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా భారతదేశాన్ని సందర్శించే పర్యాటకుల మొత్తం అనుభవాన్ని మెరుగుపరచాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ పర్యాటకులకు భారతదేశాన్ని అగ్ర గమ్యస్థానంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు సహకరించటం కోసం నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ మద్దతుతో పాటు పర్యాటకఆతిథ్య నైపుణ్య కౌన్సిల్ (టీహెచ్ఎస్సీ)తో చేసుకున్న ఈ ఒప్పందం.. భారతదేశం పట్ల వీసా అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతుంది” అని వ్యాఖ్యానించారు.

దేశంలో ప్రముఖ చెల్లింపుల సంస్థగా ఉన్న వీసా గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ పర్యాటకాన్ని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలు తీసుకుంది. తన లోతైన డేటావిశ్లేషణ నైపుణ్యాలతో పర్యాటక మంత్రిత్వ శాఖకు విలువైన డేటాలోతైన వివరాలను అందించడం ద్వారా దేశానికి వచ్చే పర్యాటకులను పెంచడానికి చురుకుగా దోహదం చేసింది. తద్వారా ప్రపంచ వేదికపై భారతదేశం విభిన్న పర్యాటక గమ్యస్థానాలను ప్రోత్సహించడానికి సహాయపడింది.

జీడీపీలో 231 బిలియన్ డాలర్ల వాటా కలిగి, 42 మిలియన్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తూ పర్యాటక రంగం భారత ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. కరోనా మహమ్మారి అనంతరం ప్రయాణాలు పెరుగుతున్నందునప్రపంచ పర్యాటక కేంద్రంగా మారాలనే భారతదేశ ఆశయాలకు మద్దతు ఇవ్వడానికి నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి ఉండేలా ఎన్ఎస్‌డీసీ-వీసా ఉమ్మడిగా పని చేస్తాయి.


వీసా గురించి

వీసా (ఎన్వైఎస్ఈ: వి) 200 కంటే ఎక్కువ దేశాలుభూభాగాలలో వినియోగదారులువ్యాపారులుఆర్థిక సంస్థలుప్రభుత్వ సంస్థల మధ్య లావాదేవీలను సులభతరం చేస్తూ డిజిటల్ చెల్లింపులలో ప్రపంచ అగ్రగామిగా ఉంది. అత్యంత సృజనాత్మకసౌకర్యవంతమైనవిశ్వసనీయమైనసురక్షితమైన చెల్లింపుల ద్వారా ప్రపంచాన్ని అనుసంధానించడంవ్యక్తులువ్యాపారాలుఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడానికి వీలు కల్పించడం లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. ప్రతిచోటా ప్రతి ఒక్కరినీ కలుపుకుని ఉన్న ఆర్థిక వ్యవస్థలు ప్రతిచోటా ప్రతి ఒక్కరినీ ఉద్ధరిస్తాయనినగదు బదిలీ విషయంలో భవిష్యత్తుకు యాక్సెస్‌ను పునాదిగా చూస్తాయని ఈ సంస్థ విశ్వసిస్తుంది. Visa.com లో ఈ సంస్థ గురించి మరింత తెలుసుకోండి.

 
 


(Release ID: 2050521) Visitor Counter : 16


Read this release in: English , Urdu , Hindi , Punjabi