కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
వ్యవసాయ, గ్రామీణ కార్మికులకు జులై లో అఖిల భారత వినియోగదారు ధరల సూచీ
Posted On:
29 AUG 2024 4:19PM by PIB Hyderabad
వ్యవసాయ కార్మికులకు ఉద్దేశించిన అఖిల భారత వినియోగదారు ధరల సూచి (సిపిఐ - ఎఎల్) లోను, గ్రామీణ కార్మికులకు ఉద్దేశించిన అఖిల భారత వినియోగదారు ధరల సూచీ (సిపిఐ - ఆర్ఎల్) లోను ఈ ఏడాది జులై లో పదేసి పాయింట్ల వంతున పెరుగుదల నమోదైంది. దీంతో ఆ సూచీలలో సిపిఐ-ఎఎల్ 1290 కి చేరుకోగా, సిపిఐ - ఆర్ఎల్ 1302 పాయింట్లకు చేరుకొంది. (ఈ సూచీలకు 1986-87 = 100 పాయింట్లను ప్రామాణికంగా తీసుకుని లెక్కిస్తారు).
ఇదే నెల కు సిపిఐ-ఎఎల్ , సిపిఐ -ఆర్ఎల్ ల ఆధారంగా లెక్కించే వార్షిక ద్రవ్యోల్బణ రేటులు వరసగా 6.17 శాతం, 6.20 శాతం స్థాయిల వద్ద నిలవగా, కిందటి ఏడాది జులై లో ఇవి 7.43 శాతం మరియు 7.04 శాతంగా నమోదయ్యాయి. ఈ సంవత్సరం జూన్ లో సిపిఐ- ఎఎల్ విషయంలో ఇవే సంఖ్యలు 7.02 శాతంగాను, సిపిఐ- ఆర్ఎల్ విషయానికి వస్తే 7.04 శాతంగా ఉన్నాయి.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=2049762 లో ఇతర వివరాలు ఉన్నాయి.
****
(Release ID: 2050145)
Visitor Counter : 98