వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఎకరం విస్తీర్ణంలో 'మాతృ వనం' ఏర్పాటు: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
3 వేల నుంచి నాలుగువేల మొక్కలు నాటిన వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని 800 సంస్థలు: శ్రీ చౌహాన్
మొక్కలు నాటిన కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఉన్నతాధికారులు
#एक_पेड़_मां_के_नाम, #Plant4Mother ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
Posted On:
29 AUG 2024 1:54PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు #एक_पेड़_मां_के_नाम #Plant4Mother ప్రచారంలో భాగంగా ఐఏఆర్ఐకి చెందిన పూసా ప్రాంగణంలో మొక్కలు నాటారు. సుమారు ఎకరం విస్తీర్ణంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాతృవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్, డీఏఆర్ఈ, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన 200 మంది అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలోని వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఐసీఏఆర్ సంస్థలు, సీఏయూలు, కేవీకేలు, ఎస్ఏయూలు వాటి అనుబంధ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని 800కు పైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 3 వేల నుంచి 4 వేల మొక్కలు నాటారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 5 జూన్ 2024, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా #एक_पेड़_मां_के_नाम #Plant4Mother అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి ప్రస్తావించారు. ప్రధానమంత్రి తీర్మానాన్ని ధ్రువీకరిస్తూ, దేశంలోని మంత్రిత్వ శాఖలు నేడు ఒక ప్రజా ఉద్యమంగా #एक_पेड़_मां_के_नाम #Plant4Mother ప్రచారాన్ని ప్రారంభించినట్లు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు, ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు అందరూ ఉద్యమంలో పాల్గొని మొక్కలు నాటి తమ తల్లిని, భూమాతను గౌరవించాల్సిందిగా మంత్రి వారిని కోరారు.
అంతర్జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్, 2024 నాటికి దేశవ్యాప్తంగా 80 కోట్ల మొక్కలు, మార్చి 2025 నాటికి 140 కోట్ల మొక్కలు నాటేలా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ, అసోలా భాటి వన్యప్రాణి అభయారణ్యంలో 20 జూన్ , 2024 తేదీ నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రజలు తమ తల్లుల గౌరవార్థం చెట్లను నాటారు. పర్యావరణ స్పృహ, జీవనశైలిలో మార్పుపై భారత ప్రభుత్వం ప్రారంభించిన 'మిషన్ లైఫ్' ఉద్దేశాన్ని కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం నెరవేరుస్తోంది. చెట్లను పెంచడం సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధానం. మొక్కల పెంపకం ద్వారా నేల సారవంతమవుతుంది. నీటి నాణ్యత మెరుగుపడుతుంది, చెట్లు జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తాయి. చెట్లు రైతులకు కలప, కలపయేతర ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయ వనరులను కూడా అందిస్తాయి. మొక్కలు నాటడం ద్వారా భూసార క్షీణత తగ్గుతుంది, ఎడారీకరణను నిరోధించవచ్చు.
****
(Release ID: 2049967)
Visitor Counter : 106